Paneer Cucumber Salad Recipe : జిమ్, వ్యాయామాలు చేసే వారు.. ఫిట్‌గా ఉండాలి అనుకునేవాళ్లు తమ డైట్లో ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటారు. ప్రోటీన్ కలిగిన ఆహారం మీరు బరువు తగ్గడంలో కచ్చితంగా సహాయం చేస్తుంది. అయితే మీ ఉదయాన్ని మంచి ప్రోటీన్ ఫుల్‌గా మార్చేయాలనుకుంటే.. మీరు పనీర్ కీరా సలాడ్ ట్రై చేయవచ్చు. దీనిని బ్రేక్ఫాస్ట్లానే కాదండోయ్.. మీల్‌కి మీల్‌కి మధ్యలో స్నాక్‌లాగా.. లేదంటే మీల్గానే కూడా తీసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* దోసకాయ - 1
* ఉల్లిపాయ -1
* టమోటా - 1
* పనీర్ - అర కప్పు (తురిమినది)
* నిమ్మకాయ రసం - సగభాగం
* వెనిగర్ - 1 స్పూన్
* తేనె - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - తగినంత
* మిరియాలు పొడి - తగినంత
ముందుగా దోసకాయ, ఉల్లిపాయలు, టొమాటోలను చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. దానిలో తురిమిన పనీర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఓ చిన్న గిన్నె తీసుకుని దానిలో నిమ్మరసం, వెనిగర్, తేనె వేసి బాగా కలపాలి. అది సిరప్ వంటి స్థితికి వస్తుంది. దానితో సలాడ్‌కి డ్రెస్సింగ్ చేయవచ్చు. అంతే హెల్తీ, టేస్టీ, ప్రోటీన్ రిచ్, సింపుల్ సలాడ్ రెడీ అయిపోయినట్లే. ఇది మీ అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
సంబంధిత కథనం