Spicy Garlic Chutney Recipe । కారంగా వెల్లుల్లి చట్నీ ఇలా చేసుకోండి,. కమ్మగా తినండి!
ఎర్రగా, కరంగా వెల్లులి చట్నీ కలుపుకొని తింటే ఆహారానికి మంచి రుచి వస్తుంది. వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. కొత్తగా వెరైటీగా Spicy Garlic Chutney చేసుకోవాలనుకుంటే రెసిపీ ఇక్కడ చూడండి.
మనలో చాలా మందికి వెల్లుల్లి కారం గురించి, దాని రుచి గురించి బాగా తెలుసు. వేడివేడి అన్నంలో నెయ్యి, వెల్లుల్లి కారం వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. కార దోశ, కారం ఇడ్లీలలో అలాగే పల్లీ చట్నీలలో కలుపుకొని తినే వెల్లుల్లి కారం పొడి రుచి ఎంతో అద్భుతం. వెల్లుల్లితో ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకా ప్రత్యేకమైన రుచి కోసం వెల్లుల్లి చట్నీని ఎప్పుడైనా చేసుకున్నారా? ఈ వెల్లుల్లి చట్నీ కూడా రుచిలో అదిరిపోతుంది. మరోవైపు వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మగవారు వెల్లుల్లి తింటే ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి.
వెల్లుల్లిని ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. అయితే మరి మీరు ఈ రుచికరమైన వెల్లుల్లి చట్నీ రుచి చూసేందుకు సిద్ధమా? ఈ వెల్లుల్లి చట్నీని దోశ, చపాతీ, పూరీ, రోటీలతోనే కాకుండా అన్నంలో కూడా తినవచ్చు. భోజనంలో సైడ్ డిష్‌గా ఉపయోగించవచ్చు. నోరూరించే ఈ రుచికరమైన చట్నీని నెలల తరబడి నిల్వ చేసుకోవచ్చు.
ఇంకా ఆలస్యం ఎందుకు? స్పైసీగా వెల్లుల్లి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. స్పైసీ వెల్లుల్లి చట్నీ రెసిపీని ఈ కింద చూడండి.
Spicy Garlic Chutney Recipe కావలసినవి
- 1 కప్పు వెల్లుల్లి (ఒలిచినవి)
- 10 ఎండు మిర్చి
- 5 బాడగి మిరపకాయలు
- 1 టీస్పూన్ జీలకర్ర
- 1 అంగుళం అల్లం
- 1 టీస్పూన్ చింతపండు
- బెల్లం - చిన్న ముక్క
- ఉప్పు - రుచి ప్రకారం
వెల్లుల్లి చట్నీ రెసిపీ- ఎలా తయారు చేయాలి
- బాణలిలో నూనె వేసి చిన్న మంట మీద ఎండు మిరపకాయలను వేయించాలి
- అదే నూనెలో వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఆపై చింతపండు కూడా వేసి నూనెలో వేయించాలి
- ఇప్పుడు జీలకర్ర వేసి 1 నిమిషం వేయించి మిశ్రమాన్ని చల్లబరచండి
- ఇప్పుడు ముందుగా వేయించిన మిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి
- అనంతరం వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి, అందులో కాస్త బెల్లం వేసి గ్రైండ్ చేసుకుంటే స్పైసీ వెల్లుల్లి చట్నీ రెడీ
గమనిక: ఈ వెల్లుల్లి చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు నీరు కలపవద్దు. వెల్లుల్లిని వేయించడానికి ఉపయోగించే నూనె సరిపోతుంది. నీళ్లు కలిపితే చట్నీ ఎక్కువకాల్ం నిల్వ ఉండదు. కాబట్టి వెల్లుల్లిని వేయించేటప్పుడు ఎక్కువ నూనె వేయండి. ఈ చట్నీ గాజు పాత్రలో నిల్వ ఉంచితే నెలల తరబడి పాడవదు.
సంబంధిత కథనం