Mango Fruit Salad Recipe । ఆరోగ్యకరమైన ఫలాహారంతో మీ రోజును మధురంగా ప్రారంభించండి!
Mango Fruit Salad Recipe: ఆరోగ్యకరమైన అల్పాహారం చేయాలనుకుంటే ఒకసారి ఇలా మీకు నచ్చిన పండ్లను కలిపి ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. రెసిపీ కోసం ఇక్కడ చూడండి.
Mango Fruit Salad Recipe (Istock)
Healthy Breakfast Recipes: అల్పాహారం రోజులో చేసే అతి ముఖ్యమైన భోజనం. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏదో ఒకటి తిని సరిపెట్టుకునే బదులు ఒక్కరోజైనా మంచి పోషకాలు నిండిన అల్పాహారం చేయండి. ఇది పండగల సీజన్, పైగా ఎండాకాలం. ఈ సమయంలో అదీఇదీ తినే బదులు ఈ సీజన్‌లో లభించే రుచికరమైన పండ్లతో ఫ్రూట్ సలాడ్ చేసుకొని ఉదయం అల్పాహారంగా తినండి. ఇది ఈ వేడి వాతావరణంలో మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది, హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. ఎంతో ఆరోగ్యకరం కూడా.
మామిడి పండ్లతో సహా వివిధ రకాల పండ్లను ఉపయోగించి రుచికరమైన, ఆరోగ్యకరమైన ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
Mango Fruit Salad Recipe కోసం కావలసినవి
- 2 మామిడి పండ్లు
- 2 అరటిపండ్లు
- 2 సపోటా పండ్లు
- 1 చిన్న బొప్పాయి పండు
- 1/4 కప్పు స్ట్రాబెర్రీలు
- 1/4 కప్పు దానిమ్మ గింజలు
- 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు
- 2 టేబుల్ స్పూన్లు బాదం
- 2 టేబుల్ స్పూన్లు పిస్తా
- 1 టేబుల్ స్పూన్ తేనె
- కొన్ని పుదీనా ఆకులు గార్నిష్ కోసం
ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం
- ముందుగా పండ్లను అన్నింటిని శుభ్రంగా కడిగి, ముక్కలుగా కోసుకోండి, వాటి గింజలను తొలగించండి. దానిమ్మ పండులో మాత్రం గింజలు మాత్రం తీసుకోండి.
- అలాగే జీడిపప్పు, పిస్తాపప్పు, బాదాం పప్పు ఇంకా ఏవైనా మీకు నచ్చిన నట్స్ ను చిన్న ముక్కలుగా చేసుకోండి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ గిన్నె తీసుకొని అందులో మొదటగా కట్ చేసిన పండ్లముక్కలు వేయండి.
- ఆ తర్వాత దానిమ్మ పండు గింజలను వేయండి. ఆపైన తరిగిన నట్స్ వేయండి
- ఇప్పుడు పైనుంచి తేనే లేదా సిరప్ చిలకరించండి.
- చివరగా పుదీనా ఆకులతో గార్నిషింగ్ చేయండి.
అంతే, మీ ఫ్రూట్ సలాడ్ సిద్ధం అయినట్లే. ఇదే మీకు ఆరోగ్యకరమైన అల్పాహారం.
సంబంధిత కథనం