Benefits of Garlic : వేగంగా బరువు తగ్గాలంటే.. వెల్లుల్లి అలా మాత్రమే తీసుకోవాలట-remember these things when you eat garlic and you can lose weight fast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Benefits Of Garlic : వేగంగా బరువు తగ్గాలంటే.. వెల్లుల్లి అలా మాత్రమే తీసుకోవాలట

Benefits of Garlic : వేగంగా బరువు తగ్గాలంటే.. వెల్లుల్లి అలా మాత్రమే తీసుకోవాలట

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 13, 2022 04:30 PM IST

Benefits of Garlic : వెల్లుల్లిలో బరువు తగ్గడానికి సహాయపడే అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే చాలామంది తమ డైట్లో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటారు. అయితే దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి వెల్లుల్లి ఏ విధంగా సహాయపడుతుందో.. అది తీసుకునే సమయంలో ఏయే అంశాలు గుర్తించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు
వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు

Benefits of Garlic : ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్ క్యాలరీలను వేగంగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అందుకే బరువు తగ్గడానికి వెల్లుల్లి తినడం అనేది సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారు.

బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను కొనసాగించలేరు. అయితే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. నిర్ణీత వ్యవధిలో ఫిట్ బాడీని పొందవచ్చు. ఇది మీరు బరువు తగ్గడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషించే వెల్లుల్లి గురించి చెప్పాలంటే.. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మీ నరాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడేలా చేస్తుంది.

మీరు మంచి జీవనశైలిని కలిగి ఉంటే.. రెగ్యులర్ వర్కవుట్‌లతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారు అయితే మాత్రమే వెల్లుల్లిని తీసుకోవాలి. పైగా దీనిని ఖాళీ కడుపుతో మాత్రమే తీసుకోవాలి. ఇది శరీరంలో శక్తిని పెంచడానికి కూడా పనిచేస్తుంది. జీవక్రియను అదుపులో ఉంచడంలో సహాయపడే పోషకాలను కలిగి ఉంటుంది.

బరువు తగ్గడంలో వెల్లుల్లి ఎలా సహాయపడుతుంది?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్ క్యాలరీలను వేగంగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఇది మీకు చాలా కాలం పాటు నిండుగా అనిపించేలా చేస్తుంది. మీ ఆకలిని అదుపులో ఉంచి అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వెల్లుల్లి కొవ్వును తగ్గించడానికి సహాయం చేస్తుందని తెలిపారు. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడే డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంది.

గుర్తుంచుకోవలసిన విషయాలివే..

వెల్లుల్లిని ఎక్కువగా తినడం మానుకోండి. ఎందుకంటే ఇది కడుపులో చికాకును కలిగిస్తుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు వెల్లుల్లిని తగ్గించేయాలి. ఎందుకంటే ఇది గుండెల్లో మంటను కలిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే కొన్ని సమ్మేళనాలు ఛాతీ, కడుపు మంటను కలిగిస్తాయి.

వెల్లుల్లి వల్ల కలిగే అలెర్జీలు

వెల్లుల్లి కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. దాని లక్షణాలు దద్దుర్లు, పెదవులలో జలదరింపు, నాలుకపై తిమ్మిరి, డీకోంగెస్టెంట్, ముక్కు కారడం, దురద, తుమ్ము, కళ్లు దురద వంటి లక్షణాలు కలిగిస్తుంది.

బరువు తగ్గడానికి వెల్లుల్లిని ఎలా తినాలి?

బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తినండి. మీకు మలబద్ధకం సమస్య ఉంటే కనుక వెల్లుల్లి తినకండి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, తక్కువ రక్తపోటు, రక్తస్రావం రుగ్మతలు, మధుమేహం ఉన్న వారు దీనిని ఫాలో అవ్వకూడదు. వెల్లుల్లిని తినడం ప్రారంభించే ముందు మీ వైద్యుని సలహా కచ్చితంగా తీసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్