Cooling Cucumber Raita । మండుతున్న కడుపుకు చల్లదనం చేకూర్చే దోసకాయ రైతా!-cooling cucumber raita recipe make it simply to get relief quickly from stomach burning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cooling Cucumber Raita । మండుతున్న కడుపుకు చల్లదనం చేకూర్చే దోసకాయ రైతా!

Cooling Cucumber Raita । మండుతున్న కడుపుకు చల్లదనం చేకూర్చే దోసకాయ రైతా!

HT Telugu Desk HT Telugu
Apr 16, 2023 01:29 PM IST

Cooling Cucumber Raita Recipe: మాంసాహారంలో ఉండే మసాలాలతో కడుపు మండుతుంది. ఇది దగ్గాలంటే రైతాను తీసుకోవాలి. చలువ గుణాల దోసకాయ రైతా రెసిపీని ఇక్కడ తినండి.

Cooling Cucumber Raita Recipe:
Cooling Cucumber Raita Recipe: (Unsplash)

మాంసాహారంతో పాటు రైతా తీసుకోవడం మంచిది. సాధారణంగా కూరలు, కబాబ్‌లలో ఉండే మసాలాల వలన కడుపులో కలిగే మంటను చల్లబరచడానికి రైతాను వడ్డిస్తారు. ఈ రైతాను మీరు వివిధ పదార్థాలతో వివిధ రకాలుగా చేసుకోవచ్చు. అయితే ఇందులో దోసకాయ రైతా మసాలా వంటకాలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఇది మీ కడుపును చల్లబరుస్తుంది, జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇక్కడ అలాంటి ఒక సింపుల్ దోసకాయ రైతా రెసిపీని అందిస్తున్నాం. మీరు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ కూలింగ్ దోసకాయ రైతాను తయారు చేయవచ్చు. ఆ రెసిపీని ఇక్కడ చదివి తెలుసుకోండి.

Cooling Cucumber Raita Recipe కోసం కావలసినవి

  • 1 పెద్ద దోసకాయ
  • 2 టీస్పూన్లు కోషర్ ఉప్పు
  • 1 తాజా పుదీనా కట్ట
  • 1/2 టీస్పూన్ గరం మసాలా
  • 1 చిటికెడు నల్ల మిరియాల పొడి
  • 1 కప్పు పెరుగు
  • 1 నిమ్మకాయ

దోసకాయ రైతా తయారీ విధానం

  1. ముందుగా దోసకాయను ఒక గిన్నెలో పీల్ చేసి తురుముకోవాలి. అందులో కొద్దిగా ఉప్పును చల్లుకొని బాగా కలపండి. దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కనపెట్టండి. ఈలోపు పుదీనా ఆకులను కట్ చేసుకోండి.
  2. 10 నిమిషాల తర్వాత ఉప్పులో మెరినేట్ చేసిన దోసకాయ తురుమును నుండి నెమ్మదిగా నీరు వడకట్టి, తురుమును మాత్రమే తీసుకోండి.
  3. ఇప్పుడు పెరుగులో తరిగిన పుదీనా ఆకులు, గరం మసాలా , మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఇందులోనే దోసకాయ తురుమును కూడా వేసి బాగా కలపండి.

చివరగా, పైనుంచి నిమ్మకాయ రసం పిండుకుంటే చలువ గుణాల దోసకాయ రైతా రెడీ. మీరు ఈ రైతాను ఆహారంతో పాటు తీసుకోవచ్చు. రిఫ్రిజిరేటర్‌లో నిల్వచేస్తే రెండు రోజుల పాటు బాగానే ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం