Vegetable Khichdi Recipe। త్వరగా.. తేలికగా.. తక్కువ సమయంలో చేసుకోగలిగే ఖిచ్డీ!
చాలా సందర్భాల్లో మనకు రాత్రి భోజనం తయారు చేసుకోవటానికి సమయం గానీ, ఓపిక గానీ ఉండవు. కానీ ఆకలి మాత్రం వేస్తుంది. అందుకే.. మీరు త్వరగా, నిమిషాల్లో రెడీ చేసుకోగలిగే Vegetable Khichdi Recipe ఇక్కడ అందిస్తున్నాం.
మీరు ఆఫీసు నుంచి గానీ లేదా ఏదైనా పని ముగించుకొని ఆలస్యంగా ఇంటికి చేరితే అప్పటికప్పుడు భోజనం కోసం ఎలాంటి వంటకం సిద్ధం చేయాలో ఏమి తోచదు. వంట చేసే ఓపిక కూడా ఉండదు. అయితే సంక్లిష్టమైన వంటకాలతో వంటగదిలో గంటలు గడపవలసిన అవసరం లేదు. సులభంగా నిమిషాల్లోనే సిద్ధం అయ్యే ఖిచ్డీని ప్రయత్నించవచ్చు.
ఖిచ్డీ అనేది అన్నం, పప్పు దినుసులు, కొన్ని కూరగాయలతో కలిపి తయారుచేసే ఒక పసందైన ఆహారం. మీరు డిన్నర్‌లో ఏదైనా తేలికగా తినాలనుకుంటే, ఈ ఖిచ్డీ మీకు మంచి ఛాయిస్ అవుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగానూ మంచిది. సులభంగా జీర్ణం అవుతుంది, త్వరగా శక్తి లభిస్తుంది. ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. కడుపునొప్పి లేదా పీరియడ్స్ సమస్య ఉన్నప్పుడు అవీఇవీ కాకుండా ఖిచ్డీ తినాల్సిందిగా వైద్యులు సలహా ఇస్తారు.
మరి త్వరితగతిన, చాలా సాధారణమైన ఖిచ్డీని రుచికరంగా ఎలా చేసుకోవాలి? అందుకు కావలసిన పదార్థాలు ఏమిటో ఇక్కడ పూర్తి రెసిపీని అందించాం చూడండి.
Quick Vegetable Khichdi Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు బియ్యం
- 1/3 కప్పు పెసరిపప్పు
- 1/2 కప్పు ఏవైనా కూరగాయలు
- 2 స్పూన్ల దేశీ నెయ్యి
- 1 స్పూన్ జీలకర్ర
- 1/2 టీ స్పూన్ పసుపు పొడి
- 1 చిన్న ఉల్లిపాయ
- 2 పచ్చిమిర్చి
- 2-3 లవంగాలు
- రుచికి తగినంత ఉప్పు
- 2 కప్పుల వేడి నీరు
వెజిటెబుల్ ఖిచ్డీ తయారు చేసుకునే విధానం
- ముందుగా, ఒక పెద్ద గిన్నెలో బియ్యం, పెసరి పప్పును కడిగి ఆ తర్వాత 10 నిమిషాలు నానబెట్టండి.
- ఈలోపు కూరగాయలను మీడియం సైజులో కట్ చేసుకోండి, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, వెల్లుల్లి ముక్కలను సన్నగా తరగండి.
- ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ వేడి చేసి, తక్కువ మంటపై నెయ్యిని వేడిచేయండి. ఆపై జీలకర్ర వేసి వేయించండి.
- ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించండి. ఆపై కూరగాయ ముక్కలు కూడా వేసి వేయించడి.
- ఇప్పుడు కుక్కర్లో నానబెట్టిన బియ్యం, పప్పు, ఉప్పు, కారం అన్నీ వేసి నీళ్లు పోసుకొని ఉడికించండి.
- 10 నిమిషాలు ఉడికించి, దించేయండి.
అంతే ఘుమఘుమలాడే వెజిటెబుల్ ఖిచ్డీ రెడీ అయినట్లే. చివరగా పై నుంచి తాజా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వేడివేడి ఖిచ్డీలో ఊరగాయ, పెరుగు కలిపి తింటూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది.
సంబంధిత కథనం