Eyesight | కళ్లజోడును తీసేయండి, సహజంగా కంటిచూపును మెరుగుపరిచే ఆయుర్వేద చిట్కాలు ఇవిగో!-say goodbye to spectacles check effective ayurvedic treatments to improve your eyesight naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Say Goodbye To Spectacles, Check Effective Ayurvedic Treatments To Improve Your Eyesight Naturally

Eyesight | కళ్లజోడును తీసేయండి, సహజంగా కంటిచూపును మెరుగుపరిచే ఆయుర్వేద చిట్కాలు ఇవిగో!

eye health- ayurvedic treatments
eye health- ayurvedic treatments (Unsplash)

Ayurvedam to Improve Eyesight: సహజంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కొన్ని ఆయుర్వేద చికిత్సలు ప్రభావవంతంగా ఉంటాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నేటి డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం పెరిగిపోయింది. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, టీవీలు చూడటం వలన స్క్రీన్ టైమ్ పెరిగి కంటిపై భారం పడుతుంది. అదనంగా నిద్రలేమి సమస్యలతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. మరోవైపు వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి చూపు కోల్పోయే ప్రమాదాన్ని పెంచుతుంది. రోజురోజుకి దృష్టి లోపాలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతూపోతుంది. ఐదారేళ్ల వయసున్న చిన్న పిల్లలు కూడా కళ్లకు కళ్లజోడు ధరించాల్సిన పరిస్థితి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

సరైన కంటి సంరక్షణ లేకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం వలన కూడా డయాబెటిక్ రెటినోపతి, కార్నియల్ మచ్చలు, కంటిశుక్లం, పొడి కళ్ళు, కంటి అలెర్జీలు, మెల్లకన్ను వంటి సమస్యలు సంభవించవచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు. అందువల్ల కళ్లను ఆరోగ్యంగా చూసుకుంటూ, కంటిచూపును మెరుగుపరుచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Ayurvedic Treatments to Improve Eyesight- కంటిచూపుకు ఆయుర్వేద చికిత్సలు

సహజంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కొన్ని ఆయుర్వేద చికిత్సలు ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి చాలా సులభమైన పద్ధతులు, మీరు వీటిని మీ నిత్యకృత్యాలుగా చేసుకోవడం వలన కళ్లు శుభ్రపడతాయి, చూపు మెరుగుపడుతుంది. ఇందుకు మీరు ఏం చేయాలో ఇక్కడ సంక్షిప్తంగా తెలుసుకోండి.

త్రాటకం

త్రాటకం అనేది ఒక కొవ్వొత్తి వెలుగును లేదా ఏదైనా చిత్రాన్ని లేదా ఏదైనా నిశ్చల వస్తువును చూస్తూ ఉండటం. ఇది ధ్యానంలోని ఒక రూపం. ఈ కార్యాచరణ ద్వారా దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరచవచ్చు.

నేత్ర ధౌతి

ఇది కంటి శుభ్రపరిచే చికిత్స. శుభ్రమైన నీటితో కళ్లను కడగడం చేయాలి. ఇది కళ్ళ నుండి చెత్తను తొలగించడంలో సహాయపడుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది.

ఆయుర్వేద ఆహారం

కళ్ల ఆరోగ్యంతో పాటు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆయుర్వేదం సలహా ఇస్తుంది.

కంటి వ్యాయామాలు

కంటి వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, కళ్లపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు కనుగుడ్లను తిప్పడం, సుదూర వస్తువులపై దృష్టి పెట్టడం, కళ్లు మూసుకొని చేతులతో కళ్లకు వెచ్చని అనుభూతి కల్పించడం మొదలైనవి.

నాస్య

నాస్య అనేది ఒక ఆయుర్వేద ప్రక్రియ, ఇందులో భాగంగా నాసికా భాగాలను క్లియర్ చేయడానికి, సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఔషధం కలిపిన నూనె లేదా పొడిని ముక్కు ద్వారా పీల్చుకుంటారు, ఈ చికిత్స కంటి ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంటుంది.

నేత్ర తర్పణ

ఈ ప్రక్రియలో కనుబొమ్మలను బలోపేతం చేయడానికి, వాటికి పోషణ అందించడానికి నెయ్యిని ఉపయోగిస్తారు. ఇది కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది.

త్రిఫల

ఆయుర్వేద మూలిక త్రిఫల వివిధ రకాల కంటి రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. త్రిఫల పౌడర్‌ను నీటిలో కరిగించి ఐ వాష్‌గా ఉపయోగిస్తారు. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు, కళ్లపై భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం