దూపుడు పోతు మాంసం కూర.. రంజాన్ స్పెషల్.. చెఫ్ అందిస్తున్న రెసిపీ-dupudu pothu mutton curry ramadan special recipe by chef ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  దూపుడు పోతు మాంసం కూర.. రంజాన్ స్పెషల్.. చెఫ్ అందిస్తున్న రెసిపీ

దూపుడు పోతు మాంసం కూర.. రంజాన్ స్పెషల్.. చెఫ్ అందిస్తున్న రెసిపీ

HT Telugu Desk HT Telugu
Aug 04, 2024 01:11 AM IST

దూపుడు పోతు మాంసం కూర.. రంజాన్ స్పెషల్ రెసిపీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చని పాకశాస్త్ర నిపుణుడు, చెఫ్ వి.హెచ్.సురేష్ వివరిస్తున్నారు.

దూపుడు పోతు మాంసం కూర
దూపుడు పోతు మాంసం కూర

రంజాన్ పండగ స్పెషల్ రెసిపీ దూపుడు పోతు మాంసం కూర ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ప్లాట్‌ఫామ్ 65 కారొరేట్ చెఫ్ వి.హెచ్.సురేష్ వివరిస్తున్నారు.

దూపుడు పోతు మాంసం కూరకు కావలసిన పదార్థాలు

  • మటన్ 180 గ్రాములు
  • వంట నూనె 100 మిలి.లీటర్
  • గరం మసాలా 20 గ్రాములు
  • తరిగిన ఉల్లిగడ్డలు 150గ్రాములు
  • పసుపు 10 గ్రాములు
  • అల్లం వెల్లులి పేస్ట్ 50 గ్రాములు
  • ఉప్పు 10 గ్రాములు
  • చిరోంజీ పేస్ట్
  • తరిగిన పచ్చి మిర్చి 2 టీ స్సూన్స్
  • కారం 2 టీ స్పూన్స్
  • ధన్యాల పొడి 10 గ్రాములు
  • టమాటాలు 20 గ్రాములు

దూపుడు పోతు మాంసం కూర తయారు చేసే విధానం

  1. ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. కూర సరిపడా కడాయి తీసుకొని లో ఫ్లేమ్‌లో స్టవ్ మీద పెట్టాలి.
  2. వేడైన తరువాత నూనె, గరం మసాలా, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పెస్ట్ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు తగినంత పసుపు వేయాలి.
  3. తరువాత మటన్ మొత్తం అందులో వేసి ఆ మిశ్రమాన్ని తక్కువ ఫ్లేమ్ లో వేసి వేయించాలి. ఇప్పుడు తరిగిన టామాటాలని వేసి వేయించాలి. కూర కాస్త వేగిన తరువాత పచ్చి మిర్చిని పచ్చడిగా చేసి కూరలో వేయాలి.
  4. బాగా వేగాక 100 మి.లీ. మేర మంచి నీరు పోసి కాసేపు మూత పెట్టాలి. కొంత సమయం తరువాత తగినంత కారం వేయాలి. పది నిమిషాలు ఆగి మటన్ ముక్కలు ఉడికాయ లేదా అని చూసుకోవాలి. ఉడకకపోతే ఇంకొంత సేపు ఉడికించాలి.
  5. చివరిగా కొంచెం ఉప్పు, గరం మసాలా, చిరోంజీ పేస్ట్, ధన్యాలపొడి వేయాలి. ఈ మిశ్రమాన్ని వేయించాలి. బాగా వేగాక స్టవ్ మీద నుంచి దించి గిన్నేలో కి తీసుకొని కొత్తిమీర‌తో గార్నిష్ చేసుకోవాలి

ఈ కూరని రోటీ లేదా అన్నంతో తింటే చాలా రుచికరంగా ఉంటుందని ప్లాట్‌ఫామ్ 65 కార్పొరెట్ చెఫ్ వి.హెచ్. సురేష్ వివరించారు.

సంబంధిత కథనం