ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే రాగి అట్టు చేసుకొని తినండి. మీరు చాలా సార్లు రాగి సంకటి తినే ఉంటారు. రాగి సంకటి ఎంత ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన ఆహారమో మీకు తెలిసిందే. అదే రాగి పిండితో మీరు ఉదయం పూట రాగి అట్టును చేసుకొని అల్పాహారంగా తింటే, మీరు మీ రోజును శక్తివంతంగా ప్రారంభించవచ్చు.,రాగుల పిండి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది, డయాబెటిక్ రోగులకు ఇది అద్భుతమైన అల్పాహారం. రాగిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌తో విసుగు చెంది, ఉంటే రుచికరమైన రాగి అట్టును తిని చూడండి, దీనిని పిల్లల టిఫిన్ బాక్స్‌లో కూడా ప్యాక్ చేయవచ్చు. రాగి అట్టును ఎలా చేయాలో ఈ కింద రెసిపీ ఉంది, ఇక్కడ ఇచ్చిన సూచనలు అనుసరించి సులభంగా చేసుకోవచ్చు.,Ragi Attu Recipe కోసం కావలసినవి1 కప్పు రాగుల పిండి1 క్యాప్సికమ్1 కప్పు క్యారెట్ తురుము2 పచ్చిమిర్చి1 టమోటో1 ఉల్లిపాయ1/2 tsp చాట్ మసాలా2-3 టేబుల్ స్పూన్లు కొత్తిమీరనూనె - అట్టుకు కావలసినంతఉప్పు - రుచికి తగినంతరాగి అట్టు తయారీ విధానంముందుగా ఒక మిక్సింగ్ గిన్నెలో రాగి పిండి తీసుకోండి, అందులో ఉల్లిపాయలు ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, పచ్చి మిరపకాయలు, క్యారెట్ ముక్కలను వేసి కలపండి.ఆపైన రుచికి తగినట్లుగా చాట్ మసాలా, ఉప్పు కలపండి. అనంతరం గిన్నెలో నీళ్లు పోసి, అట్లు చేసుకునే విధంగా పిండిని రూపొందించండి.ఇప్పుడు మీడియం మంట మీద నాన్‌స్టిక్ పాన్ వేడి చేయండి. తవా వేడిగా ఉన్నప్పుడు, కొద్దిగా నూనె వేసి చుట్టూ విస్తరించండి. ఆపైన అట్టు వేసుకొండి.పైనుంచి ఏవైనా కూరగాయ ముక్కలు చల్లు కోవచ్చు. అట్టును కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చండి.అంతే, రాగి అట్టు సిద్ధమయినట్లే. గ్రీన్ చట్నీ లేదా టొమాటో చట్నీతో ఆరగించండి.,