గ్లాకోమా అనేది కంటి నరాలు ఒత్తిడికి గురవడం వలన కలిగే దృష్టి లోపానికి సంబంధించిన సమస్య. ఇది మీ మెదడుకు, కళ్ల మధ్య కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తుంది. ఇది తీవ్రమైనపుడు కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సాధారణ కంటి ఒత్తిడితో కూడా ఈ గ్లాకోమా సమస్య రావచ్చు. కాబట్టి మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
ఈ రోజుల్లో ప్రజలకు దృష్టి సమస్యలు సర్వసాధారణంగా మారుతున్నాయి. కంటికి హాని కలిగించే అలవాట్లు, పోషకాహార లోపం, ఇతరత్రా కారణాల వలన ప్రజలు కంటిచూపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే గ్లాకోమా వంటి తీవ్రమైన కంటి సమస్యలతో పాటు కంటి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ సమస్యకు పురాతన వైద్యశాస్త్రం అయినటువంటి ఆయుర్వేదంలో పరిష్కారాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయుర్వేద కంటి స్పెషలిస్ట్ డాక్టర్ మహేందర్ సింగ్ బసు, డాక్టర్ యోగిని పాటిల్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వివిధ ఆయుర్వేద చిట్కాలను పంచుకున్నారు. కళ్లలోని టాక్సిన్స్ తొలగించేందుకు, ప్రతిరోజూ ఉదయం పూట చల్లటి నీటితో మీ కళ్ళను మెల్లగా కడగాలి. సహజసిద్ధంగా లభించే రోజ్ వాటర్ కూడా ఉపయోగించవచ్చు, ఇది శీతలీకరణ ప్రభావాలను కలిగి ఉంటుంది. అదనంగా, ఔషధ గుణాలు కలిగిన నెయ్యిని కూడా కళ్ళకు పూయవచ్చునని తెలిపారు. ఇలా చేయడం వల్ల మీ కళ్లలోని మలినాలు తొలగిపోతాయని డాక్టర్ మహేందర్ అన్నారు.
ఆయుర్వేద వైద్య నిపుణులు కంటి ఆరోగ్యానికి సంబంధించి అందించిన మరికొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గమనిక: కళ్లు చాలా సున్నితమైనవి. మీరు కంటికి సంబంధించి ఎలాంటి చికిత్స తీసుకోవాలన్నా ముందుగా సరైన వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. ఇక్కడ పేర్కొన్న ఆయుర్వేద చిట్కాలను అనుసరించే ముందు, మీకు దగ్గరలోని ఆయుర్వేద అభ్యాసకుడిని సంప్రదించి వారి సలహా తీసుకోవడం మరిచిపోకండి.
టాపిక్