Ragi Upma Recipe । రాగి ఉప్మా.. రోగాలను దూరం చేసే అల్పాహారం!-from curing diabetes to increasing breast milk finger millet is best here is ragi upma breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  From Curing Diabetes To Increasing Breast Milk Finger Millet Is Best, Here Is Ragi Upma Breakfast

Ragi Upma Recipe । రాగి ఉప్మా.. రోగాలను దూరం చేసే అల్పాహారం!

HT Telugu Desk HT Telugu
Mar 25, 2023 06:30 AM IST

Ragi Upma Recipe: ఉప్మా ఎప్పుడూ చేసుకునేలా కాకుండా రాగి ఉప్మా చేసుకుంటే మరింత పోషకభరితంగా, ఆరోగ్యకరమైన అల్పాహారంగా మారుతుంది. రాగి ఉప్మా రెసిపీని ఇక్కడ చూడండి.

Ragi Upma Recipe
Ragi Upma Recipe (slurrp)

Ragi Health Benefits: మన ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన మిల్లెట్లలో రాగులు కూడా ఒకటి. వీటిలో అధిక ప్రోటీన్ ఉంటుంది, మధుమేహం సమస్య ఉన్నవారికి మంచి ఆహారం, అలాగే జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, సహజంగా బరువు తగ్గించే ఏజెంట్లు ఉన్నాయి. వృద్ధాప్య సంకేతాలు దూరం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ, జుట్టు పెరుగుదలకు కూడా రాగులు మంచివి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బలమైన ఎముకలకు ఇది అవసరం, అందుకే రాగి వంటకాలు చాలా బలవర్ధకమైన ఆహారంగా చెప్తారు. తల్లి పాల ఉత్పత్తిని కూడా పెంచడానికి కూడా ఇది మంచి సూపర్‌ఫుడ్.

రాగిపిండితో మనం రాగి జావ (Ragi Malt), రాగి సంకటి, రాగి రోటీ వంటివి సాధారణంగా చేసుకునే ఆహారాలు. మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గా రాగి దోశ, రాగి ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. ఇవి కాకుండా రాగి ఉప్మా చేసుకోవచ్చని మీకు తెలుసా? ఉప్మా మనం రవ్వతో చేసుకునే అల్పాహారం, ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. రాగి రవ్వతో ఉప్మా చేసుకుంటే అది మరింత ఆరోగ్యకరమైన అల్పాహారంగా మారుతుంది. రాగి ఉప్మా రెసిపీని ఈ కింద చూడండి.

Ragi Upma Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు రాగి రవ్వ
  • 3 కప్పుల నీరు
  • 2 టేబుల్ స్పూన్ల నూనె / నెయ్యి
  • 1 ఉల్లిపాయ
  • 1 tsp అల్లం
  • 2 పచ్చి మిరపకాయలు
  • 1 చిటికెడు ఇంగువ
  • 1/2 టీస్పూన్ స్పూన్ ఆవాలు
  • 1/2 టీస్పూన్ టీస్పూన్ జీలకర్ర
  • 3 టేబుల్ స్పూన్లు వేరుశెనగ
  • 2 టీస్పూన్ చనా పప్పు
  • 2 స్పూన్ మినపపప్పు
  • 1 రెమ్మ కరివేపాకు
  • ఉప్పు రుచికి తగినంత
  • నిమ్మకాయ
  • కొత్తిమీర

రాగి ఉప్మా తయారీ విధానం

  1. ముందుగా రాగి రవ్వను కడిగి కొన్ని నిమిషాలు నానబెట్టండి. అనంతరం నీటిని పూర్తిగా తీసేసి, పక్కన పెట్టండి.
  2. బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేయండి. ఆ తర్వాత శనగపప్పు, మినపపప్పు, వేరుశనగలు వేసి రంగు మారే వరకు వేయించాలి.
  3. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం, ఇంగువ, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
  4. అనంతరం రాగి రవ్వను వేసి 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి.
  5. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, నీరు వేసి బాగా కలపండి, మరిగించండి. మూతపెట్టి తక్కువ నుండి మీడియం మంట మీద ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి.
  6. చివరగా కొత్తిమీర, నిమ్మరసం చల్లుకోవాలి.

అంతే, రాగి ఉప్మా రెడీ.. వేడివేడిగా ఆరగించండి.

WhatsApp channel

సంబంధిత కథనం