Hair Spa with Rice Water । గంజి నీటితో హెయిర్ స్పా.. ఇంట్లోనే చేసుకోవచ్చు, ఈ దశలను అనుసరించండి!
హెయిర్ స్పా కోసం పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. సులభమైన విధానంలో సహజంగా బియ్యం ద్వారా వచ్చే గంజి నీళ్లతో మసాజ్ చేసుకుంటే జుట్టుకు పోషణ లభించి, బలంగా పెరుగుతుంది. Hair Spa with Rice Water కోసం ఇక్కడ పేర్కొన్న దశలను అనుసరించండి.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టంగా తినే తృణధాన్యం ఏదైనా ఉందా అంటే అది బియ్యం అనే చెప్పాలి. బియ్యంతో అన్నం వండుకుని చేసుకునే ఎన్నో రకాల వంటకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. బియ్యపు గింజల్లో ఫోలేట్, ఫోర్టిఫైడ్, బి-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అన్నం తినడం ద్వారా మంచి శక్తి, శరీరానికి పోషణ లభిస్తుంది. ముఖ్యంగా అన్నం వండేటపుడు వచ్చే గంజిలో మంచి పోషకాలు ఉంటాయి. కాబట్టి గంజిని పారేయకండి, గంజి తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అంతేనా, ఇంకా చెప్పాలంటే గంజిని జుట్టు సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు.
విషయంలోకి వెళ్తే, మీరు పార్లర్లకు వెళ్లి హెయిర్ స్పా చేసుకోవడం తెలిసిందే. అక్కడ ఏవో కెమికల్స్ కలిగిన క్రీములను గొప్పవిగా చెబుతూ తలకి అప్లై చేస్తారు. వాటికి బదులుగా గంజి నీళ్లతో హెయిర్ స్పా చేసుకుంటే మీ జుట్టు సంరక్షణ కోసం ఎంతో మేలు చేసినవారు అవుతారు. మీరు ఇలా గంజితో ఇంట్లోనే హెయిర్ స్పా చేయాలనుకుంటే అది చాలా సులభం. ఎలా చేయాలో దశల వారీగా వివరిస్తున్నాం. నెలకు ఒకసారైనా ఇలా హెయిర్ స్పా చేసుకోవాలి.
Hair Spa with Rice Water కోసంఈ దశలను అనుసరించండి:
సులభమైన 5 దశలలో హెయిర్ స్పా చేసుకోవచ్చు. ఒక్కో దశను క్రమ పద్ధతిలో వివరించాం, ఇలా ప్రయత్నించండి.
జుట్టు కడగడం
స్పా చేయడానికి ముందుగా మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ఇది మీ జుట్టు నుండి దుమ్ము ధూళిని శుభ్రపరుస్తుంది. మీరు కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.
హెడ్ మసాజ్
హెడ్ మసాజ్ చేసుకుంటే అది జుట్టుకు కూడా ఉపయోగపడుతుంది. హెయిర్ స్పా దశలలో భాగంగా రైస్ వాటర్ తీసుకుని స్ప్రే బాటిల్ లో నింపాలి. ఆ తర్వాత స్కాల్ప్, జుట్టు కుదుళ్ళ వరకు స్ప్రే చేయండి. చేతులతో తలకు తేలికపాటి మసాజ్ చేయాలి.
హెయిర్ మాస్క్
హెయిర్ మాస్క్ చేయడానికి, ముందుగా రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా మెత్తగా రుబ్బిన బియ్యం పిండి, ఒక చెంచా అలోవెరా జెల్, ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ కలపాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
నూనె రాసుకోవడం
హెయిర్ మాస్క్ వేసుకున్న 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి. ఇక్కడ షాంపూ చేయవలసిన అవసరం లేదని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ తీసుకుని జుట్టు మూలాల వరకు అప్లై చేయాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉంచుకోండి.
హెయిర్ వాష్
ఇప్పుడు మీరు నూనెను తొలగించడానికి తేలికపాటి షాంపూతో జుట్టును బాగా కడగాలి. కండీషనర్ ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.
పార్లర్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఇలా అప్పుడప్పుడూ రైస్ వాటర్ థెరపీ చేసుకుంటే మీ జుట్టు బలంగా, మెరుస్తూ ఉంటుంది.
సంబంధిత కథనం