Orange Peel Uses | నారింజ తొక్కను కంటిలో చిమ్మితే మంచిదేనా? తొక్కలోని ప్రయోజనాలు ఇవే!
Orange Peel Uses: నారింజ తొక్కలను పారేస్తే మీరు చాలా కోల్పోతారు, తొక్కలోని ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నారింజ తొక్కల గురించిన అద్భుత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
Orange Peel Uses: మీరు నారింజ పండును మాత్రమే తిని, దాని తొక్కను పారేస్తున్నారా? అయితే మీకు నారింజ తొక్కల వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తిగా తెలియదు. నారింజ పండు కంటే నారింజ తొక్కతోనే మరిన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. మీకు ఇది ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ, ఆరెంజ్ పీల్స్‌లో ఫ్లేవనాయిడ్‌లు, ఆరోగ్య ప్రయోజనాలను అందించే అనేక ఇతర ముఖ్యమైన ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక నారింజ పండు గుజ్జులో 71 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటే, నారింజ తొక్కలో 136 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ విటమిన్ సి కంటెంట్ ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి. అదనంగా నారింజ తొక్కలో రాగి, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఎ, బి విటమిన్లు, డైటరీ ఫైబర్ వంటి పోషక మూలకాలు నిండుగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.
అయితే దీని అర్థం నారింజ పండు తొక్కతో పాటుగా తినేయమని అర్థం కాదు. నారింజ తొక్కను పారేయకుండా దానిని సరైన విధానంలో నిల్వచేసి ఉపయోగిస్తే ప్రయోజనాలు పొందవచ్చు. నారింజ తొక్కను నేరుగా తినడం వలన దాని కఠినమైన చర్మంను జీర్ణంచేయడానికి జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది, తొక్కలోని గాఢమైన సమ్మేళనాలు కడుపు నొప్పిని కలిగిస్తాయి. కాబట్టి తక్కువ పరిమాణంలో, సులభంగా జీర్ణమయ్యే రీతిలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చునని చెబుతున్నారు. ఇందుకోసం నారింజ తొక్కను చిన్నగా, సన్నగా తురుముకొని (Orange Zest) దానిని సలాడ్లు, స్మూతీలకు కలుపుకోవచ్చు. ఆరెంజ్ క్యాండీ తయారు చేయవచ్చు లేదా ఏవైనా రిఫ్రెషింగ్ పానీయాలు, హెర్బల్ టీలలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా నారింజ తురుము తీసుకుంటే ఇది మీ ఆహారం రుచిని, ఫ్లేవర్ ను పెంచడమే కాక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
Orange Peel Health Benefits- నారింజ తొక్క ఆరోగ్య ప్రయోజనాలు
- చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది
- కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి
- దంత సమస్యలను నివారిస్తుంది
- బరువు తగ్గడంలో సహాయపడుతుంది
- జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
- నొప్పులు, వాపులను నయం చేస్తుంది
- మధుమేహం నియంత్రణలో ఉంటుంది
- క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడతాయి
- ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
- హృదయాన్ని బలోపేతం చేస్తుంది
Squeezing Orange Peel In Eyes- నారింజ తొక్కను కంటిలో చిమ్మితే మంచిదేనా
నారింజ తొక్కను పిల్లలు కళ్లలో చిమ్ముతూ ఆనందం పొందడం మీకు తెలిసే ఉంటుంది. నారింజ తొక్కలలో లిమోనెన్, డెకానల్, సిట్రల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడవచ్చు అని కొన్ని నివేదికలు సూచించాయి. కానీ, నారింజ తొక్కలను లేదా నారింజ రసాన్ని నేరుగా కళ్లలోకి చిమ్మడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటాయి.
అందువళ్ల కళ్లలో చిమ్మినపుడు కళ్లలో మంట, చికాకును కలిగిస్తాయి. పొరపాటున నారింజ రసం కంటిలో పడితే వెంటనే కళ్లను చల్లని నీటితో కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నారింజ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని సలహా ఇస్తున్నారు.
Good For Skin- చర్మానికి మంచిది
అయితే నారింజ రసాన్ని చర్మంపై అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నారింజ రసంలోని ఆస్ట్రింజెంట్ లక్షణాలు పొడి చర్మం, జిడ్డుగల చర్మం, మొటిమల చర్మానికి మేలు చేస్తాయి. నారింజ రసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని శుభ్రపరిచి సహజంగా ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. నారింజ రసంలోని విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి.
నారింజ తొక్కలను సరిగ్గా వాడితే చాలా ఉపయోగాలు, ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి తొక్కలే అని నారింజ తొక్కను అలా పారేయకండి, దాచుకొని వాడుకోండి.
సంబంధిత కథనం