National Garlic Day | నల్ల వెల్లుల్లి ప్రయోజనాలివే.. మీకు తెలుసా?-special story on black garlic on national garlic day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  National Garlic Day | నల్ల వెల్లుల్లి ప్రయోజనాలివే.. మీకు తెలుసా?

National Garlic Day | నల్ల వెల్లుల్లి ప్రయోజనాలివే.. మీకు తెలుసా?

HT Telugu Desk HT Telugu
Apr 19, 2022 10:25 AM IST

వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. అందుకే దీనిని చాలా వంటకాల్లో తరచూ ఉపయోగిస్తుంటారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అయితే మరి నల్ల వెల్లుల్లితో ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. నేషనల్​ గార్లిక్​ డే రోజు.. నల్ల వెల్లుల్లి అంటే ఏమిటి? దానిని ఎలా ఉయోగించాలి? ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

నల్ల వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు
నల్ల వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు

Black Garlic Benefits | మనలో చాలా మందికి నల్ల వెల్లుల్లి గురించి తెలియదు. కానీ దాని గురించి తెలుసుకుంటే మాత్రం అసలు వదిలిపెట్టరు అంటున్నారు నిపుణులు. నల్ల వెల్లుల్లి.. తెల్ల వెల్లుల్లి నుంచే కిణ్వ ప్రక్రియలో తయారు చేస్తారు. ఇది వెల్లుల్లి లాగా.. ఘాటైన వాసన, రుచిని కలిగి ఉండదు. పచ్చి వెల్లుల్లి కంటే.. నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడు ఆరోగ్యానికై..

మెదడులోని మంట జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుందని.. కాలక్రమేణా మెదడు పనితీరును మరింత దిగజార్చుతుందని మనకు తెలుసు. కాబట్టి నల్ల వెల్లుల్లి తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నల్ల వెల్లుల్లి అనేది ఒక సహజ శోథ నిరోధకం. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి నల్లవెల్లుల్లి అద్భుతమైన నివారణ ఫలితాలు ఇచ్చినట్లు పలు అధ్యాయనాలు పేర్కొన్నాయి. అల్జీమర్స్ వచ్చే అవకాశాలను కూడా నల్ల వెల్లుల్లి తగ్గిస్తుంది.

ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు..

యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే పదార్థాలు. కిణ్వ ప్రక్రియ ఫలితంగా ముడి వెల్లుల్లి కంటే బ్లాక్ వెల్లుల్లిలో.. రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. నల్లవెల్లుల్లి క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది మీ కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడుతుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది..

అధిక రక్త చక్కెర (హైపర్గ్లైసీమియా) కలిగి ఉండటం వలన గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, నరాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. తక్కువ రక్త చక్కెర (హైపోగ్లైసీమియా)మూర్ఛ, మరణానికి కారణమవుతుంది. క్రమరహిత రక్తంలో చక్కెర స్థాయిలు.. మధుమేహంతో మరిన్ని సమస్యలకు దారితీస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నల్లవెల్లుల్లి సహాయం చేస్తుందని.. అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొన్ని నల్ల వెల్లుల్లిలో ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గించి.. మీ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల మధుమేహం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

నల్ల వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఫలితంగా రక్త ప్రవాహాన్ని పెంచేటప్పుడు మీ గుండె, ధమనులలో వాపును తగ్గిస్తుంది. ఇది మీ లిపిడ్ ప్రొఫైల్​ను మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి

* నల్ల వెల్లుల్లిని బాల్సమిక్ వైనైగ్రెట్‌తో కలపండి. 

*సలాడ్స్, కాల్చిన చేప లేదా ఎర్ర మాంసంతో కలిపి తీసుకోవచ్చు.

* ఉల్లిపాయతో వేయించి, గార్నిష్‌గా ఉపయోగించవచ్చు.

* ఆలివ్​ నూనెతో కలిపి తీసుకోవచ్చు. సముద్రపు ఉప్పుతో కలపి తీసుకోవచ్చు.

* బంగాళాదుంపల మాష్​తో కలిపి కూడా తీసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్