Lemon Curry | కడుపు చల్లగా, నోటికి పుల్లగా ఉండే నిమ్మకాయ కూరను తయారు చేయండిలా!
Lemon Curry Recipe: నిమ్మకాయ పచ్చడిని కూడా మీరు చాలా సార్లు తినే ఉంటారు, కానీ ఎప్పుడైనా నిమ్మకాయ కూరను తిన్నారా? మీకోసం ఇక్కడ ఆ ప్రత్యేకమైన నిమ్మకాయ కూర రెసిపీని అందిస్తున్నాం.
Summer Recipes: ఎండాకాలంలో నిమ్మకాయల వినియోగం ఎక్కువ ఉంటుంది. రిఫ్రెషింగ్ పానీయం నిమ్మకాయ షర్భత్ చేయడానికి, లెమన్ టీ, లెమన్ రైస్, లెమన్ చికెన్ ఇలా చాలా రకాల వంటకాల తయారీలలో నిమ్మకాయనే ప్రధానం. ఆహారాల రుచిని, ఫ్లేవర్ పెంచడానికి మనం నిమ్మకాయ రసాన్ని (Lemon Juice) ఉపయోగిస్తాం. ఈ వేసవిలో నిమ్మకాయను ఆహారంగా తినడం చాలా మంచిది. ఎందుకంటే, ఇది కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను (Lemon Health Benefits) కూడా కలిగి ఉంది. నిమ్మకాయల్లో విటమిన్-C తో పాటు ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయి. ఇది జీర్ణక్రియను పెంచుతుంది, రోగనిరోధక శక్తిని (Immunity) బలోపేతం చేస్తుంది, చర్మం, వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, బరువును తగ్గించడంలో (Weight Loss) ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
నిమ్మకాయతో చేసే రెసిపీలు కొన్ని మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా నిమ్మకాయ పచ్చడిని కూడా మీరు చాలా సార్లు తినే ఉంటారు, కానీ ఎప్పుడైనా నిమ్మకాయ కూరను తిన్నారా? మీకోసం ఇక్కడ ఆ ప్రత్యేకమైన నిమ్మకాయ కూర రెసిపీని అందిస్తున్నాం.
Lemon Curry Recipe కోసం కావలసినవి
- 7-8 నిమ్మకాయలు
- 1 అంగుళం చింతపండు ముక్క
- 2 టీస్పూన్ల తురిమిన బెల్లం
- 1 చిన్న అల్లం ముక్క
- 4-6 వెల్లుల్లి రెబ్బలు
- 2-3 పచ్చిమిర్చి
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 1/2 స్పూన్ ఆవాలు
- 1/2 స్పూన్ పసుపు
- 3 స్పూన్ల కారం
- 1/4 స్పూన్ మెంతిపొడి
- ఒక చిటికెడు ఇంగువ
- 1కరివేపాకు రెమ్మ
- రుచికి తగినంత ఉప్పు
నిమ్మకాయ కూర తయారీ విధానం
- ముందుగా చింతపండును ఒక పావు కప్పు నీటిలో నానబెట్టండి. పక్కన పెట్టండి. అలాగే నిమ్మకాయలను శుభ్రంగా కడిగి ఒక గుడ్డలో ఆరబెట్టండి.
- ఇప్పుడు ఒక బాణాలిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. అందులో నిమ్మకాయలు వేసి అన్ని వైపులా లేత గోధుమరంగు వచ్చేవరకు చిన్న మంటపై వేయించండి
- ఆ తర్వాత వేయించిన నిమ్మకాయలను చల్లబరిచి, మీడియం సైజ్ ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టండి.
- . ఇప్పుడు పాన్‌లో ఇంకొంచెం నూనెను వేడి చేయండి. అందులో ఆవాలు, ఆపై కరివేపాకు వేయించాలి. ఆపై వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి మళ్లీ వేయించాలి.
- ఇప్పుడు పసుపు, మెంతిపొడి, కారం వేసి కొన్ని సెకన్ల పాటు మళ్లీ వేయించాలి.
- ఇప్పుడు తరిగిన నిమ్మకాయల ముక్కలు వేసి కలపండి, ఆ వెంటనే చింతపండు నీరు, తురిమిన బెల్లం వేసి కొద్దిగా మరిగించండి.
- వెంటనే చిటికెడు ఇంగువ, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. నిమ్మకాయలు ఉడికింత వరకు కలుపుతూ ఉడికించండి.
అంతే, నిమ్మకాయ కూర రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ రుచిని ఆస్వాదించండి.
అయితే ఈ కూరను ఎక్కువగా తినకూడదు, పచ్చడిలాగే కలుపుకొని తినాలి. అంతేకాదు, ఈ కూరను ఒక శుభ్రమైన కంటైనర్‌లో ఉంచి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకుంటే, 2-3 వారాల వరకు తినవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్