Hydrating Yoga | ఈ యోగాసనాలు వేస్తే మీకు అసలు డీహైడ్రేషన్ సమస్యే ఉండదు!
Hydrating Yoga: డీహైడ్రేషన్ ను నివారించే యోగా ఆసనాలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ ఎండాకాలంలో తలెత్తే అనారోగ్య సమస్యలను నివారించడానికి నిపుణులు వెల్లడించిన యోగాసనాలు (Yoga Poses), ఆరోగ్య చిట్కాల (Health Tips) గురించి ఇక్కడ తెలుసుకోండి.
Summer Yoga: ప్రతి సీజన్‌లో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశం ఒకటి ఉంటుంది, ఆ సీజన్‌కు తగినట్లుగా జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగితే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం వేసవికాలం కొనసాగుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఎండ వేడి శరీరంలోని శక్తిని, సత్తువను ఆవిరయ్యేలా చేస్తాయి. అదనంగా ఆకలి మందగించడం, ఆహారం రుచించకపోవడం వలన సరైన పోషకాలు శరీరానికి అందవు. ఈ వేసవిలో శరీరం కూడా త్వరగా నిర్జలీకరణం (Dehydration) కు గురవుతుంది. ఎండిన గొంతులు, పొడిబారిన చర్మం ఇతర సమస్యలను కలిగిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమూ అవసరమే. ఎండాకాలంలో వ్యాయామం అంటే అది ఒక అగ్ని పరీక్షే అయినప్పటికీ శరీరాన్ని చల్లబరిచే వ్యాయామాలు (Cooldown Exercises) ఉన్నాయి. డీహైడ్రేషన్ ను నివారించే యోగా ఆసనాలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ ఎండాకాలంలో తలెత్తే అనారోగ్య సమస్యలను నివారించడానికి నిపుణులు వెల్లడించిన యోగాసనాలు (Yoga Poses), ఆరోగ్య చిట్కాల ( Summer Health Tips) గురించి ఇక్కడ తెలుసుకోండి.
Water Balloon Pose- వాటర్ బెలూన్ భంగిమ
ఇది ముఖ యోగాలో (Fac Yoga) ఒక భాగం. మీ నోటిని గాలితో నింపండి, ఆపై నోరు ముయ్యండి. ఇలా బెలూన్‌లా ఉబ్బిన మీ బుగ్గలను 10 సెకన్లపాటు బిగపట్టి పట్టుకోండి. అనంతరం నెమ్మదిగా ఆ గాలిని వదలండి. ఈ అభ్యాసాన్ని మూడు సార్లు రిపీట్ చేయండి.
ప్రయోజనాలు
- ఇది రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది.
- మీ ముఖ కండరాలను బలపరుస్తుంది.
- మీ చర్మం, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
Water Air Puff Pose- వాటర్ ఎయిర్ పఫ్ పోజ్
మీ నోటిని కొన్ని నీళ్లతో నింపండి, ఆ నీటిని అలాగే నోట్లో ఉంచుకొని నోరు మూయండి, ఆపై నీటిలో మీ నోట్లోనే కుడి చెంపవైపుకు మళ్లించండి. ఒక 10 సెకన్ల పాటు అక్కడే ఉంచండి, ఆ తర్వాత ఆ నీటిని ఎడమ చెంపవైపు మళ్లించండి. అక్కడ ఒక 10 సెకన్లు ఉంచండి. ఈ అభ్యాసాన్ని మూడు సార్లు రిపీట్ చేయండి.
లాభాలు
- ఇలా చేయడం వలన మీ చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొటిమలు లేని మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.
- శరీరానికి హైడ్రేషన్‌ను అందిస్తుంది, డీహైడ్రేషన్ ను నివారిస్తుంది.
Wind-relieving Pose- పవనముక్తాసనం
వెల్లకిలా పడుకుని, కాళ్ళపై పైకి ఎత్తండి. ఆపైన మీ మోకాళ్లను వంచి వాటిని మీ చేతులతో పట్టుకోండి. అనంతరం మీ మోకాళ్లను మీ నుదుటికి తాకేలా మీ కాళ్లు, తలను వంచుతూ ఒక దగ్గరకు చేర్చండి. మీ మోకాళ్లు మీ నుదురుకు తాకాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉండి, దీనినే 3 సార్లు పునరావృతం చేయండి.
లాభాలు
- మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారించే అద్భుతమైన యోగా భంగిమ ఇది. ఇది శరీరంలో నిండిన గ్యాస్ ను తొలగించడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
- దీర్ఘకాలిక మలబద్ధకంను పరిష్కరించడం , కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది.
ఈ వేసవిలో ఇలాంటి అద్భుతమైన వ్యాయామాలు చేస్తూ, తాజా పండ్లు, కూరగాయలు తింటూ, ఎండాకాలంలో పాటించాల్సిన సాధారణ సంరక్షణ చర్యలను తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని, శ్రేయస్సును కాపాడుకోండి.
సంబంధిత కథనం