Eyebrows Growth । ఇంద్రధనస్సు లాంటి కనుబొమ్మలు కావాలా.. ఇవిగో చిట్కాలు!
Eyebrows Growth: కళ్లకు కనుబొమ్మలే అందం, కానీ కొందరికి ఆ కనుబొమ్మలు పలుచగా ఉంటాయి, లేదా వెంట్రుకలు రాలిపోయి సరైన ఆకృతి పోతుంది. సహజంగా కనుబొమ్మలు పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి.
అందం గురించి వర్ణించాలంటే ముందుగా చెప్పేది కళ్ల గురించే. నేరేడుపళ్ల లాంటి కళ్లు, ముఖంలో ఒక వెలుగు తీసుకొస్తాయి. మరి అలాంటి కళ్లపై ఇంపైన కనుబొమ్మలు ఉంటే మరింత అందంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు ఇంద్రధనస్సు లాంటి కనుబొమ్మలు ఉంటే వారి అందం మరింత పెరుగుతుంది. కనుబొమ్మలకు మంచి ఆకృతిని ఇవ్వడానికి ఐబ్రో థ్రెడింగ్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళుతుంటారు. అలా ఆకృతిని అవ్వాలంటే ఒత్తైన కనుబొమ్మలు ఉండాలి. కొంతమందికి చాలా సన్నని కనుబొమ్మలు ఉంటాయి. దీనిని కప్పిపుచ్చేందుకు కనుబొమ్మలపై పెన్సిల్ రాసుకుంటారు. కానీ ఇది శాశ్వత సమస్య కాదు. మందపాటి కనుబొమ్మల కోసం ప్రతీసారి పెన్సిల్‌తో గీయటం, కాటుక రాయడం చేస్తే అది కొద్ది సేపటికి చెరిగిపోవచ్చు. కనుబొమ్మలు సహజంగా పెరిగితే మీ ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
కొన్ని చిట్కాలను సులభమైన పాటించడం ద్వారా మీ కనుబొమ్మలను అందంగా పెంచుకోవచ్చు.
ఆలివ్ నూనె
1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కు ఒక టేబుల్ స్పూన్ పటిక కలపండి. ఇప్పుడు అదే మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె , 1 టేబుల్ స్పూన్ బాదం నూనె వేసి ప్రతిదీ బాగా కలపండి. ఈ నూనెను గాజు సీసాలో నిల్వచేయండి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల నూనెను వేలితో తీసుకొని రెండు కనుబొమ్మలపై అప్లై చేసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి.
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ సెల్యులార్, ఫోలిక్యులర్ ఆరోగ్యానికి మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. తద్వారా కనుబొమ్మల పెరుగుదలతో పాటు మందంగా పెరిగేలా ఈ నూనె ప్రేరేపిస్తుంది. టీ ట్రీ ఆయిల్ ను చర్మ సంబంధ సమస్యలకు కూడా చికిత్సగా ఉపయోగిస్తారు. మీరు మీ కనుబొమ్మలకు నేరుగా అప్లై చేయడానికి టీ ట్రీ ఆయిల్ ఎక్స్‌ట్రాక్ట్‌లను కూడా ఉపయోగించవచ్చు.
లావెండర్ ఆయిల్
లావెండర్ ఆయిల్ చర్మానికి ప్రశాంతతను చేకూరుస్తుంది. లావెండర్ ఆయిల్ ను జుట్టు రాలడాన్ని నిరోధించటానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే కనుబొమ్మలపై రెండుమూడు చుక్కల లావెండర్ ఆయిల్ మర్దన చేస్తుండటం ద్వారా వాటి పెరుగుదలను చూడవచ్చు.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె అందరికీ అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన నూనె. ఈ నూనెను బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. శుద్ధమైన కొబ్బరినూనెను కనుబొమ్మలపై మసాజ్ చేస్తుండటం ద్వారా కనుబొమ్మల పెరుగుదలకు సహాయపడవచ్చు.
సంబంధిత కథనం