వీకెండ్‌లో విందులు, వినోదాలలో పాల్గొని రాత్రి అతిగా అల్కాహాల్ సేవించినపుడు, ఇక ఆ తర్వాత రోజు పరిస్థితి మామూలుగా ఉండదు. హ్యాంగోవర్ భయంకరంగా ఉంటుంది, అదే సమయంలో విశ్రాంతి తీసుకోడానికి సమయం కూడా ఉండదు, మళ్లీ ఎవరి పనులకు వారు తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఇలాంటి సందర్భంలో మళ్లీ పూర్వ స్థితికి రావడానికి, మీ కడుపులో ఉన్న హ్యాంగోవర్ మృగాన్ని శాంతపరచడానికి తినే ఆహారం సరైనది ఆయి ఉండాలని నిపుణులు అంటున్నారు.
మీరు హ్యాంగోవర్‌లో ఉన్నప్పుడు ఆహారం చాలా సరళంగా ఉండాలి. మార్నింగ్ జ్యూస్‌ని స్కిప్ చేయండి, ఎందుకంటే ఉదయం పండ్ల రసాలు తీసుకుంటే అది ఆమ్లంగా ఉంటుంది. అది హ్యాంగోవర్‌కు మరింత ఇబ్బంది కలిగిస్తుంది. ఒక కప్పు కాఫీ లేదా అల్లం టీ తాగవచ్చు, ఇది మీ తలనొప్పిని మరింత దిగజారకుండా ఉపశమనం కలిగిస్తుంది.
హ్యాంగోవర్‌లో ఉన్నప్పుడు బలహీనంగా అనిపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిల హెచ్చుతగ్గులను నిరోధించడానికి పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు కలిగిన సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరం కోల్పోయిన పోషకాలు, ఎలక్ట్రోలైట్‌లు, B-విటమిన్‌లను తిరిగి తీసుకోవాలి. పోటాషియం ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా హ్యాంగోవర్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
పూర్తి గోధుమ టోస్ట్‌తో రెండు గుడ్లు, అవకాడో లేదా కూరగాయలతో చేసిన ఆమ్లెట్ లేదా బాదం వెన్నతో హోల్ వీట్ టోస్ట్, ఒక అరటిపండు వంటివి తీసుకోవచ్చు. మిమ్మల్ని హ్యాంగోవర్ నుంచి బయటపడేసే ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఇక్కడ తెలుసుకోండి.
రాత్రి ఎక్కువ మద్యపానం చేసిన తర్వాత, మీ శరీరం చాలా నిర్జలీకరణానికి గురవుతుంది, కావున రీహైడ్రేషన్ కోసం ఎక్కువ నీరు త్రాగాలి. నిమ్మకాయ నీరు, ఎలక్ట్రోలైట్‌లు ఉండే కొబ్బరి నీళ్లను తాగవచ్చు. మీకు వికారం ఉంటే, మీ కడుపుని శాంతపరచడానికి అల్లం మిఠాయి లేదా అల్లం టీ ప్రయత్నించండి.
సంబంధిత కథనం