తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ ల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఇవాళ్టితో(నవంబర్ 23) పూర్తి కానుంది. మొత్తం 33 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. క్లర్క్ పోస్టులకు 3 లేదా 5 సంవత్సరాల లా డిగ్రీని కలిగిన అభ్యర్థులు అర్హులవుతారు.
తెలంగాణహైకోర్టులో పనిచేసేందుకు 31 లా క్లర్క్‌లు, సికింద్రాబాద్ లోని స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో పనిచేసేందుకు 2 లా క్లర్క్‌ల పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవత్సరం వ్యవధికి భర్తీ చేస్తారు.
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ 19) మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 24న జరగాల్సిన ఈ పరీక్ష,… డిసెంబర్ 1కి వాయిదా వేశారు. అయితే ఈ తేదీని కూడా బీఐసీ మార్చింది. డిసెంబర్ 22వ తేదీన ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది.
డిసెంబర్ 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా పరీక్ష జరగనుంది. తెలంగాణలో హైదరాబాద్ సెంటర్ గా ఉంది. ఏపీలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా ఉన్నాయి.
ఆలిండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. సిలబస్ ప్రకారం AIBE 19లో 19 అంశాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మూడు గంటల సమయం ఉంటుంది.
సంబంధిత కథనం