Hot Summer Hangover । వేసవిలో హ్యాంగోవర్ నుంచి బయటపడే మార్గాలు, ఉపశమనం కలిగించే చిట్కాలు!
Hot Summer Hangover: వేసవిలో మద్యం సేవించడం మరింత హానికరం. హ్యాంగోవర్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. మీరు పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి చూడండి.
Hot Summer Hangover: మద్యం సేవిస్తున్నపుడు ఎంత మత్తుగా, గమ్మత్తుగా అనిపిస్తుందో, తాగింది దిగిన తర్వాత సంభవించే హ్యాంగోవర్ అంత వికారంగా, భయంకరంగా ఉంటుంది. హ్యాంగోవర్ అనేది ఒక రాత్రి సేవించిన ఆల్కాహాల్ సంబంధిత సైడ్ ఎఫెక్ట్. దీని వలన తీవ్రమైన తలపోటు, కళ్ళు భారంగా అనిపించడం, వికారం, అలసట, బలహీనత మొదలైన లక్షణాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఆ మరుసటి రోజు పనిచేయడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది.
అల్కాహాల్ (Alcohol) కారణంగా శరీరం డీహైడ్రేషన్ (Dehydration)కు గురవుతుంది. ఈ వేసవి కాలంలో ఎండ వేడికి సాధారణంగానే చాలామంది డీహైడ్రేషన్ లక్షణాలు ఎదుర్కొంటారు. ఇదే సమయంలో మద్యం సేవించడం వలన మరిన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి ఎండాకాలంలో మద్యపానానికి దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. ప్రస్తుతానికి హ్యాంగోవర్‌ను తగ్గించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు చూడండి.
Ways To Avoid Hangover- Relief Tips- హ్యాంగోవర్ నుంచి బయటపడే మార్గాలు
హ్యాంగోవర్ ప్రభావాలు తక్కువగా ఉండాలంటే, లక్షణాల నుంచి వేగంగా కోలుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.
నీరు పుష్కలంగా త్రాగాలి
హ్యాంగోవర్‌లకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. శరీరంలో నీటిశాతం, ఇతర ద్రవాలు తగ్గినపుడు సంభవిస్తుంది. అంతేకాకుండా ఆల్కహాల్ ఒక మూత్రవిసర్జక కారకం కాబట్టి, ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీనిని నివారించడానికి, మీరు ఆల్కహాల్ తాగే ముందు, తాగేటపుడు, ఆ తర్వాత కూడా పుష్కలంగా నీరు త్రాగాలని గుర్తుంచుకోండి. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది, హ్యాంగోవర్ లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది.
త్రాగే ముందు తినండి
ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆల్కహాల్ వేగంగా శరీరంలోకి శోషణ జరుగుతుంది, తద్వారా మీరు హ్యాంగోవర్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మద్యం సేవించే ముందు తప్పకుండా కొంత ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రోటీన్ , ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వలన ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తుంది, హ్యాంగోవర్ లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది.
నెమ్మదిగా సేవించాలి
మద్యాన్ని ఒకేసారిగా, వేగంగా తాగడం వలన హ్యాంగోవర్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. మద్యం ఎల్లప్పుడూ నెమ్మదిగా తాగాలని గుర్తుంచుకోండి. మద్యం తాగాలని అనిపించినపుడు ఆల్కహాల్ రహిత పానీయాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడం గురించి పరిగణించండి. ఇలా మీరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి , మీ శరీరంపై ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
తగినంత నిద్రపోండి
ఆల్కహాల్ మీ నిద్ర విధానాలను భంగం కలిగిస్తుంది, ఇది అలసటకు దారితీస్తుంది, హ్యాంగోవర్ లక్షణాలను పెంచుతుంది. తగినంత నిద్ర పోవడం వలన హ్యాంగోవర్ లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది. రాత్రి తాగిన తర్వాత కనీసం 7-8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. మీ శరీరం ఆల్కహాల్ ప్రభావాల నుండి కోలుకోవడానికి కనీసం 48 గంటల సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు.
లేత రంగు పానీయాలు ఎంచుకోవాలి
రెడ్ వైన్, విస్కీ వంటి ముదురు రంగు పానీయాలు ఎక్కువ రసాయనాల కంజెనర్‌లను కలిగి ఉంటాయి. ఇవి హ్యాంగోవర్ లక్షణాలకు దోహదం చేస్తాయి. వోడ్కా లేదా వైట్ వైన్ వంటి లేత-రంగు పానీయాలను ఎంచుకోవడం వలన హ్యాంగోవర్ లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. ఏకధాటిగా మద్యం సేవించకుండా మధ్యమధ్యలో విరామాలు తీసుకుంటుండాలి. సోడా వంటి పానీయాలు కలపకూడదు. నీటిని కలపడం మేలు. ఎక్కువ డిస్టిల్డ్ చేసిన ఖరీదైన పానీయాలు సేవించడం వలన హ్యాంగోవర్ ప్రభావాలు తక్కువ ఉంటాయి.
సంబంధిత కథనం