Neem and Ginger Tea Recipe : సీజన్ ఏదైనా రోగనిరోధక శక్తి మాత్రం ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న పిల్లలనుంచి పెద్దల వరకు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడతారు కాబట్టి.. వారికి ఈ టీ ఇచ్చేయండి. అదేంటి టీ ఇవ్వండి అంటున్నారు అనుకున్నారా? అది నిజంగా టీ కాదులేండి. రోగనిరోధకశక్తిని పెంచే.. ఆయుర్వేద సుగుణాలు కలిగిన టీ. దీనిని షుగర్ ఉన్నా.. పిల్లలైనా.. పెద్దలైనా.. ఎవరైనా తాగవచ్చు. అదే వేపతో తయారు చేసిన అల్లం టీ. మరి దానిని ఎలా తయారు చేయాలి కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు చుద్దాం.
* నీరు - 1 కప్పు
* వేపాకులు - 3-4
* నిమ్మరసం - అర టీస్పూన్
* అల్లం - 1 టేబుల్ స్పూన్ (తరిగినది)
* తేనే - రుచికి తగినంత
ముందు గిన్నే తీసుకుని దానిలో నీరు, వేపాకులు (కడిగినవి), అల్లం వేసి స్టవ్ మీద పెట్టి 2 నుంచి 3 నిముషాలు ఉడకబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి.. ఓ కప్పులో వడపోసి.. నిమ్మరసం, తేనే వేసి బాగా కలపండి. దీనిని ఉదయాన్నే వేడి వేడిగా తాగితే.. ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా.. వేప, నిమ్మ, అల్లంలోని గుణాలు.. మీకు రోగనిరోధకశక్తిని పెంచి.. మిమ్మల్ని సీజనల్ డీసీస్నుంచి కాపాడుతాయి.
సంబంధిత కథనం