Happy Sri Rama Navami 2023 । శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలపండి.. రామ నామ స్మరణతో తరించండి!-happy sri ram navami 2023 wishes in telugu festival significance lord rama messages festival greetings to share ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Happy Sri Ram Navami 2023 Wishes In Telugu, Festival Significance, Lord Rama Messages, Festival Greetings To Share

Happy Sri Rama Navami 2023 । శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలపండి.. రామ నామ స్మరణతో తరించండి!

HT Telugu Desk HT Telugu
Mar 29, 2023 07:15 PM IST

Happy Sri Rama Navami 2023: శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీ ప్రియమైన వారికి తెలియజేయాలనుకుంటే రామ నవమి శుభాకాంక్షలు, Happy Sri Rama Navami Greetings, తారక మంత్రాలు, శ్రీరామ నవమి విశేషాలు అన్ని ఇక్కడ చూడండి.

Happy Sri Rama Navami
Happy Sri Rama Navami (Freepik)

Happy Sri Rama Navami 2023: హిందువులు ప్రతి సంవత్సరం జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో శ్రీరామ నవమి ఒకటి. ఈ సంవత్సరం, రామ నవమి గురువారం, మార్చి 30న వస్తుంది. ఇది మహా విష్ణువు ఏడవ అవతారంగా చెప్పే శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు అని పురాణాలు తెలియజేశాయి. ఈ ప్రకారంగా, ప్రతీ ఏడాది చైత్రమాసంలో అమావాస్య తర్వాత 9వ రోజున వచ్చే నవమిని ‘శ్రీరామ నవమి’ గా గుర్తిస్తారు. ఇది చైత్ర నవరాత్రుల ముగింపును కూడా సూచిస్తుంది.

పద్నాలుగు సంవత్సరాల వనవాసము చేసి, ఆపై రావణ సంహారం గావించి తిరిగి సీతాసమేతంగా అయోధ్య చేరిన శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడైనాడు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ ముహుర్తాన్నే జరిగిందని భక్తుల విశ్వాసము. అందుకే శ్రీరామ నవమి రోజున దేవాలయాల్లో ఈ ఘట్టాలన్నింటినీ నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరుపుతారు, సీతారాములను పల్లకిలో ఊరేగిస్తారు.

మీరు కూడా మీ ఇంట్లో శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటుంటే మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. మీ ప్రియమైన వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే రామ నవమి శుభాకాంక్షలు, Happy Sri Rama Navami Greetings, Sri Rama Mantras, Ramayana Quotes, శ్రీరామచంద్రుడు అచరించిన ధర్మోపదేశాలను, రామాయణ సందేశాలను, శ్రీరామ మంత్రాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. మీరు మీ Facebook, WhatsApp, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ శ్రీరామ నవమి శుభాకాంక్షలను మీ ఆత్మీయులతో పంచుకోవచ్చు.

Happy Sri Rama Navami- శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Happy Sri Rama Navami 2023-  శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
Happy Sri Rama Navami 2023- శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

ఓం శ్రీ రామాయ నమః- May the divine grace of Lord Rama always be with you. Wish you a very happy and prosperous Sri Rama Navami.

Happy Sri Rama Navami 2023-  శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
Happy Sri Rama Navami 2023- శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

శ్రీరామ జయ రామ జయ జయ రామ- - May Lord Ram bless you with success, happiness and peace on the auspicious occasion of Ram Navami. Shubha Sri Ram Navami to you and your loved ones.

Happy Sri Rama Navami 2023-  శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
Happy Sri Rama Navami 2023- శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నో రామ ప్రచోదయాత్- On this holy occasion of Ram Navami, I wish that the blessings of Lord Ram are with you and your family. May your heart and home be filled with happiness, peace and prosperity. Happy Ram Navami.

Happy Sri Rama Navami 2023-  శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
Happy Sri Rama Navami 2023- శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||- With the blessings of Lord Ram, may you achieve success in all your endeavours. Shubh Ram Navami to you and your family.

Happy Sri Rama Navami 2023- శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
Happy Sri Rama Navami 2023- శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

శ్రీ రాముడి సద్గుణాలు సదా ఆదర్శం, రాముడు ఆచరించిన ధర్మం ప్రపంచానికే శాంతి మార్గం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హిందుస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

WhatsApp channel

సంబంధిత కథనం