Thick Eyebrows : మీ కనుబొమ్మలు పలుచగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..-how to make eyebrows more dark naturally at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thick Eyebrows : మీ కనుబొమ్మలు పలుచగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

Thick Eyebrows : మీ కనుబొమ్మలు పలుచగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

Natural Thick Eyebrows : చాలామందికి కనుబొమ్మలు చాలా పలుచగా.. సన్నగా.. లైట్ కలర్​లో ఉంటాయి. అయితే మీరు కూడా ఇలాంటి కనుబొమ్మలనే కలిగి ఉంటే.. కొన్ని సులభమైన చిట్కాలతో వాటిని మరింత ముదురు, మందంగా మార్చేసుకోండి.

అందమైన కనుబొమ్మలు కావాలంటే..

Natural Thick Eyebrows : ఫేస్ మేకప్‌లో కళ్లు చాలా ముఖ్యమైన భాగం. అందమైన కళ్లు ఉన్నవారు అదృష్టవంతులు అని చాలా మంది అంటారు. కనుబొమ్మలపైనే కళ్ల అందం ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అందుకే చాలామంది ఐ బ్రో చేయించుకునేందుకు ఇష్టపడతారు. అయితే సన్నని కనుబొమ్మలు ఉన్నవారు ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడతారు. అయితే తమ సమస్యను పరిష్కరించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ కూడా ఉన్నాయి. సన్నటి కనుబొమ్మలను దట్టంగా నల్లగా మార్చే కొన్ని మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆముదం

కాటన్ బాల్‌పై ఆముదం రాసి కనుబొమ్మలపై 5 నిమిషాల పాటు అప్లై చేయండి. తర్వాత 20 నిమిషాలు దానిని అలాగే ఉంచేయండి. తర్వాత దానిని కడగాలి. లేదా కొబ్బరినూనెలో ఆముదం, బాదం నూనె కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం మీ ముఖం కడగాలి. ఇలా డైలీ చేస్తూ ఉంటే మీ సమస్య కంట్రోల్ అయిపోతుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను కనుబొమ్మలపై రాసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని నెలలపాటు ప్రతిరోజూ చేయడం వల్ల కనుబొమ్మల రంగు ముదురు, ఒత్తుగా మారుతుంది.

ఉల్లిపాయ

ఉల్లిపాయను గ్రైండ్ చేసి దాని రసాన్ని కనుబొమ్మలపై రాయండి. ఒక గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత దానిని కడగాలి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

గుడ్డులోని తెల్లసొన

గుడ్డులోని తెల్లసొనను బాగా గిలక కొట్టండి. తర్వాత ఆ మిశ్రమాన్ని కనుబొమ్మలపై అప్లై చేయండి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు చేయండి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

అలోవెరా జెల్

కనుబొమ్మలు మందంగా మారడానికి అలోవెరా జెల్ ఉత్తమంగా పనిచేస్తుంది. అలోవెరా నీటిని తేనె లేదా కొబ్బరి నూనెతో కలపండి. అలాగే అలోవెరా జెల్‌ని తేనె లేదా కొబ్బరి నూనెతో కలిపి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత దానిని కడగాలి.

సంబంధిత కథనం