Live Longer । బాడీ మసాజ్ చేసుకుంటే దీర్ఘాయుష్షుతో జీవిస్తారట!
Live Longer: మీరు దీర్ఘాయుష్షుతో జీవించాలనుకుంటే ప్రతిరోజూ మసాజ్ చేసుకోవాలి. అయితే అదొక్కటే కాదు, మరికొన్ని షరతులు, నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
మన శారీరక, మానసిక స్థితిగతులు అనేవి మనం ఏమి తింటాము, ఏమి ఆలోచిస్తాము, మనం నివసించే వాతావరణం, మనం అనుసరించే దినచర్యపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత కాలంలో పీల్చే గాలి కలుషితం, తాగే నీరు కలుషితం, తినే తిండి కూడా కలుషితం అయిపోయింది. ఎక్కువ దిగుబడి కోసం విపరీతంగా పురుగు మందులు వాడి పంటలు పండించడం దగ్గర నుంచి ఆ ఉత్పత్తి వినియోగదారుడి చేతికి వచ్చేవరకు దాని నాణ్యత ఎంతో తగ్గిపోతుంది. అలాంటపుడు ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఆరోగ్యం చెడిపోవడం మాత్రమే కాకుండా, మన మనిషి సగటు ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి.
Ayurvedic Remedies to Live Longer- దీర్ఘాయుష్షుకు ఆయుర్వేద చిట్కాలు
ఎల్లప్పుడూ ఆరోగ్యంతో జీవించాలనుకుంటే, దీర్ఘాయుష్షు పొందాలనుకుంటే అందుకు ఆయుర్వేదం కొన్ని మార్గాలను సూచిస్తుంది. వాటిని అనుసరించడం ద్వారా ఆయుర్దానం పెరుగుతుంది.
సూర్యుడు ఉదయించకముందే లేవండి
ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే మేల్కొనాలని ఆయుర్వేదం నొక్కి చెబుతుంది, తద్వారా మీ శరీర చక్రం, సూర్య చక్రంతో సమకాలీకరించబడుతుంది. ఉదయం వేళ వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది, మీరు ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన క్షణాలను గడపవచ్చు. ఉదయం లేచి చెప్పులు లేకుండా పచ్చికబయళ్లపై నడవండి. యోగా, ధ్యానం, సూర్యనమస్కారాలు లేదా మీకు నచ్చిన వ్యాయామాలు చేయండి.
సంతులన ఆహారం
ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. మీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు, రుచులు, రంగులు ఉండాలి. స్థానికంగా పండే సీజనల్ పండ్లు, కూరగాయలను ఎల్లప్పుడూ తినండి. సూర్యాస్తమయం కంటే ముందే రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఇది సాధ్యం కాకపోతే, 8 గంటల లోపు తినేయాలి, ఆ తర్వాత ఎలాంటి ఆహారం తినవద్దు.
సుగంధ ద్రవ్యాలు
మెంతులు, ఇంగువ, జీలకర్ర, పసుపు, సోపు, కొత్తిమీర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు వంటి సుగంధ ద్రవ్యాలు ఆయుర్వేదం ప్రకారం ఔషధాలు. వాటన్నింటినీ మీ ఆహారంలో చేర్చుకోండి.
నెయ్యి
ఆవు నెయ్యి వల్ల కలిగే అనేక ప్రయోజనాలు అనేకం అని ఆయుర్వేదంలో వివరించడమైనది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మాన్ని నయం చేస్తుంది, మెదడుకు మంచిది, శరీర ద్రవాలను నిర్మిస్తుంది.
మసాజ్
ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ మసాజ్ చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్త ప్రసరణను పెంచుతుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది,వివిధ అవయవాలను పోషణ అందేలా చూస్తుంది. నిద్ర లేవగానే స్నానం చేసే ముందు బాడీ మసాజ్ చేసుకోవడం చాలా మంచిది.
ఉపవాసం
ఉపవాసం ప్రాముఖ్యత గురించి ఆయుర్వేదంలో వివరణ ఉంది. అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తుండటం ద్వారా మీ జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది, దాని పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు తొలగిస్తుంది. ఉపవాసం సమయంలో, నిమ్మ, అల్లం, సీజనల్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వంటివి తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
సంబంధిత కథనం