Prenatal Yoga Poses । గర్భిణీ స్త్రీల శ్రేయస్సు కోసం.. సున్నితమైన యోగాసనాలు ఇవిగో!-prenatal yoga poses check out these 5 yoga asanas for pregnant women ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prenatal Yoga Poses । గర్భిణీ స్త్రీల శ్రేయస్సు కోసం.. సున్నితమైన యోగాసనాలు ఇవిగో!

Prenatal Yoga Poses । గర్భిణీ స్త్రీల శ్రేయస్సు కోసం.. సున్నితమైన యోగాసనాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu
Jan 02, 2023 07:12 PM IST

Prenatal Yoga Poses: గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే 5 యోగా ఆసనాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి అందరి శరీర రకాలకు సరిపడేవి, చాలా సులభమైనవి అలాగే శక్తివంతమైనవి.

Prenatal Yoga Poses
Prenatal Yoga Poses (Unsplash)

యోగా అనేది పురాతనమైన సాంప్రదాయిక అభ్యాసం. ఇది మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక అద్భుతమైన సాధనం. గర్భంతో ఉన్న స్త్రీలు కూడా ఆచరించదగ్గ కొన్ని యోగాసనాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో యోగా సురక్షితమైనదని మాత్రమే కాకుండా విభిన్నమైన వ్యాయామం అని కూడా నమ్ముతారు. గర్భిణీలు చేసే ప్రినేటల్ యోగాతో వారి అన్ని కోణాల నుంచి సంపూర్ణ శ్రేయస్సు లభిస్తుంది.

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, హిమాలయన్ సిద్ధా అక్షర్ జరాఫ్‌షాన్ షిరాజ్‌తో మాట్లాడుతూ.. 'గర్భధారణ సమయంలో మహిళలు చాలా శారీరక అసౌకర్యానికి గురవుతారు. ఈ సమయంలో వారికి యోగాభ్యాసం మంచి వశ్యత, మానసిక స్పష్టత, ఏకాగ్రతతో కూడిన శ్వాసను ప్రోత్సహిస్తుంది. అనేక అధ్యయనాలు, పరిశోధనలు కూడా గర్భిణీ స్త్రీలకు, వారి పుట్టబోయే బిడ్డలకు ప్రినేటల్ యోగా (Prenatal Yoga) ఆరోగ్యకరమైనది' అని తెలిపారు.

యోగ పద్ధతులలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన వ్యాయామాలు ఉన్నాయి, ఇవి ఆందోళనను తగ్గించగలవు. మహిళలను గర్భధారణ సమయంలో, ప్రసవ సమయంలో ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే వారి శరీరం, వారి బిడ్డతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడతాయి.

Yoga Asanas for Pregnant Women- గర్భిణీ స్త్రీలకు యోగా ఆసనాలు

గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే 5 యోగా ఆసనాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి అందరి శరీర రకాలకు సరిపడేవి, చాలా సులభమైనవి అలాగే శక్తివంతమైనవి కూడా. గర్భధారణ సమయంలో గర్భిణీలు అనుభవించే ఏవైనా నొప్పులను తగ్గించి, వారిని ఫిట్‌గా ఉండటానికి ఈ యోగాభ్యాసం ఒక సున్నితమైన వ్యాయామం.

గర్భిణీ గర్భిణీ స్త్రీలకు యోగా గురువు సూచించిన 5 యోగా ఆసనాలు ఈ కింద చూడండి.

1. వృక్షాసనం

ఈ ఆసనం వేసేందుకు సమస్థితిలో నిలబడండి. ఆపై మీ కుడి పాదాన్ని ఎత్తి, మీ లోపలి తొడ భాగంలో ఉంచండి. మీ ఎడమ కాలుపై మీ మొత్తం బరువును సమతుల్యం చేయండి. మీ కుడి కాలును మీ పెల్విస్‌కు వీలైనంత దగ్గరగా ఉంచండి. మీ పాదం సరైన స్థానం పొందడానికి, మీ చేతులతో సపోర్ట్ చేయవచ్చు. మీ హృదయ చక్రం వద్ద, ప్రాణం ముద్రలో మీ అరచేతులను సమలేఖనం చేయండి. ఇలా కొన్ని క్షణాల పాటు ఉండి, ఇదే విధంగా మరొక కాలుతో మునుపటి దశను పునరావృతం చేయండి.

2. బద్ధ కోనాసనం

సౌకార్యంగా కూర్చోండి, ఆపై మీ రెండు అరికాళ్ళను ఒకచోట చేర్చండి. మీ కటి వైపు మీ మడమలను పైకి తీసుకురండి. మీ మోకాళ్ళను సున్నితంగా తగ్గించండి. మీ కడుపులోని గాలిని ఖాళీ చేయండి. 15 నుండి 20 సెకన్ల వరకు ఇదే స్థానంలో ఉంచండి. 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు రిపీట్ చేయవచ్చు.

3. కలియాసనం

ఇది మీ కాలివేళ్లపై భారం వేసి మోకాళ్లపై బ్యాలెన్స్ చేసే ఆసనం. మీ రెండు కాళ్లను సమాన దూరంలో జరిపి మీ మోకాళ్లను వంచండి, ఇప్పుడు మీ చేతులను మీ మోకాళ్లపై ఉంచి ధ్యాన ముద్రలో ఉండండి, అన్ని సమయాల్లో మీ వీపును నిఠారుగా ఉంచండి. మీరు మీ చేతులను పైకి లేపినప్పుడు, అవి మీ భుజాలకు సమాంతరంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.

4. బాలసనం

చాప మీద మోకరిల్లి, మీ మడమల మీద కూర్చోండి, మీ మోకాళ్ళను సౌకర్యవంతమైన దూరం వరకు విస్తరించండి. ఊపిరి పీల్చుకుని చేతులు తలపైకి ఎత్తండి. శ్వాస వదులుతూ, మీ అరచేతులను నేలపై ఉంచుతూ మీ పైభాగాన్ని ముందుకు వంచండి. పెల్విస్ మడమల మీద విశ్రాంతి తీసుకోవాలి. మీ వీపు వంకరగా లేదని నిర్ధారించుకోండి.

5. తడసానం

దీనినే పామ్ ట్రీ భంగిమ, సమస్థితి అని కూడా పిలుస్తారు. నిటారుగా ఎలాంటి వంపులేకుండా నిలబడాలి, ఆ తర్వాత మీ రెండు చేతులను పైకి చాచి, ఆ చాచిన చోటే మీ చేతిలో చేయి వేసి, వేళ్లతో ముడివేసుకోవాలి. అదే భంగిమలో మీ శరీరాన్ని అన్ని వైపులా కొన్ని సెకన్ల పాటు స్ట్రెచ్ చేయాలి.

Whats_app_banner