Brahmamudi November 23th Episode: కావ్య పుట్టింటికి వెళ్లిపోయిన అపర్ణ- రాజ్‌కు శాపం- ఇంటిల్లిపాది ఆమరణ నిరాహార దీక్ష
Brahmamudi Serial November 23th Episode: బ్రహ్మముడి నవంబర్ 23 ఎపిసోడ్‌లో రాజ్ చేసిన మోసంతో దుగ్గిరాల ఇంటిల్లిపాది భోజనం తినకుండా ఉంటారు. దాంతో వారంతా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు రుద్రాణి చెబుతుంది. ఎంత చెప్పిన రాజ్ వినకపోయేసరికి కావ్య పుట్టింటికి కట్టుబట్టలతో వెళ్లిపోతుంది అపర్ణ.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్యను మోసం చేసి గెలిచి సీఈఓ పదవిని చేజిక్కించుకోవడంపై రాజ్ అంతరాత్మ గొడవపడుతుంది. రాజ్ మాత్రం కవర్ చేసుకుంటూ ఉంటాడు. భార్య పోయిందన్న బాధ కొంచెం కూడా లేదారా నీకు.పెళ్లాన్ని మోసం చేసిన మొగుడు బాగుపడినట్లు చరిత్రలో లేదు. జీవితాంతం నువ్ సింగిల్‌గా ఇలాగే మిగిలిపోతావ్. ఇదే నా శాపం అని రాజ్ అంతరాత్మ మాయమైపోతాడు.
ఇందిరాదేవి ఫైర్
ఎల్లెల్లెవో ప్రపంచంలో సింగిల్‌గా బతకడం కంటే ప్రశాంతమైన జీవితం ఇంకోటి ఉండదు. శాపం అంటా తొక్కలో శాపం. సోలోగా ఉండటం అంటే స్వర్గంలో ఉన్నట్లు అని రాజ్ అనుకుంటాడు. తర్వాత ఇంట్లో ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్ తప్ప ఎవరు భోజనం చేయరు. అక్కడికి రాజ్ వస్తాడు. నేను వచ్చాను కదా అందరికి భోజనం వడ్డించమని శాంతను అంటాడు రాజ్. దాంతో రాజ్‌పై ఇందిరాదేవి, అపర్ణ, సీతారామయ్య ఫైర్ అవుతూ సెటైర్లు వేస్తారు.
ఓహో ఇప్పుడు అందరు కలిసి నాపై యుద్ధం ప్రకటిస్తున్నారా అని రాజ్ అంటే.. వాళ్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని రుద్రాణి అంటుంది. రేపటి నుంచి సహాయినిరాకరణ కూడా చేస్తారా అని రాజ్ అంటాడు. ఇదంతా నువ్ కావ్యను తీసుకురానందుకు కక్షసాధింపు చర్య నాన్న అని రుద్రాణి అంటుంది. ఒకరు తిని ఒకరు తినకపోతే ఎలా. నాకు ఆకలి వేస్తుంది. రండి తిందాం అని రాజ్ అంటాడు. కడుపు మాడ్చుకుంటే మూర్ఖులు మారుతారని రుద్రాణి లాంటి మూర్ఖులు కూడా అనుకోరు అని అపర్ణ పంచ్ వేస్తుంది.
ఉదయం నుంచి కావ్యకు నువ్ చేసిన అన్యాయం తలుచుకుంటే కడుపు మండిపోతుంది. మర్యాదగా కావ్యను కాపురానికి తీసుకొస్తావా లేదా అని అపర్ణ అంటుంది. కావ్య కోసం ఇంతలా అంటున్నారు. ధాన్యలక్ష్మీ వేరే కుంపటి పెట్టాలనుకుంది. మరి దాని గురించి ఆలోచించారా. మీదాకా వస్తే కష్టమా అని ఎగేస్తుంది రుద్రాణి. కొడుకు కాపురం కూలిపోయిన సరే కోడలు రాకూడదని ధాన్యలక్ష్మీ అనుకుంది. అందుకే తనకు తోచిన పనికిమాలిన పని మొదలుపెట్టింది. నేను నా కొడుకు కాపురం బాగుండాలని కోరుకుంటున్నాను అని అపర్ణ అంటుంది.
ధాన్యలక్ష్మీ మొండితనం
ధాన్యలక్ష్మీ ఎంత మొండిగా ఉన్న తన కొడుకు మాత్రం తన భార్యవైపే నిలబడ్డాడు. అలాగే, ధాన్యలక్ష్మీలోని మూర్ఖత్వం, మొండితనం నా కొడుకులో కనిపిస్తున్నాయి. కాబట్టి నేను నా కోడలివైపు నిలబడ్డాను అని అపర్ణ అంటుంది. కరివేపాకులు, కొత్తిమీర కట్టల గురించి మాట్లాడటం అనవసరం. కావ్యను తీసుకొస్తావా లేదా అని రాజ్‌ను నిలదీస్తుంది ఇందిరాదేవి. ఇంతకుముందే చెప్పాను. నేను తీసుకురాను. కానీ, మీరు తిన్నాకే తింటాను. అంతవరకు మీతోపాటు నేను కూడా నిరాహార దీక్ష చేస్తాను అని రాజ్ వెళ్లిపోతాడు.
విన్నారు కదా వాడు మారడు. కావ్యను తీసుకురాడు అని రుద్రాణి అంటే స్వప్న పంచ్‌లు వేస్తుంది. నిన్ను ఇంకా ఇంట్లో ఎందుకు భరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని స్వప్న అంటుంది. ఇప్పుడు వాళ్లిద్దరిని ఎలా కలపాలో అర్థం కావట్లేదని ఇందిరాదేవి అంటుంది. నువ్వేమో కావ్య వాళ్లకు మాటిచ్చావ్. ఇప్పుడు ఏం చేద్దాం. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేద్దాం అని సుభాష్ అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అపర్ణను చూశావా అని సుభాష్ అందరిని అడుగుతాడు.
ఇంట్లోనే లేదని ఇందిరాదేవితో అంటాడు సుభాష్. ఎందుకు టెన్షన్. ఏదైనా గుడికి వెళ్లుంటుంది, లేదా ఏదైనా పనిమీద వెళ్లి ఉంటుంది. ఫోన్ చేస్తే తెలిసిపోతుంది అని రాజ్ అంటే.. ఆ విషయం మాకు తెలియదా. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుందని సుభాష్ అంటాడు. నాకు తెలిసి రాజ్ మీద అలిగి అపర్ణ ఆంటీ ఎటైనా వెళ్లిపోయి ఉంటారు అని స్వప్న అంటుంది. కొడుకే తల్లి మాటలు లెక్కచేయకుండా బాధపెడేలా మాట్లాడితే ఏ తల్లి మాత్రం ఇంట్లో ఉంటుందని ధాన్యలక్ష్మీ అంటుంది.
సుభాష్ కంగారు
ముందు అక్క ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోండి. అసలే అక్క మనసు చాలా సున్నితమైనది. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమిటో అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇదొక్కతి ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుందో అర్థమై చావదు. వదిన ఇంట్లోంచి వెళ్లిపోయింది అనగానే కొడుకు విషయం పక్కనపెట్టేసి ఆవిడగారి గురించి బాధపడుతుంది అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ధాన్యలక్ష్మీ మాటలకు సుభాష్ కంగారుపడతాడు. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇద్దామని ప్రకాశం అంటాడు.
అలా చేస్తే రాజ్‌కే ప్రాబ్లమ్. తనవల్లే వెళ్లిపోయంది కదా అని స్వప్న అంటుంది. ముందు కావ్యను ఇంట్లోంచి తరిమేశావ్. ఇప్పుడు తల్లిని ఆ తర్వాత అని ఇందిరాదేవి అంటే.. ఇక మిగిలింది మనమే కదా చిట్టీ. ఏదో ఒకరోజు మనల్ని కూడా తరిమేస్తాడు అని సీతారామయ్య అంటాడు. కంగారుపడుతుంటే అలా అంటారేంటీ అని రాజ్ అంటాడు. ఇంతలో శాంత కంగారుగా ఓ లెటర్ తీసుకొస్తుంది. అమ్మగారి గదిలో దొరికిందని అంటుంది.
లెటర్ రాసిపెట్టి పోయిందంటే పర్మినెంట్‌గానే వెళ్లిపోయింటుంది. ఎక్కడికి వెళ్లిందో ఏమో అని రుద్రాణి అంటుంది. కట్ చేస్తే మరోవైపు కావ్య పుట్టింటికి అపర్ణ లగేజ్‌తో వెళ్తుంది. అది చూసి కనకం వాళ్లు టెన్షన్ పడతారు. మా కావ్య చీరలా అని కనకం అంటే.. కాదు నా చీరలు. ఆ ఇంట్లో ఉండనని లెటర్ రాసిపెట్టి వచ్చేశాను అని అపర్ణ అంటుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. వాడు నువ్ అక్కర్లేదని చెప్పాడు. నాకు ఆ ఇల్లే అక్కర్లేదని చెప్పి వచ్చాను అని అపర్ణ అంటుంది.
నీవల్లే ఈ గతి పట్టింది
తర్వాత ఇంట్లోకి అంతా వెళ్తారు. నా మనసేం బాగాలేదు. కావ్యను కాపురానికి తీసుకొస్తావా అని అడిగితే వాడు వినలేదు. అందుకే వాడికి బుద్ధొచ్చి దిగొచ్చి మీ ఇంటికి వచ్చి కావ్యను తీసుకెళ్తానని అనేదాకా ఓ బాంబ్ పడేసి వచ్చాను అని అపర్ణ అంటుంది. మీరు ఇలా చేసి తప్పు చేశారు అత్తయ్య అని కావ్య అంటుంది. ఏంటీ అని అపర్ణ అంటే క్షమించాలి అత్తయ్య. కొడుకు మీద అలిగి గడపదాటడం మర్యాద కాదు అని కావ్య అంటుంది. అప్పుడు నువ్వెందుకు దాటావమ్మా. నువ్ నాకు నీతులు చెబుతున్నావా. నువ్ అక్కడే ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు కదా అని అపర్ణ తిరిగి ప్రశ్నిస్తుంది.
అత్తయ్య మహారాణి. సాధారాణ జీవితం గడపాల్సి వస్తుంది. ఆయన్ను బలవంతంగా తీసుకెళ్లేలా చేస్తున్నారు. దానివల్ల లాభం ఏంటీ. తీసుకెళ్లిన నాతో కాపురం చేస్తారా అని కావ్య అంటుంది. వాడి గురించి నాకు తెలుసు. వాడిలో ఉన్న అహం తగ్గితే తప్పా వాడి మనసులో ఉన్న ప్రేమ బయటకు రాదు. నువ్ పిచ్చిపిచ్చిగా ఆలోచించడం మానేసి నేను చెప్పింది చెయ్ అని అపర్ణ అంటుంది. కావ్య ఏదో చెప్పబోతుంటే కనకం వారిస్తుంది.
చిన్నపిల్లలా అలిగి వస్తారా. నేను ఏం అడగకూడదా. కానీ, నేను మాత్రం ఏ నాటకం ఆడదు. క్యాన్సర్ కనకం గుర్తుపెట్టుకో అని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు నాకు తెలిసి వదినకి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి పుట్టింటికి వెళ్లదు. ఏ అనాథశరణాలయానికి వెళ్లి ఉంటుందని రుద్రాణి అంటుంది. ముందు లెటర్ చదవని ధాన్యలక్ష్మీ అంటుంది.
సుభాష్‌దే తప్పు
అందులో ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. సుభాష్ మీద కోపంగా వెళ్తున్నాను. మీ పెంపకంలోనే తప్పుంది. అందుకే రాజ్ అలా ఉన్నాడు. మీ గారాబం వల్లే అలా అయ్యాడు. దానివల్లే కోడలిని పంపించేశాడు. నేను చెప్పిన వినట్లేదు. అప్పుడు ఆ ఇంటి పెద్దగా.. వాడికి తల్లిగా ఉండి లాభం లేదు. అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతున్నాను. దయచేసి నాకోసం ఎవరు వెతక్కండి. వాడు చేసిన తప్పు తెలుసుకుని కావ్యను ఇంటికి తీసుకొచ్చినప్పుడే నేను వస్తాను. ఇట్లు చేతకాని దుగ్గిరాల ఇంటి కోడలు అని రాసి ఉంటుంది.
దాంతో అంతా రాజ్‌ను నిందిస్తారు. మా మమ్మీ నా వల్లే వెళ్లిపోయిందని ఒప్పుకుంటాను. కానీ, నేను తప్పు చేసినందుకు వెళ్లలేదు. తన కోడలిని ఉద్దరించడానికి వెళ్లిందని రాజ్ అంటే.. నాకు నా భార్య కావాలని సుభాష్ అంటాడు. తను ఎక్కడికి వెళ్లిందో నాకు అర్థమైందని రాజ్ అంటే ఎక్కడికి అని స్వప్న అంటుంది. మీ ఇంట్లోనే. నమ్మకం లేకపోతే మీ అమ్మకు ఫోన్ చేసి అడుగు అని రాజ్ అంటాడు. స్వప్న కాల్ చేస్తే అపర్ణతో కనకం చెబుతుంది. తనచేత నా కొడుకే చేయిస్తున్నాడు. ఇక్కడే ఉన్నాను అని ధైర్యంగా చెప్పు అని అపర్ణ అంటుంది.
స్వప్న కాల్ చేసి అడిగితే అపర్ణ వచ్చినట్లు చెబుతుంది కనకం. తర్వాత రాజ్ మాట్లాడుతాను అంటే అపర్ణ మాట్లాడదు. అదే విషయం కనకం చెబితే ఏంటీ కొత్త నాటకమా. తల్లీకొడుకులను విడదీయాలని అనుకుంటున్నారా. మీ మాటలతో మా అమ్మను మాయచేయొచ్చు కానీ, నేను పడను. మర్యాదగా మా అమ్మకు ఇవ్వమని రాజ్ అంటాడు. మాయ మాటలు నమ్మడానికి ఇక్కడ చిన్న పిల్లలు లేరు. నాకు మాట్లాడాలని లేదని చెప్పు కనకం అని అపర్ణ అంటుంది.
ఇక్కడికి వచ్చి మాట్లాడు
ఇందులో నా పాత్ర లేదని కనకం అంటుంది. వాడికి భయపడాతేవేంటీ. కాల్ కట్ చేయు అని అపర్ణ అంటుంది. సరే నువ్ ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు చెప్పు. నేను వింటాను అని రాజ్ అంటాడు. నాతో ఎవరు మాట్లాడలన్న ఇక్కడికి వచ్చి మాట్లాడమను. ఇలా ఫోన్‌లో మాట్లాడాల్సిన అవసరం లేదని అపర్ణ అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్