Chicken Curry In a Hurry । చిటికెలో చికెన్ కర్రీని చేసేయండిలా!-curry in a hurry here is an easy and quick chicken curry recipe make it in just 15 minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Curry In A Hurry । చిటికెలో చికెన్ కర్రీని చేసేయండిలా!

Chicken Curry In a Hurry । చిటికెలో చికెన్ కర్రీని చేసేయండిలా!

HT Telugu Desk HT Telugu
Aug 10, 2024 05:30 AM IST

Chicken Curry In a Hurry Recipe: త్వరత్వరగా ఏదైనా వండుకోవాలని ఉందా? కమ్మగా కోడికూరను 10 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ఈజీ చికెన్ కర్రీ రెసిపీని ఇక్కడ చూడండి.

Chicken Curry In a Hurry Recipe
Chicken Curry In a Hurry Recipe (slurrp)

Easy Chicken Curry Recipes: మీకు ఇప్పటికిప్పుడే కోడికూర తినాలని ఉందా? కేవలం 10-15 నిమిషాల్లోనే కోడికూరను సిద్ధం చేసుకోవచ్చు. మీ వద్ద సమయం లేనపుడు, వెంటనే చేసుకోవడానికి ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు ఉపయోగపడుతుంది. మీరు చికెన్ స్థానంలో రొయ్యలను కూడా చేర్చుకోవచ్చు. రొయ్యలకైతే కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయం చాలు. మీరు ఏది చేసుకోవాలనుకున్నా, ప్రాసెస్ ఇదే. ఆలస్యం ఎందుకు, రెసిపీ చదివి మీరూ ప్రయత్నించండి మరి.

Chicken Curry In a Hurry Recipe కోసం కావలసినవి

  • 200 గ్రా బోన్‌లెస్ చికెన్
  • 2-3 టొమాటోలు
  • 1 ఉల్లిపాయ
  • 2 టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 2 స్పూన్ల కారం
  • 1/4 స్పూన్ పసుపు
  • 1 స్పూన్ గరం మసాలా
  • 1 టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు నూనె
  • 3 టేబుల్ స్పూన్లు పెరుగు
  • కొన్ని కొత్తిమీర ఆకులు
  • రుచికి తగినంత ఉప్పు

చికెన్ కూర తయారీ విధానం

  1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోండి, టొమాటోలు, ఉల్లిపాయలు కడిగి ముక్కలుగా కోసి పెట్టుకోండి.
  2. ఇప్పుడు బాణలిలో నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయలు వేసి రంగు మారేంత వరకు వేయించాలి.
  3. ఆపైన అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి.
  4. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి పసుపు, ఉప్పు, కారం వేసి మెత్తగా వేయించాలి, ఆపైన పావు వంతు నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించాలి.
  5. అనంతరం చికెన్ ముక్కలు వేసి, పైనుంచి గరం మసాలా వేసి మూతపెట్టి చికెన్ ఉడికేంత వరకు 10-15 నిమిషాలు ఉడికించాలి.
  6. చివరగా పెరుగు వేసి కలపాలి, కొత్తిమీర చల్లుకోవాలి.

అంతే, చికెన్ కర్రీ రెడీ. అన్నంతో కలిపి లంచ్ లేదా డిన్నర్ లో తింటూ రుచిని ఆస్వాదించండి.

Whats_app_banner

సంబంధిత కథనం