Hangover Remedies | దావత్ దబిడి దిబిడి నుంచి ఉపశమనం ఇలా..-try these home remedies to beat hangover ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hangover Remedies | దావత్ దబిడి దిబిడి నుంచి ఉపశమనం ఇలా..

Hangover Remedies | దావత్ దబిడి దిబిడి నుంచి ఉపశమనం ఇలా..

Manda Vikas HT Telugu
Mar 08, 2022 12:37 PM IST

హ్యాంగోవర్ ఉన్నపుడు వికారం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన దాహం సాధారణంగా ఉంటాయి. ఏదైనా కాంతిని చూసినపుడు, శబ్దాలను వింటే చికాకు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఈ హ్యాంగోవర్ వదిలించుకోవాలంటే ఏం చేయాలి? దీని నుంచి బయటపడేసే కొన్ని హోం రెమిడీస్ అందిస్తున్నాం. ఇవి ప్రయత్నిస్తే పరిస్థితి కొంచెం బెటర్ అనిపిస్తుంది.

<p>Hangover Symptoms</p>
Hangover Symptoms (Shutterstock)

పార్టీ చేసుకోవడానికి ఇష్టపడనిది ఎవరు? వీకెండ్ వస్తే పార్టీ, హాలిడే దొరికితే పార్టీ, న్యూఇయర్ పార్టీ, బర్త్ డే పార్టీ లేదా ఇంకా ఏ డే అయినా పార్టీ చేసుకోవాల్సిందే. ఆ పార్టీలో కామన్ ఫేవరెట్ ఫ్రెండ్ అయిన మద్యం ఉండాల్సిందే. అసలు ఈ మధ్య 'దారూ' గారు లేకుండా ఏదైనా దావత్ జరిగుతుందా? జరిగితే అది దావత్ అనిపించుకుంటుందా? మన పరువు, ప్రతిష్ఠ ఏం కావాలి? అన్న రీతిలో తయారైంది సమాజం. సరే తాగినంతసేపు బాగానే ఉంటుంది. కానీ రాత్రి నెత్తికెక్కిన మన లిక్కర్ ఫ్రెండ్ పొద్దునయినా కూడా దిగడు. అప్పుడు మనకు తల బద్దలైనట్లు తిక్కతిక్కగా అనిపిస్తుంది. దీనినే హ్యాంగోవర్ అంటారు.

yearly horoscope entry point

హ్యాంగోవర్ లక్షణాలు..

హ్యాంగోవర్ ఉన్నపుడు వికారం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన దాహం సాధారణంగా ఉంటాయి. ఏదైనా కాంతిని చూసినపుడు, శబ్దాలను వింటే చికాకు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

మరి ఈ హ్యాంగోవర్ వదిలించుకోవాలంటే ఏం చేయాలి? దీని నుంచి బయటపడేసే కొన్ని హోం రెమిడీస్ అందిస్తున్నాం. ఇవి ప్రయత్నిస్తే పరిస్థితి కొంచెం బెటర్ అనిపిస్తుంది.

అల్లం ఛాయ్

అల్లం వికారం నిరోధక ఔషధంగా పనిచేస్తుంది. హ్యాంగోవర్ అనిపిస్తుంటే ఒక కప్పు వేడివేడి అల్లం ఛాయ్ తాగేస్తే అది మీ కడుపును శాంతపరిచి మిమ్మల్ని కొంత కుదురుకునేలా చేస్తుంది. ఒకవేళ మీకు టీ తాగే అలవాటు లేకపోతే రెండు చెంచాల అల్లం పొడి, లేదా అల్లం చూర్ణం తీసుకొని, సగం నిమ్మకాయ, రెండు టీస్పూన్ల తేనేను రెండు కప్పుల నీటిలో వేసి 5 నిమిషాల పాటు వేడి చేయాలి, ఆ తర్వాత మిశ్రమాన్ని తాగాలి.

సమతుల్యమైన అల్పాహారం

హ్యాంగోవర్ కారణంగా ఆకలిగా అనిపించదు లేదా తింటే కూడా నోటికి రుచి తగలదు. అయితే హ్యాంగోవర్ ఉన్నప్పుడు ఉదయం అల్పాహారం మానొద్దు. ఆల్కహాల్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. కాబట్టి దానిని సమతుల్యం చేయడానికి అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి.

ఇడ్లీ లాంటి ఏదైనా లైట్ ఫుడ్ లేదా చీజ్ ఆనియన్ ఆమ్లెట్, ఆమ్లెట్ టోస్ట్ లాంటి అల్పాహారం తీసుకుంటే ప్రభావం కనిపిస్తుంది.

అరటిపండు

మీ దగ్గర్లోని సూపర్ మార్కెట్లో పియర్ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే తీసుకోండి, లేనిపక్షంలో అరటి పండ్లు కూడా హ్యాంగోవర్ కి బాగా పనిచేస్తాయి. అరటిపండ్లు మీ శరీరంలో పొటాషియం, విటమిన్-బి లను అందిస్తాయి. అవి శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి. కర్బూజ పండ్లు మీ శరీరానికి హైడ్రేషన్ అందిస్తాయి. కాబట్టి అవి కూడా తీసుకోవాలి

నీరు

ఇక మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. హ్యాంగోవర్ కారణంగా మీకు దాహం ఎక్కువగా వేస్తుంది. ఎందుకంటే అల్కాహాల్ ద్వారా శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే సమృద్ధిగా నీరు తాగాలి, పండ్ల రసాలు తీసుకోవాలి. తలనొప్పి, అలసట నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.

నిద్ర

నిద్ర సర్వరోగ నివారిణి. సరైన నిద్ర ఉంటే ఎలాంటి అనారోగ్యమైనా త్వరగా నయమవుతుంది. మీకు ఆఫీస్‌లో పని ఒత్తిడి ఉన్నా, హ్యాంగోవర్ నుంచి బయటపడాలన్నా వీలు చిక్కితే మంచి నిద్ర తీసుకోండి. లేకపోతే హ్యాంగోవర్ ఎంతకీ తగ్గదు.

Whats_app_banner

సంబంధిత కథనం