Hanuman Jayanti 2023 । హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. శక్తివంతమైన మంత్రాలు ఇవిగో!
Happy Hanuman Jayanti 2023- హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసేందుకు Happy Hanuman Jayanti Greetings, స్మరించడానికి హనుమంతుడి మంత్రాలు, హనుమాన్ జయంతి విశిష్టత మొదలైనవన్నీ ఇక్కడ చూడండి.
Hanuman Jayanti 2023: హనుమాన్ జయంతి అనేది హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. హనుమాన్ జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమి ఏప్రిల్ 6న గురువారం రోజున వస్తుంది. ఇది హనుమండు జన్మించిన రోజును తెలియజేస్తుంది. హనుమంతుని జన్మవృత్తాంతం శివ పురాణం, రామాయణం మొదలైన పురాణ గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించడమైనది.
హనుమంతుడికి ఆంజనేయుడు, మారుతి, హనుమ, వాయుపుత్రుడు, అంజనీసుతుడు, బజరంగీ, కేసరీనందన, పవన తనయ వంటి అనేక పేర్లు ఉన్నాయి. అయితే హనుమంతుడు శ్రీరామ బంటుగా, రామదూతగా ప్రసిద్ధి. హిందూ పురాణాల ప్రకారం, హనుమంతుడు శ్రీరామునికి అత్యంత గొప్ప భక్తుడు, తన గుండెల నిండా శ్రీసీతారాములను నిండుగా దాచుకున్న దాసుడు. శ్రీరాముని పట్ల హనుమకు ఉన్న అచంచలమైన భక్తిని ఆయన భక్తులు సైతం ఆరాధిస్తారు.
హనుమాన్ జయంతి హనుమంతుని సద్గుణాలను తెలియజేసే ప్రాముఖ్యతను కలిగి ఉంది. హనుమంతుడు ధైర్యం, విధేయత, విశ్వాసం, నమ్మకం, భక్తి, నిస్వార్థత, చురుకుతనం, తెలివి వంటి గొప్ప గుణాలను కలిగి ఉన్నాడు.
హనుమాన్ జయంతి రోజున భక్తులు హనుమంతునికి విశేషమైన పూజలు చేస్తారు, హనుమాన్ చాలీసా పఠిస్తారు, రామనామ జపం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున మీరు కూడా హనుమద్నామ స్మరణలో తరించేందుకు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసేందుకు Happy Hanuman Jayanti Greetings, Lord Hanuman Mantras, Hanuman Sri Rama Bonding, Hanuman Chalisa Chants, Hanuman Jayanti Wishes, Lord Hanuman Images, Hanuman WhatsApp Status ఇక్కడ అందిస్తున్నాం..
Happy Hanuman Jayanti 2023- హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
This year, lets pledge to have strength and courage in our hearts like Lord Hanuman to face all kinds of challenges in life. Happy Hanuman Jayanti.
గ్రహదోష నివారణకు:
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
May Lord Hanuman guide you to the path of strength, wisdom and devotion. Happy Hanuman Jayanti.
ఆరోగ్యంనకు:
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
Happy Hanuman Jayanti to you and your family. May you have a great day, Be Blessed. Happy Hanuman Jayanti.
వివాహ ప్రాప్తికి:
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!
Every line of the Hanuman Chalisa is a Mahamantra- Happy Hanuman Jayanti.
సంతాన ప్రాప్తికి:
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
Lets follow the path of Lord Hanuman and strengthen ourselves for everything that has to come. May be never fear the unknown. Happy Hanuman Jayanti.
ఉద్యోగ ప్రాప్తికి:
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
మీకు, మీ కుటుంబ సభ్యులకు హిందుస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
సంబంధిత కథనం