Samsung Pickle Mode Microwave । అదే టేస్ట్, అదే స్వచ్ఛత..ఊరగాయ తయారు చేసే మైక్రోవేవ్ వచ్చేసింది!-now pickle preparation becomes easy samsung launches pickle mode microwave check price details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Pickle Mode Microwave । అదే టేస్ట్, అదే స్వచ్ఛత..ఊరగాయ తయారు చేసే మైక్రోవేవ్ వచ్చేసింది!

Samsung Pickle Mode Microwave । అదే టేస్ట్, అదే స్వచ్ఛత..ఊరగాయ తయారు చేసే మైక్రోవేవ్ వచ్చేసింది!

Manda Vikas HT Telugu
Oct 23, 2022 02:58 PM IST

Samsung కంపెనీ Pickle Mode ఫీచర్ కలిగిన పెపాచక్ లాంటి సరికొత్త Microwaveను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీనివల్ల ప్రయోజనమేమిటి? ధర ఎంత ఇక్కడ తెలుసుకోండి.

Samsung Pickle Mode Microwave
Samsung Pickle Mode Microwave

ఇప్పుడు సీజన్ ఏదైనా అన్ని రకాల కూరగాయలు, పండ్లు లభిస్తున్నాయి. అయితే కొన్నేళ్ల కిందట ఏ సీజన్‌లో లభించాల్సినవి అదే సీజన్‌లో లభించేవి. మిగతా సీజన్‌లలోనూ తినేందుకు వీలుగా వాటిని పచ్చళ్ల రూపంలో నిల్వచేసుకునే వారు. ఇందుకోసం కాయలను ముక్కలుగా కోసి ఎండలో కొన్ని రోజుల పాటు ఎండబెట్టేవారు దీనిని 'అరుగు' అప్పట్లో పిలిచే వారు. 90వ దశకంలోని వారికి కూడా ఈ అరుగుల గురించి తెలిసే ఉంటుంది.

సరే, ఇప్పుడు విషయం ఏమిటంటే.. ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, తాజాగా ఒక మైక్రోవేవ్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీనిలో విశేషం ఏముందంటే ఈ మైక్రోవేవ్ 'పికిల్ మోడ్' అనే సరికొత్త ఆప్షన్‌తో వచ్చింది. దీని సహాయంతో వినియోగదారులు తమకు ఇష్టమైన పచ్చళ్లను సన్‌-డ్రైయింగ్ చేయకుండా కూడా తమ మైక్రోవేవ్ ఉపయోగించి మాన్యువల్‌గా తయారు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

శాంసంగ్ పికిల్ మోడ్ మైక్రోవేవ్‌తో వినియోగదారులు ఏడాది పొడవునా తమ ఇళ్లలో సులభంగా, సౌకర్యవంతంగా వివిధ రకాల అరుగులు పెట్టుకోవచ్చు, ఊరగాయలను తయారు చేసుకోవచ్చు.

Samsung Pickle Mode Microwave తో ప్రయోజనాలు ఏమిటి?

మామిడి, పచ్చిమిర్చి, ఇండియన్ గూస్‌బెర్రీ, ముల్లంగి, అల్లం, కాలీఫ్లవర్, నిమ్మకాయ పచ్చళ్లను ఏడాది పొడవునా ఎప్పుడైనా ఈ మైక్రోవేవ్‌లో తయారు చేయవచ్చు. ఇది గృహిణులకు, పనిచేసే వారికి, అన్ని వయసుల వారికి సౌలభ్యంగా ఉంటుంది. పచ్చళ్లు పెట్టడంలో ఉన్న ప్రక్రియను తగ్గించడం ద్వారా శ్రమను తగ్గిస్తుంది, సమయాన్ని ఆదా చేస్తుంది. అంతేకాదు ఊరగాయల అదే సహజమైన రుచిని అందిస్తాయి, నాణ్యతను పెంచుతాయని కంపెనీ పేర్కొంది.

ఇంకా, ఈ పికిల్ మోడ్ మైక్రోవేవ్‌లో వివిధ రెసిపీలకు అనుగుణంగా వేర్వేరు ఫీచర్లు ఉన్నాయి. మసాలాలు, తడ్కా, సన్-డ్రై వంటకాలను సిద్ధం చేయడానికి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అలాగే తక్కువ నూనెను ఉపయోగించి ఆరోగ్యకరమైన వంట చేసేందుకు స్లిమ్‌ఫ్రై ఫీచర్‌, ఆహారాన్ని 50% అదనపు వేగంతో తయారు చేయడానికి హాట్‌బ్లాస్ట్ ఫీచర్‌, రోటీలు- నాన్‌లను తయారు చేయడానికి ఫంక్షనాలిటీలను కలిగి ఉంది.

ఈ మైక్రోవేవ్ 28-లీటర్ సామర్థ్యంతో వచ్చింది. భారత మార్కెట్లో దీని ధర రూ. 24,990/-.

WhatsApp channel

సంబంధిత కథనం