Benefits of Foot Massage । పాదాలకు మసాజ్ చేస్తే మొత్తం శరీరానికి ప్రయోజనాలున్నాయి, అవేంటంటే!
Benefits of Foot Massage: పాదాల నొప్పిగా ఉంటే మసాజ్ ద్వారా ఉపశమనం పొందవచ్చు. పాదాలకు మసాజ్ ద్వారా కలిగే ప్రయోజనాలు చూడండి.
పాదాల నొప్పిగా ఉందంటే అదేమి అంతర్లీన వ్యాధికి సంకేతం కాకపోవచ్చు. రోజంతా వివిధ పనుల కోసం నాలుగు దిక్కులు తిరిగి ఇంటికి చేరిన తర్వాత పాదాల్లో నొప్పి మొదలవుతుంది. సరిపోని బూట్లు ధరించడం, ఎక్కువసేపు నిలబడి ఉండటం, ఎక్కువసేపు నడవడం లేదా మారథాన్‌లో పరుగెత్తడం, బెణుకులు, స్ట్రెయిన్‌లు లేదా గాయం వంటివి కూడా పాదాల నొప్పికి కారణం అవుతాయి.
పాదాలలో నొప్పి ఉన్నప్పుడు సాధారణంగా చాలా మంది పెద్దగా పట్టించుకోరు, కానీ పరిస్థితి తీవ్రమైతే మాత్రం ఏదో రకంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నొప్పిని ఎదుర్కోవటానికి, కొంతమంది తమ పాదాలను వెచ్చని నీటిలో నానబెడతారు, కొందరు హీటింగ్ ప్యాడ్లను ఉపయోగిస్తారు, మరికొందరు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. కానీ పాదాల నొప్పికి ఇవేమి సరైన ఉపశమనాన్ని కలిగించవు. ఈ సమస్యకు ఫుట్ మసాజ్ చేసుకోవడం చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. పాదాలకు మసాజ్ చేసుకోవడం ద్వారా మీకు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది, ఒక విశ్రాంతి భావనను పొందుతారు.
అయితే ఈ ఫుట్ మసాజ్ చేసుకోవడం వలన కేవలం మీ పాదాలకు మాత్రమే కాదు, మీ మొత్తం శరీరానికి అలాగే మీ మానసిక ఆరోగ్యానికి వివిధ ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
Benefits of Foot Massage- పాదాలకు మసాజ్ ద్వారా కలిగే ప్రయోజనాలు
పాదాలు శరీరంలోని ముఖ్యమైన రక్త కేశనాళికలకు నిలయం. ఫుట్ మసాజ్ ద్వారా ఇక్కడ కండరాలు సక్రియం అవుతాయి, ఫలితంగా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
కీళ్ల నొప్పి ఉపశమనం
ప్రతిరోజూ అరికాళ్ళకు మసాజ్ చేయడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మీరు అరికాళ్ళకు మసాజ్ చేసినప్పుడు, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఇది నరాలకు ఉపశమనం ఇస్తుంది. మసాజ్ చేయడం వలన పాదంలో ఆర్థరైటిస్ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది పాదం, చీలమండ కీళ్లలో వశ్యతను మెరుగుపరుస్తుంది.
మంచి నిద్ర కోసం
ఒత్తిడి, అలసట కారణంగా చాలా సార్లు నిద్ర కాదు, అటువంటి పరిస్థితిలో, మీరు రాత్రి పడుకునే ముందు అరికాళ్ళకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే, మీ మనస్సు ప్రశాంతం మారుతుంది. అది మీరు హాయిగా నిద్రపోడానికి సహాయపడుతుంది.
ఊబకాయం నియంత్రణ
రోజూ ఫుట్ మసాజ్ చేసుకోవడం వల్ల అధిక బరువు తగ్గిపోతారంటే మీకు వింతగా అనిపించవచ్చు. కానీ అది నిజమే, ఫుట్ మసాజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది, ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలోని వివిధ భాగాలలో ఉన్న కొవ్వును తొలగించడంలో మసాజ్ సహాయపడుతుంది. ఇది చెమట సహాయంతో విషపూరిత మూలకాలను బయటకు తీయడంలో సహాయపడుతుంది.
వెచ్చదనం కోసం
మసాజ్ సమయంలో, అరికాళ్ళపైన వివిధ పాయింట్లపై ఒత్తిడి వర్తించడం జరుగుతుంది, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా శరీరంలో వేడి ఉత్పన్నం అవుతుంది. శరీరంలోని వివిధ భాగాలు ఉపశమనం పొందుతాయి.
మెరుగైన కంటిచూపు
మన పాదాలు, మన కళ్లకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటాయి. అందుకే రెగ్యులర్ ఫుట్ మసాజ్ మీ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
సంబంధిత కథనం