Cucumber Salad Recipe । దోసకాయ సలాడ్.. ఇలా తింటే రుచికరం, మరెంతో ఆరోగ్యకరం!-healthy cucumber salad with burst of flavors and nutrients check chef kunal s telugu recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cucumber Salad Recipe । దోసకాయ సలాడ్.. ఇలా తింటే రుచికరం, మరెంతో ఆరోగ్యకరం!

Cucumber Salad Recipe । దోసకాయ సలాడ్.. ఇలా తింటే రుచికరం, మరెంతో ఆరోగ్యకరం!

HT Telugu Desk HT Telugu
Dec 18, 2022 05:52 PM IST

దోసకాయ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే చెఫ్ కునాల్ కపూర్ ఒక చక్కని రెసిపీని అందించారు. ఆ Cucumber Salad Recipe ని ఇక్కడ చూడండి.

Cucumber salad recipe
Cucumber salad recipe (freepik)

దోసకాయ తినడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. రోజూ ఒక దోసకాయ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. విటమిన్ ఎ దృష్టి లోపాలను నివారిస్తుంది, డయాబెటీస్ సమస్య ఉన్నవారు దోసకాయ తినడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ సమతుల్యం అవుతాయి. ఇంకా రోగనిరోధక వ్యవస్థ, పునరుత్పత్తికి సహయపడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

చాలా మందికి దోసకాయ తినడం అంటే చాలా ఇష్టం కూడా. దోసకాయలను పచ్చిగానే నమిలేస్తారు. ఎవరికైనా దోసకాయలను పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే దోసకాయ సలాడ్ చేసుకొని తినవచ్చు. రోజూ ఉదయాన్నే లేదా సాయంత్రం వేళ ఇలాంటి ఒక సలాడ్ తింటే శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది, ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. అందులోనూ వీకెండ్ సమయాల్లో ఆదివారం మాసం ఎక్కువగా తినేస్తే అది అరగటానికి దోసకాయ సహాయపడుతుంది.

చెఫ్ కునాల్ కపూర్ ఇంట్లోనే రుచికరమైన, ఆరోగ్యకరమైన దోసకాయ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలియజేశారు. దానిని మేము మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం, మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి. దోసకాయ సలాడ్ చెఫ్ కునాల్ కపూర్ రెసిపీ ఈ కింద చూడండి.

Cucumber Salad Recipe కావలసినవి

  • కీర దోసకాయ - 3
  • బెల్లం - 3 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - రుచి కోసం
  • నిమ్మరసం - 5 టేబుల్ స్పూన్లు
  • అల్లం- ఒక చిన్న ముక్క
  • లైట్ సోయా సాస్ - 3 టేబుల్ స్పూన్లు
  • నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూన్
  • కాల్చిన నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  • రెడ్ క్యాప్సికమ్ - 2 టేబుల్ స్పూన్లు

దోసకాయ సలాడ్ తయారీ విధానం

  1. ముందుగా దోసకాయలను సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి, డ్రెస్సింగ్ కోసం ఖాళీ గిన్నె తీసుకోండి.
  2. గిన్నెలో కొంచెం బెల్లం తీసుకోండి, బెల్లం అందుబాటులో లేకపోతే మీరు తేనెను కూడా కలపవచ్చు.
  3. ఇప్పుడు బిల్లం గిన్నెలో నిమ్మరసంతో పాటు కొద్దిగా ఉప్పు కలపండి. అందులోనే అల్లం తురుము, కొద్దిగా సోయా సాస్ వేయండి.
  4. ఇప్పుడు ఈ మిశ్రమానికి కొంచెం నువ్వుల నూనెను కలపండి, లేదా ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు
  5. ఆపైన గిన్నెలో కొన్ని కాల్చిన నువ్వులను వేయండి. ఇప్పుడు అన్నింటిని కలపండి, బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు దీన్ని బాగా కలపండి.
  6. ఈ డ్రెస్సింగ్ రుచి ఉప్పగా, తీపిగా, కారంగా మూడు రుచులను ఉండాలి.
  7. ఇప్పుడు తరిగిన రెడ్ క్యాప్సికమ్ ముక్కలను కలపండి లేదా తాజా ఎర్ర మిరపకాయలను కూడా కలపవచ్చు.
  8. డ్రెస్సింగ్ కోసం మిశ్రమం సిద్ధమైనట్లే. ఈ మిశ్రమాన్ని దోసకాయల ముక్కలు ఉన్న గిన్నెలో పోసి బాగా కలపండి.
  9. ఇప్పుడు దీనిని ఫ్రిజ్‌లో 15 నిమిషాలు ఉంచండి.

అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన దోసకాయ సలాడ్ సిద్ధంగా ఉంది. ఆనందంగా తినండి, ఆరోగ్యంగా వర్ధిల్లండి.

WhatsApp channel

సంబంధిత కథనం