Petroleum Jelly Hacks । పెట్రోలియం జెల్లీని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు, మగవారు ఇక అదరగొట్టండి! -check 5 useful petroleum jelly hacks for men in their day to day life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Check 5 Useful Petroleum Jelly Hacks For Men In Their Day To Day Life

Petroleum Jelly Hacks । పెట్రోలియం జెల్లీని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు, మగవారు ఇక అదరగొట్టండి!

HT Telugu Desk HT Telugu
Mar 19, 2023 02:55 PM IST

Petroleum Jelly Hacks for Men: పెట్రోలియం జెల్లీతో ,చాలా ఉపయోగాలు ఉంటాయి, ముఖ్యంగా మగవారికి ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూడండి.

Petroleum Jelly Hacks for Men
Petroleum Jelly Hacks for Men (Unsplash)

మన దైనందిన జీవితంలో వివిధ పనులను సులభతరం చేయడానికి కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి. మన ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులు, పదార్థాలను వివిధ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదాహారణకు పెట్రోలియం జెల్లీ అనేది దాదాపు అందరి ఇళ్లల్లో అందుబాటులో ఉండే మృదువైన మైనం లాంటి మిశ్రమం. దీనిని మనం చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి, చర్మంపై పగుళ్లు నివారించడానికి ఉపయోగిస్తాము. పెట్రోలియం జెల్లీని కేవలం చర్మ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ఇతర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మగవారికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. షేవింగ్ చేసుకునేటపుడు జరిగే సాధారణ గాయాలను మాన్పడానికి, రోజూ వేసుకునే బూట్లకు మెరుపు తేవడానికి కూడా ఉపయోగించవచ్చు.

Petroleum Jelly Hacks for Men- పెట్రోలియం జెల్లీతో ఉపయోగాలు

మీరు మీ రోజూవారీ అవసరాల కోసం ఉపయోగపడే కొన్ని పెట్రోలియం జెల్లీ హ్యాక్స్ ఇక్కడ తెలుసుకోండి. ఇవి మీ వివిధ అవసరాలను తీరుస్తాయి, ఖర్చులను తగ్గిస్తాయి.

బూట్లకు షైనింగ్ కోసం

మీరు ధరించే బూట్లు రోజులు గడుస్తున్నాకొద్దీ పాతబడతాయి, దుమ్ము- ధూళి కారణంగా వాటి లుక్ చెడిపోతుంది. మీరు మళ్లీ వాటిని కొత్తవాటిలా మెరిసేలా చేయటానికి మీకు బూట్ పాలిష్ అవసరం లేదు, మీ వద్ద పెట్రోలియం జెల్లీ ఉంటే చాలు. ముందుగా మీ బూట్లను ఒక గుడ్డతో శుభ్రంగా తుడవండి, అనంతరం మీ బూట్లకు కొద్దిగా పెట్రోలియం జెల్లీ వర్తింపజేసి, మీరు ఎలాగైతే పాలిష్ చేసేటపుడు బ్రష్ తో రుద్దుతారో అలాగే పాలిష్ చేయండి. మీ పాత బూట్లు కొత్తవాటిలా మెరుస్తాయి.

డియోడరెంట్ దీర్ఘకాలం పాటు ఉంచడం

ఈ వేసవి కాలంలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దీనివలన మీరు మీ శరీరానికి ఉపయోగించే డియోడరెంట్ వాసన ప్రభావం కొద్దిసేపట్లో వెళ్లిపోతుంది. దీంతో మళ్లీ చెమట వాసన ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం ద్వారా డియోడరెంట్ వాసన చాలా సేపు ఉంటుంది. మీరు బాడీ స్ప్రే లేదా డియోడరెంట్ ఉపయోగించే ముందు, మీ శరీర భాగాలకు తేలికపాటి పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి, ఆపైన డియోడరెంట్ స్ప్రే చేసుకోండి. మీరు మునుపటి కంటే చాలా సేపటి వరకు సువాసనను వెదజల్లుతారు, చెమట సమస్య కూడా తగ్గుతుంది.

షేవింగ్ కట్స్ జరిగినపుడు

షేవింగ్ చేసుకునేటపుడు ఎక్కడైనా చర్మం కట్ అయితే ఆ ప్రాంతంలో పెట్రోలియం జెల్లీని వర్తించండి. ఇది ఇది అదనపు రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడుతుంది. గాయం వలన అయ్యే మచ్చలను తగ్గిస్తుంది. షేవింగ్ కట్స్ జరిగినపుడు మీ వద్ద ఏ ఆయింట్మెంట్ లేనపుడు పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

గోళ్లు ఆరోగ్యంగా ఉంచడానికి

సాధారణంగా మగవారు తమ గోళ్లపై ఎక్కువ శ్రద్ధ కనబరచరు. ఫలితంగా కొందరి మగవారి గోళ్లలో పగుళ్లు ఏర్పడటం, రంగు మారటం, పొడిగా నిర్జీవంగా మారినట్లు తయారవుతాయి. మీ గోళ్ల ఆరోగ్యం బాగుండాలంటే గోళ్లకు పెట్రోలియం జెల్లీని వర్తించండి, తద్వారా అది మీ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. గోళ్లు మృదువుగా, ప్రకాశవంతగా మారతాయి.

కనుబొమ్మలను హైలైట్ చేయడానికి

ఆడవారు కనుబొమ్మలను (Eye Brows) హైలైట్ చేయడానికి కాటుక వాడతారు. మగవారు పెట్రోలియం జెల్లీని వాడవచ్చు. మీకు కనుబొమ్మలలో వెంట్రుకలు తక్కువ ఉన్నప్పుడు, మీ కనుబొమ్మలు సరిగ్గా కనిపించనపుడు మీ కనుబొమ్మలపై కొద్దిగా వాసెలిన్‌ను పూయండి. కనుబొమ్మలు మందగా కనిపిస్తాయి.

మగవారు మీరు మీ దైనందిన జీవితంలో ఈ చిట్కాలను పాటించండి, మార్పును మీరే గమనించండి, ప్రతిరోజూ అదరగొట్టండి.

WhatsApp channel

సంబంధిత కథనం