ఈ ఎండాకాలంలో అందరూ చల్లని నీటినే తాగటానికే ఇష్టపడతారు. ఇందుకోసం ఫ్రిజ్‌లో నీళ్లబాటిళ్లను (Fridge water in Summer) ఉంచి అవసరమైనప్పుడు తాగుతారు. అయితే వివిధ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇటీవల కాలంలో చాలా మంది రాగి బిందెలు, రాగి గ్లాసులు, రాగి నీళ్ల బాటిళ్లలో నిల్వ ఉంచిన నీళ్లు తాగుతున్నారు. మనం సాధారణంగా ఫ్రిజ్‌లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లనే ఉంచుతాం. మరి రాగి పాత్రలను ఫ్రిజ్‌లో ఉంచవచ్చా? రాగి బాటిళ్లను ఫ్రిజ్‌లో నిల్వచేయవచ్చో లేదోనన్న సందేహాలు మీకు కలిగి ఉండవచ్చు. మీ సందేహాలకు సమాధానం ఇక్కడ తెలుసుకోండి.
రాగి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచింది. నీటిలో హానికరమైన సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటి వాటని సహజంగా నశింపజేసే సామర్థ్యం రాగి నీళ్లకు ఉంటుంది. అందుకే శతాబ్దాలుగా రాగి పాత్రలలో నీరు తాగటం అనేది కొనసాగుతుంది. అయితే నిపుణుల ప్రకారం, రాగినీళ్ల బాటిళ్లను ఫ్రిజ్‌లో నిల్వచేయకూడదు. రాగి బాటిల్‌ను ఫ్రిజ్‌లో (Copper Water Bottle in Fridge) నిల్వ చేయడం వలన మీకు కలిగే నష్టాలు ఏమీ లేకపోయినప్పటికీ, ప్రయోజనాలు కూడా ఏమి ఉండవు. ఎందుకంటే రాగి బాటిల్‌ను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినపుడు మాత్రమే అందులోని రాగి మూలకాలు నీటిలో కలుస్తాయి, శీతలీకరణ ఆల్కలీనైజేషన్ ప్రక్రియను జరగనివ్వదు. ఫలితంగా ఆ రాగి పాత్రలో తాగే నీటికి ఎటువంటి అర్థం, ప్రయోజనం ఉండదు అని చెబుతున్నారు. మీకు అంతగా చల్లటి నీటిని తాగాలనిపిస్తే ఫ్రిజ్ నీటిని రాగి పాత్రలో పోసి, నిల్వ చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇలా రాగి పాత్రలో పోసిన చల్లటి నీరు మిగతా పాత్రల కంటే మరింత చల్లగా, చాలా కాలం పాటు ఉంటుందని చెబుతున్నారు. రాగి బాటిల్‌ను గది ఉష్ణోగ్రత వద్ద శుభ్రమైన ప్రదేశంలో నిల్వ చేయాలని సలహా ఇస్తున్నారు.
రాగి నీటిని సంస్కృతంలో తామ్ర జల్ (Tamra Jal) అంటారు. ఆయుర్వేదం (Ayurvedam) ప్రకారం తామ్ర జల్ తాగటం శరీరానికి చాలా మంచిది. రాగి పాత్రలో నీటిని రాత్రిపూట నిల్వ ఉంచి ఉదయాన్నే తాగటం చాలా ఆరోగ్యకరం. రాగి పాత్రలో సుమారు ఎనిమిది గంటలకు పైగా నీరు నిల్వ ఉంచినప్పుడు, కొద్ది మొత్తంలో రాగి అయాన్లు ఆ నీటిలో కరిగిపోతాయి. ఈ ప్రక్రియను ఒలిగోడైనమిక్ ఎఫెక్ట్ అంటారు, ఇది హానికరమైన సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు మొదలైన వాటిని నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
రాగి పాత్రలో నీరు నిల్వ చేసినపుడు పైన నూనె తేలినట్లుగా ఒక పొర కనిపిస్తుంది. చాలా మంది తెలియక ఆ పైపొరను ఒలకబోస్తారు. నిజానికి ఈ నూనె పొరగా మీరు భావించేవి రాగి మూలకాలు (Copper Ions). ఈ నీటిని తాగటం సురక్షితమైనవి, నిజానికి ఆరోగ్యకరమైనవి. ముఖ్యంగా కాలేయ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.
రాగి నీరు తాగటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గడంలో సహకరిస్తుంది, గాయాలను వేగంగా నయం చేస్తుంది, ఒళ్లు నొప్పులు, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే మోతాదులో తాగటం అవసరం.
సంబంధిత కథనం