Garlic Magic | ఉదయాన్నే గోరువెచ్చని నీటితో వెల్లుల్లిని తీసుకోండి, మార్పు చూడండి-drink garlic water in the morning it works like a magic for your wellbeing ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Garlic Magic | ఉదయాన్నే గోరువెచ్చని నీటితో వెల్లుల్లిని తీసుకోండి, మార్పు చూడండి

Garlic Magic | ఉదయాన్నే గోరువెచ్చని నీటితో వెల్లుల్లిని తీసుకోండి, మార్పు చూడండి

Jun 08, 2022, 07:45 PM IST HT Telugu Desk
Jun 08, 2022, 07:45 PM , IST

బరువు పెరగటం తేలికే కానీ, తగ్గాలంటేనే చాలా చెమటోడ్చాల్సి వస్తుంది. అయితే బరువు తగ్గడం కోసం తీవ్రమైన వ్యాయామాలు వంటివి ఏం చేయకుండా సులభమైన మరో మార్గం కూడా ఉంది. ఆ మ్యాజిక్ వెల్లుల్లి చేస్తుంది. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.

వర్క్ ఫ్రమ్ హోం కారణంగా చాలా మంది బాయిలర్ కోడిలాగా బరువు పెరిగిపోయారు. ఇలా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి నెలల తరబడి డైటింగ్ , వర్కవుట్ చేసినా పెద్ద తేడా ఉండదు. వెల్లుల్లి తీసుకోవడం ద్వారా అంతకు మించి ఫలితం ఉంటుందని పలు నివేదికలు తెలిపాయి.

(1 / 7)

వెల్లుల్లిలో ఫైబర్, క్యాల్షియం, విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

(2 / 7)

వెల్లుల్లి శరీరం నుండి విషాన్ని మరియు హానికరమైన పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అదనంగా, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో కొవ్వును కాల్చే సమ్మేళనాలు ఉన్నాయి, అలాగే ఇవి శరీరంలోని అదనపు కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తాయి. తద్వారా బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

(3 / 7)

వెల్లుల్లిలో ఆకలిని తగ్గించే గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని నమలడం ద్వారా అతిగా తినాలనే కోరికను నిరోధిస్తుంది. వెల్లుల్లిని తీసుకుంటే కడుపు నిండిన అనుభూతిని పొందుతారు.

(4 / 7)

ప్రతిరోజూ ఉదయం 2 వెల్లుల్లి రెబ్బలను తినాలి. ఒకవేళ ఇలా తినలేని పక్షంలో రాత్రిపూట ఒక గ్లాసులో నీళ్లలో రెండు వెల్లుల్లి రెబ్బలను నానబెట్టి, ఈ నీటిని ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో తాగాలి. లేదా ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తురిమిన వెల్లుల్లి పాయలు కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా కొన్నిరోజులు తాగితే మీ కొవ్వు కరుగుతుంది, బరువు తగ్గుతుంది. అంతేకాదు ఉదయం పూట గార్లిక్ వాటర్ తాగితే మూడ్ బాగుంటుందట, తద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు.

(5 / 7)

వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే కూడా బరువు తగ్గుతారట. ఇందుకోసం 2-3 వెల్లుల్లి రెబ్బలను తేనెలో సుమారు గంటసేపు నానబెట్టి ఆ తర్వాత వాటిని తినాలి.

(6 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు