Quick Rice Recipes । సమయం లేదా మిత్రమా.. కేవలం 5 నిమిషాల్లో చేసుకోగలిగే 5 రెసిపీలు ఇవే!-here are the 5 quick rice recipes that you can prepare in just five minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Here Are The 5 Quick Rice Recipes That You Can Prepare In Just Five Minutes

Quick Rice Recipes । సమయం లేదా మిత్రమా.. కేవలం 5 నిమిషాల్లో చేసుకోగలిగే 5 రెసిపీలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Sep 29, 2022 07:26 PM IST

Quick Rice Recipes: వంట చేసుకునే ఓపిక, సమయం లేదా? కేవలం రెండు నిమిషాల్లో మ్యాగీ చేసుకోవచ్చు, కానీ 5 నిమిషాల్లో అన్నంతో ఎన్నో వండుకోవచ్చు. ఆ సూపర్ ఫాస్ట్ రైస్ రెసిపీలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

Quick Rice Recipes:
Quick Rice Recipes: (Unsplash)

Quick Rice Recipes మన దక్షిణ భారతదేశంలో సాధారణంగా చేసుకునే ఏదైనా ఆహారం ఉందంటే అది అన్నంతో వండినదే అయి ఉంటుంది. అన్నంతో ఎన్నో రకాల వెరైటీలు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు త్వరగా ఆహారం సిద్ధం చేసుకోవాలంటే కూడా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకోవచ్చు. మీరు ఆఫీస్ నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చి, త్వరగా రుచికరంగా ఏదైనా తయారు చేసుకోవాలంటే అందుకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. కేవలం 5 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోగలిగే 5 రైస్ రెసిపీలను ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాం. అవి ఏంటి, ఎలా చేసుకోవాలో చూసేయండి, సూపర్ ఫాస్ట్ గా తయారు చేసేయండి.

1. వెజిటబుల్ పులావ్:

ఈ వంటకం చేయడానికి, మనకు అన్నం, వేయించటానికి కొద్దిగా నెయ్యి, బిర్యానీ ఆకు, యాలకులు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, క్యాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికం, ఫ్రెంచ్ బీన్స్, పచ్చి బఠానీలు, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర అవసరం.

తయారీ విధానం: ముందుగా బొగోన్ లో నెయ్యి వేడి చేసి, అనంతరం పైన పేర్కొన్న మసాలా దినుసులు అన్నీ వేసి వేయించండి. ఆపై తరిగిన కూరగాయలు వేసి, సరిపడా ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా, నెయ్యి వేసి, ప్రతిదీ కలపండి. అంతే, వెజ్ పులావ్ తినడానికి సిద్ధంగా ఉంది.

2. పనీర్ ఫ్రైడ్ రైస్:

ఈ వంటకం చేయడానికి, మీకు ఉడికించిన అన్నం, నెయ్యి, పనీర్, పచ్చి బఠానీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, జీలకర్ర, గరం మసాలా అవసరం.

మీరు చేయాల్సిందల్లా నెయ్యిలో మసాలా దినుసులు, అందులో పచ్చిమిర్చి , పనీర్, పచ్చి బఠానీలు, ఉల్లిపాయలను వేయించి, ఆపై అన్నం, గరం మసాలా, ఉప్పు వేసి ప్రతిదీ కలపాలి. పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.

3. ఉల్లిపాయ అన్నం:

ఈ వంటకం చేయడానికి మీకు అన్నం, నెయ్యి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, కారం పొడి, పసుపు, కొత్తిమీర అవసరం.

తయారీ విధానం, నెయ్యి వేడి చేసి మసాలా దినుసులు వేయించండి. తర్వాత అల్లం, కారం, ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు వేసి అన్నీ కలిపి ఉడికించాలి. అందులో అన్నం వేసి కలపాలి, పై నుంచి తాజాగా తరిగిన కొత్తిమీర ఆకులతో అలంకరించండి. ఆనియన్ రైస్ రెడీ.

4. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్:

ఈ వంటకం చేయడానికి మీకు అన్నం, నూనె, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, ఉప్పు, నల్ల మిరియాలు, షెజ్వాన్ సాస్ అవసరం.

ముందుగా నూనెను వేడి చేసి, కూరగాయలను వేయించడం ప్రారంభించండి. తర్వాత ఉప్పు, ఎండుమిర్చి, షెజ్వాన్ సాస్ వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఆపై అన్నం వేసి కలపాలి. చివరగా, స్ప్రింగ్ ఆనియన్ చల్లుకొంటే చాలా రుచికరమైన షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ సిద్ధంగా ఉన్నట్లే.

5. పెరుగు అన్నం:

పెరుగుతో దద్దోజనం చేసుకోవచ్చు. ఈ వంటకంలో అన్నం, పెరుగు, ఉప్పు, నూనె, ఆవాలు, జీలకర్ర, తెల్ల శనగలు, కరివేపాకు, అల్లం, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎర్ర మిరపకాయ, కొత్తిమీర అవసరం.

ఇది చాలా సింపుల్ రెసిపీ, ముందుగా పెరుగు, అన్నం కలపేయండి. మరోవైపు నూనెలో మసాల దినుసులు వేయించుకోండి. ఇలా వేయించిన పోపును పెరుగు అన్నంలో కలిపేసుకోండి. పై నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఆపై తిని చూడండి, వావ్ వాటే టేస్ట్ అంటారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్