DIY Flaxseed Hair Gel । జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగాలా? ఈ అవిసె గింజల జెల్ తలకు రాస్తే చాలు!-diy flaxseed hair gel to style your hair without damage helps regrowth treats scalp and more benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Flaxseed Hair Gel । జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగాలా? ఈ అవిసె గింజల జెల్ తలకు రాస్తే చాలు!

DIY Flaxseed Hair Gel । జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగాలా? ఈ అవిసె గింజల జెల్ తలకు రాస్తే చాలు!

HT Telugu Desk HT Telugu
Aug 04, 2024 01:33 AM IST

DIY Flaxseed Hair Gel: జుట్టు సంరక్షణ కోసం అనేక హోమ్ రెమెడీస్ ఉంటాయి. అందులో అవిసె గింజల జెల్ ఎప్పుడైనా ప్రయత్నించారా? ఈ జెల్ ఎలా చేయాలి, ఎలా వాడాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడ తెలుసుకోండి.

DIY Flaxseed Hair Gel
DIY Flaxseed Hair Gel (shutterstock)

Flax Seeds Nutrition and Benefits: అవిసె గింజలలో శరీరానికి అవసరమయ్యే స్థూల, సూక్ష్మపోషకాలు ఉన్నాయి. వీటిలో ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అవిసె గింజలను ఆరోగ్యానికి గొప్ప పోషకాహారంగా పరిగణిస్తారు. అయితే అవిసె గింజలు కేవలం ఒక ఆహార పదార్థంగానే కాకుండా, వీటితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అవిసె గింజలను ఆరోగ్యకరమైన జుట్టును పొందడం కోసం ఉపయోగిస్తున్నారు.

జుట్టు పెరుగుదలకు, స్కాల్ప్ పరిస్థితిని మెరుగుపరచడానికి అవిసె గింజల నూనెను ఉపయోగించవచ్చు. అవిసె గింజలతో తయారు చేసిన DIY జెల్ తలకు పెట్టుకోవడం ద్వారా జుట్టు మూలాలకు పోషణ అంది వెంట్రుకలు వేగంగా, పొడవుగా పెరుగుతాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఫ్లాక్స్ సీడ్‌లోని విటమిన్ ఇ స్కాల్ప్‌కు పోషణనిస్తుంది, ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టును పొందవచ్చునని చెబుతున్నారు.

అవిసె గింజలను స్మూతీలు, ఇతర ఆహార పదార్థాలపై చల్లుకొని ఆహారంగా తినడంతో పాటు, సమయోచితంగా అవిసె గింజల జెల్ జుట్టుకు ఉపయోగించడం వలన రెండు వైపుల నుంచి పోషణ లభిస్తుంది, జుట్టు మరింత దృఢంగా మారుతుంది అనే నమ్మకం ఉంది.

అవిసె గింజల జెల్ ను మీకు మీరుగా ఇంట్లోనే (Homemade) సులభంగా తయారు చేయవచ్చు. ఈ జెల్ మీరు తలకు పట్టించడం ద్వారా గొప్ప ప్రయోజానాలను పొందవచ్చు. అవిసె గింజల ఎలా తయారు చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

DIY Flaxseed Hair Gel - అవిసె గింజల జెల్ తయారు చేయడం ఎలా?

  1. ఒక గిన్నెలో నీరు తీసుకొని ఆ నీటిని మరిగించాలి. అందులో అరకప్పు అవిసె గింజలను వేసి మీడియం మంట మీద ఉడికించాలి.
  2. 10 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత అది చిక్కటి జెల్ వంటి మిశ్రమంలా తయారవుతుంది.
  3. ఈ మిశ్రమాన్ని చల్లబరిచిన తర్వాత జెల్ ను వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకొని నేరుగా తలకు వర్తింపజేయవచ్చు.
  4. ఇలా చల్లబడిన జెల్ లో మీరు అదనంగా ఒక 30 మి.లీల ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవచ్చు.

ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ మీ వద్ద లేకపోతే, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, షీ బటర్ లేదా అలోవెరా జెల్ కలపవచ్చు. వీటితో అవిసె గింజల జెల్ మరింత చిక్కగా, అద్భుతమైన ఉత్పత్తిగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వలన మీరు ప్రొఫెషనల్ హెయిర్ స్పా పొందిన ప్రయోజనం దక్కుతుంది.

అవిసె గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం మళ్లీ మరిగించిన నీటిలో వేసి జెల్ చేసి, నేరుగా ఉపయోగించవచ్చు. దీనితో మరింత మెరుగైన ప్రయోజనం ఉంటుంది.

అవిసె గింజల మిశ్రమాన్ని ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు:

జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది

అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఈ పోషకం అవసరం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కుదుళ్లకు పోషణ అందించడం, తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడం, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి.

చుండ్రును నివారింస్తుంది

అవిసె గింజలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది చుండ్రును నివారిస్తుంది, తలలో దురదను తగ్గించి, తలపై చర్మాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ను నేరుగా తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మందమైన వెంట్రుకల కోసం

అవిసె గింజలలో లిగ్నన్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న ఫైటోఈస్ట్రోజెన్లు. ఈ లిగ్నన్లు జుట్టు తంతువులను బలోపేతం చేయడానికి సహాయపడతాయి, వెంట్రుకలు మందంగా మారి జుట్టు విరిగిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.

జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది

అవిసె గింజలో జుట్టుకు అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి, ఇవి జుట్టును తేమగా ఉంచుతాయి, మంచి పోషణను అందిస్తాయి. తద్వారా జుట్టు ఆరోగ్యంగా సరైన ఆకృతిలో ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం