Cooldown Exercises for Summer: వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తాయి. భరించలేని వేడి, ఉక్కపోత వలన శరీరం త్వరగా అలసిపోతుంది. ఎలాంటి శ్రమ లేకుండానే ఎండవేడికి ఎక్కువగా చెమటలు పడతాయి, డీహైడ్రేషన్ కు గురవుతాం. సాధారణంగా శరీరంలో జరిగే జీవక్రియల వలన ఉష్ణం అనేది విడుదలవుతుంది. ఇదే సమయంలో బయట నుంచి వచ్చే ఎండవేడి కారణంగా శరీరం మరింత వేడెక్కుతుంది, ఇది కొన్నిసార్లు భరించలేని స్థితికి చేరుకుంటుంది.
ఈ సీజన్ లో వ్యాయామాలు చేయడం అంటే కత్తిమీద సాము లాంటిందే. అయితే ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ వ్యాయామాలలో శరీరాన్ని వేడెక్కించేవే కాదు, కొన్ని చల్లబరిచే వ్యాయామాలు కూడా ఉంటాయి. ఆశ్చ్యర్యపోతున్నారా? కానీ ఇది నిజం, కొన్ని యోగాసనాలు శరీర ఉష్ణోగ్రతను సహజంగా తగ్గించి మిమ్మల్ని రిఫ్రెష్‌గా, శక్తివంతంగా ఉంచటానికి సహాయపడతాయి.
ఈ వేసవిలో అటువంటి యోగాసనాలను మీ దినచర్యలో భాగం చేసుకుంటే మీ శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఇందుకోసం మీరు కేవలం 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. మీ శరీరాన్ని చల్లబరిచే యోగాసనాలు ఏవో ఇప్పుడు చూడండి.
ఇది నిలబడిన భంగిమలో చేసే యోగాసనం, ఇతర ఆసనాలు వేసేందుకు కూడా ఈ భంగిమనే ఆధారం. తాడాసనంను రోజులో ఏ సమయంలోనైనా సాధన చేయవచ్చు, ప్రత్యేకించి ఉదయం ఖాళీ కడుపుతోనే చేయాల్సిన అవసరం లేదు. తాడాసనం అనేది ప్రాథమిక స్థాయి యోగా, కనీసం 10-12 సెకన్ల పాటు భంగిమలో ఉండటం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గటంతో పాటు ఒళ్లు నొప్పుల నుండి ఉపశమనం, మెరుగైన రక్త ప్రసరణ, కండరాలకు సరైన ఆకృతిని ఇవ్వడం వంటి ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ యోగాసనం మీ కాళ్లు, దిగువ వీపును సాగదీయడానికి ఉత్తమమైనది. ఇది వేసవి నెలల్లో వేయదగిన గొప్ప ఆసనం. ఈ ఆసనం వేయడం ద్వారా మీ మనస్సు శాంతపడుతుంది, శ్వాసను క్రమబద్ధంగా మారుతుంది. తద్వారా శరీరం చల్లగా మారి, విశ్రాంతి పొందిన భావన కలుగుతుంది.
ఈ ఆసనంలోని కదలికలు సీతాకోకచిలుక రెక్కలను చప్పుడు చేస్తున్నట్లుగా ఉంటుంది, అందువల్ల దీనిని సీతాకోకచిలుక భంగిమ అని కూడా పిలుస్తారు. ఇది చాలా సరళమైన భంగిమ.మీ శరీరం, మెదడులోని వివిధ భాగాలకు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ ఆసనం వేయడం ద్వారా మీ శరీర ఉష్ణోగ్రత తగ్గి, రిలాక్స్ అవుతారు. అయితే గమనిక, ఈ ఆసనాన్ని ఉదయం లేదా సాయంత్రం 10-12 నిమిషాలు చేయండి. అలాగే ఈ ఆసనంను ఖాళీ కడుపుతో ఆచరించాలి లేదా మీరు భోజనం చేసి కనీసం 4 గంటలు అయి ఉండాలి.
ఈ ఆసనం మీ కాళ్లు, కండరాలలో బలాన్ని పెంపొందించడానికి ఒక అద్భుతమైనది, అదే సమయంలో శరీర సమతుల్యతను, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, శరీరానికి శక్తినివ్వడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఇది మంచి వ్యాయామం.
ఈ యోగా భంగిమ మీ చేతులు, భుజాలు, ఇతర కండరాలను బలోపేతం చేస్తుంది. మెదడుకు రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఈ ఆసనం మీ శరీరాన్ని చల్లబరిచి.. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇది ఒక ధ్యాన ముద్ర. శరీరంపై శీతలీకరణ ప్రభావానికి ప్రసిద్ధి చెందింది. ఈ భంగిమలో నోటి ద్వారా శ్వాస పీల్చడం, ముక్కు ద్వారా వదలడం చేయాలి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి , మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడే శీతలీకరణ వ్యాయామం.
సంబంధిత కథనం