TTD Recruitment 2024 : టీటీడీలో ఉద్యోగాలు... నవంబర్ 25న వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు-ttd recruitment 2024 walk in interview for civil assistant surgeon vacancies on 25th november ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Recruitment 2024 : టీటీడీలో ఉద్యోగాలు... నవంబర్ 25న వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు

TTD Recruitment 2024 : టీటీడీలో ఉద్యోగాలు... నవంబర్ 25న వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 23, 2024 07:41 AM IST

TTD Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలను నవంబర్ 25వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది.

సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుకు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు
సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుకు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు

తిరుమ‌ల‌లోని టీటీడీ ఆసుప‌త్రుల్లో సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రకటన జారీ కాగా… తాజాగా టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవ‌త్స‌ర‌ కాలపరిమితితో వీటిని రిక్రూట్ చేయనున్నారు.

ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. అయితే న‌వంబ‌ర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుప‌తిలోని టీటీడీ సెంట్ర‌ల్‌ ఆసుపత్రిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందని టీటీడీ తాజా ప్రకటనలో పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరింది. ఇతర వివరాల కోసం టీటీడీ వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించింది.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు త‌మ విద్యార్హతలు, అనుభ‌వానికి సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌ ఒరిజినల్ , జిరాక్స్ ‌ కాపీలతో ఇంట‌ర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ లేదా కార్యాలయ పని వేళల్లో 0877-2264371 సంప్రదించవచ్చని వెల్లడించింది.

టికెట్ల సంఖ్య పెంపు:

రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 100 నుండి 200 కు పెంచింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన జారీ చేసింది.

ఈ మేరకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు. అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుండి 800 కు తగ్గించడం జరిగింది. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.

మరోవైపు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ను టీటీడీ ఈవో జె.శ్యామలరావు శుక్రవారం ప్రారంభించారు. పీఏసీ-3లో లాకర్ కేటాయింపునకు మూడు కౌంటర్ లను ఏర్పాటు చేశారు. భ‌క్తులు గంద‌ర‌గోళానికి గురికాకుండా ఇక‌పై ఒకే చోట లాక‌ర్ల‌ను కేటాయిస్తారు. ఇక్కడ భక్తుల కోసం 1420 లాకర్లు అందుబాటులో ఉంటాయి. గదులు దొరకని భక్తులు అసౌకర్యం కలగకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

తిరుమ‌ల‌లో నిర్మాణంలో ఉన్న పీఏసీ-5 భ‌వ‌నాన్ని ఈవో ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ భ‌వ‌నంలో భ‌క్తులకు అన్ని ర‌కాల మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేయాల‌న్నారు. అనంత‌రం త‌రిగొండ వెంగ‌మాంబ అన్న ప్ర‌సాద కేంద్రానికి చేరుకుని డోనార్ సెల్ ను ప‌రిశీలించారు. భ‌క్తులు విరాళం ఇచ్చేందుకు నూత‌నంగా ప్రారంభించిన కియోస్క్ మిష‌న్ త‌నిఖీ చేసి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

Whats_app_banner