Mexican Spicy Rice | స్పైసీ స్పైసీగా.. నోరూరించే స్పైసీ మెక్సికన్ రైస్
స్పైసీ మెక్సికన్ రైస్. పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇదే మంచి సమయం. మధ్యాహ్నం ఏమి వంట చేసుకోవాలా లంచ్‌కి అని ఆలోచిస్తున్నవాళ్లు.. ఈ డిష్‌ను ట్రై చేయవచ్చు. రోజు చేసుకునే రోటీన్ వంటకాలకు బ్రేక్ ఇచ్చి.. రెస్టారెంట్ స్టైల్లో స్పైసీ మెక్సికన్‌ను చేసుకుని.. హ్యాపీగా లంచ్ లాగించేయండి.
Mexican Spicy Rice | అయ్యో మేము రైస్ తినము. ఓన్లీ బ్రౌన్ రైస్ తింటాము. మేము ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఏమి వర్రీ కాకండి. రైస్ లేదా మీకు ఇష్టమైన బ్రౌన్ రైస్‌తో దీనిని తయారు చేసుకోవచ్చు. పైగా ఇది చికెన్‌తో చేసుకోవచ్చు.. లేదా కూరగాయలతో కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టీకి టేస్టీ.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు
* 1 టేబుల్ స్పూన్- వంట నూనె
* 1 చిన్న ఉల్లిపాయ (ముక్కలుగా కోయాలి)
* 2 పశ్చిమిర్చి (ముక్కలుగా కోయాలి)
* 1 మీడియం క్యారెట్ (ముక్కలుగా కోయాలి)
* 4 లవంగాలు, వెల్లుల్లి (ముక్కలుగా కోయాలి)
* 1 టీస్పూన్ గ్రౌండ్ జీలకర్ర
* 3 ½ కప్పులు - చికెన్ స్టాక్ లేదా వెజిటబుల్ స్టాక్
* 2 కప్పులు- బ్రౌన్ రైస్ లేదా రైస్
* 1 టీస్పూన్- సముద్ర ఉప్పు
* 2 పెద్ద టమోటాలు (ముక్కలుగా కోయాలి)
* 1 క్యాప్సికం (ముక్కలుగా కోయాలి)
* 1 కప్పు మొక్కజొన్న
½* కప్ - కొత్తిమీర, ముక్కలు
* 2 టేబుల్ స్పూన్ల - నిమ్మరసం
తయారీ విధానం
వెలిగించిన స్టౌవ్‌పై ఓ కడాయిని పెట్టి.. దానిలో ముందుగా నూనె వేయాలి. ఉల్లిపాయ, మిరపకాయలు, క్యారెట్ వేసి 5 నిమిషాలు ఉడికించాలి. దీనిలో మిరయాలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి వాటిని 1 నిమిషం ఉడికించాలి.
చికెన్ లేదా వెజ్ స్టాక్ వేసి.. బియ్యం, ఉప్పు, టమాటాలు, క్యాప్సికం వేసి.. ఉడికించాలి. స్టవ్ సిమ్‌లో పెట్టి.. కడాయిపై మూతపెట్టాలి. దీనిని 40 నిమిషాలు ఉడికించాలి. అనంతరం కుండను స్టౌవ్ మీద నుంచి దించి.. మొక్కజొన్న, కొత్తిమీర, నిమ్మరసం వేసుకుని కలపాలి.
చూశారా మెక్సికన్ స్పైసీ రైస్ చేసుకోవడం ఎంత సులువో. ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటే దీనిని చేసుకోవడం చాలా తేలిక. రైతాతో కలిపి తీసుకుంటే ఆహా అనిపించేలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం. మీరు దీనిని ట్రై చేయండి.