ప్రతిరోజూ హెయిర్ వాష్ చేసుకోవడం మంచిదేనా? ముందుగా మీ జుట్టు స్వభావం తెలుసుకోండి!-know your hair before you go for hair wash here are the tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ప్రతిరోజూ హెయిర్ వాష్ చేసుకోవడం మంచిదేనా? ముందుగా మీ జుట్టు స్వభావం తెలుసుకోండి!

ప్రతిరోజూ హెయిర్ వాష్ చేసుకోవడం మంచిదేనా? ముందుగా మీ జుట్టు స్వభావం తెలుసుకోండి!

Manda Vikas HT Telugu
Feb 28, 2022 04:10 PM IST

హెయిర్ వాష్ చేసుకోవడం అనేది జుట్టు రకం, స్కాల్ప్ ఆకృతి, ఎంత జిడ్డుగా ఉంటుంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ హెయిర్ ఎలాంటిదో తెలుసుకోకుండా తరచుగా కడగడం వల్ల కేశాలు ఊడిపోవడం, పొడిబారినట్లుగా నిర్జీవంగా మారడం, చుండ్రు ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి వెంట్రుకలపై దృష్టి పెట్టండి.

<p>Representational Image</p>
Representational Image (AFP)

మన హెయిర్ విషయంలో ప్రత్యేక కేర్ తీసుకోవడం మంచిదే అయినా జుట్టు సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అనేది ఇక్కడ కీలకం. చాలా మంది జుట్టును తరచుగా కడగడం, ప్రతిరోజూ తలస్నానం చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇది అందరికీ శ్రేయస్కరం కాకపోవచ్చు. హెయిర్ వాష్ చేసుకోవడం అనేది జుట్టు రకం, స్కాల్ప్ ఆకృతి, ఎంత జిడ్డుగా ఉంటుంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

మీ హెయిర్ ఎలాంటిదో తెలుసుకోకుండా తరచుగా కడగడం వల్ల కేశాలు ఊడిపోవడం, పొడిబారినట్లుగా నిర్జీవంగా మారడం, చుండ్రు ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి మీ జుట్టు స్వభావాన్ని బట్టి హెయిర్ వాష్ చేసుకోండి. ఎలాంటి జుట్టు కలిగిన వారు వారంలో ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసుకోవచ్చో ఇక్కడ ఇస్తున్నాం. 

చిక్కటి ఒత్తైన జుట్టు: 

ఒత్తైన చిక్కటి జుట్టు కలవారు, వారానికి ఒకసారి హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒత్తైన జుట్టు ఉంటే కుదుళ్లు బహిర్గతం కావు కాబట్టి ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా అది తట్టుకుంటుంది. నూనె కూడా అన్ని కుదుళ్లకు సమానంగా పంపిణీ చేయడం జరుగుతుంది. చిక్కటి జుట్టు కలవారు టీ-ట్రీ ఆయిల్ గుణాలు ఉన్న షాంపూలు వాడితే ప్రయోజనం ఉంటుంది.

ఉంగరాల జుట్టు :

ఉంగరాల జుట్టు ఉండటం అందానికి చిహ్నంగా చెప్తారు. కొంతమంది స్టైల్ కోసం కూడా జుట్టును ఉంగరాలుగా మలుచుకుంటారు. అయితే ఉంగరాల జుట్టు వారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య జుట్టు చిక్కులు పడటం. ఈ జుట్టు కుదుళ్ల దగ్గర జిడ్డుగా ఉండి చివర్లు పొడిబారినట్లుగా ఉంటాయి. ఉంగరాల జుట్టు కలవారు వారానికి 3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే జుట్టుకి పోషణను అందించే షాంపూలు, బాదం, అవకాడో గుణాలు కలిగిన షాంపూలు, సల్ఫేట్ రహిత షాంపూలు వాడటం ఉత్తమం.

రింగులు కొంచెం తక్కువగా ఉండి, అలల లాగా జుట్టు ఉండేవారికి కూడా ఇదే వర్తిస్తుంది. అయితే వీరు సల్ఫేట్ రహిత షాంపూ లేదా Foam Wash చేసుకుంటే ప్రయోజనాలుంటాయి.

ఆయిలీ హెయిర్: 

కొందరికి సహజంగానే వారి జుట్టు నూనె రాసుకున్నట్లుగా, ముట్టుకుంటే జిడ్డుగా అనిపిస్తుంది. వారి కుదుళ్లలోని గ్రంథుల్లో ఎక్కువ నూనెలు ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం. అయితే ఇలాంటి జుట్టు కలవారు రోజూ తలస్నానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగకపోగా కొత్త సమస్యలు వస్తాయి. ఆయిలీ హెయిర్ ఉన్నవారు వారానికి 4 సార్లు మించి తలస్నానం చేయకూడదు.  వీరు నిమ్మ, సిట్రస్ గుణాలు గల షాంపూలు వాడితే ప్రయోజనం ఉంటుంది.

సిల్కీ హెయిర్: 

సిల్కీ హెయిర్ ఉంటే కుదుళ్లు సులభంగా కనిపిస్తాయి. ఇలాంటి వీరు రోజు తప్పించి రోజు తలస్నానం చేయడం మంచిది. ఆయిలీ హెయిర్ ఉన్నవారిలాగే ఏదైనా డ్రై షాంపూ లేదా వెంట్రుకలు రాలడాన్ని నిరోధించే షాంపూ వాడటం మంచిది.

పొడిబారిన జుట్టు:  

వాతావారణంలో మార్పులు, కాలుష్యం, కఠినమైన నీటిని వాడటం, జుట్టుకు కలర్స్ వేయటం ద్వారా కొందరి జుట్టు పొడిబారిపోతుంది. దీంతో  జుట్టు విరిగిపోవడం,  రాలిపోవడం లాంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి జుట్టుకలవారు జుట్టుకు ప్రత్యేక సంరక్షణ, పోషణ ఇవ్వాల్సి ఉంటుంది. పొడిజుట్టు ఉన్నవారు తలకు క్రమం తప్పకుండా నూనె పెట్టాలి. కుదుళ్ల వరకు అందేటట్లు వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. షాంపూ చేసుకునేటపుడు మాయిశ్చరైజింగ్ గుణాలుండే మృధువైన షాంపూలు ఉపయోగించడం, జుట్టుకు కండీషనర్ వాడుతూ ఉండటం చేస్తే కోల్పోయిన తేమ తిరిగివచ్చి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. 

నార్మల్ హెయిర్: 

సాధారణ జుట్టు అని ప్రత్యేకంగా ఏమి లేదు. పైన పేర్కొన్న విధంగా, ఆయిలీ హెయిర్, సిల్కీ హెయిర్, కర్లీ హెయిర్ అని తేడాలు లేకుండా మామూలుగానే ఉంటే దానిని సాధారణ జుట్టు అంటారు. ఇలాంటి వారు ఒకరోజు తప్పించి ఒకరోజు తలస్నానం చేస్తే చాలు. వీరు ఎలాంటి షాంపూ వాడినా సమస్య ఉండదు.

సాధారణ జుట్టు అని ప్రత్యేకంగా ఏమి లేదు. పైన పేర్కొన్న విధంగా, ఆయిలీ హెయిర్, సిల్కీ హెయిర్, కర్లీ హెయిర్ అని తేడాలు లేకుండా మామూలుగానే ఉంటే దానిని సాధారణ జుట్టు అంటారు. ఇలాంటి వారు ఒకరోజు తప్పించి ఒకరోజు తలస్నానం చేస్తే చాలు. వీరు ఎలాంటి షాంపూ వాడినా సమస్య ఉండదు.|#+|

Whats_app_banner

సంబంధిత కథనం