గత కొన్ని సంవత్సరాలుగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగుతోంది. మధుమేహం అనేది ఒక దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్య, ఒకసారి డయాబెటీస్ అటాక్ అయితే దానికి చికిత్స లేదు, కేవలం లక్షణాలను మాత్రమే నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. ఈ వ్యాధి నుండి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవాలంటే కచ్చితమైన ఆహార నియమాలను పాటించడం చాలా ముఖ్యం. మీరు ఏమి తింటున్నారో సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే, మధుమేహంకు సంబంధించి ఎదురయ్యే ప్రతీ సమస్య మీరు తినే ఆహారంతోనే మొదలవుతుంది. కాబట్టి, మధుమేహ రోగులు తాము తినే ఆహారాన్ని సమతుల్యంగా ఉంచుకుంటే ఈ సమస్యను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.,కొన్ని రకాల తృణధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిని భారీగా తగ్గించగలవని ఇటీవలి పరిశోధనలో తేలింది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన మిల్లెట్లు అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల, వీటిని ఆహారంగా తీసుకుంటే చక్కెర స్థాయిలను సులభంగా తగ్గించుకోవచ్చని పరిశోధన ఫలితాలు వెల్లడించాయి.,Millets for Diabetes- మధుమేహం అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన మిల్లెట్లుఈ మిల్లెట్లు మధుమేహులకు వరం అని చెప్పాలి, ఎందుకంటే ఇవి రక్తంలోని చక్కెరను శోషిస్తాయి. వీటిని మీరు అన్నం వండుకోవచ్చు లేదా పిండిగా మార్చుకొని చపాతీలు, రొట్టెలుగా చేసుకొని తినవచ్చు. మరి అటువంటి అద్భుతమైన తృణధాన్యాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం,జొన్నలుమధుమేహం సమస్య ఉన్నవారు జొన్నరొట్టెలు తినాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జొన్నలు గ్లూటెన్ రహిత ధాన్యం, మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జొన్నలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, అంటే ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కాదు.,రాగులురాగి పిండిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, రాగి గ్లూటెన్ రహిత, అధిక కాల్షియం, తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన సూపర్ ఫుడ్. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇంకా దీనిలోని ఫైబర్ చక్కెర జీవక్రియను వేగవంతం చేస్తుంది.,సజ్జలుఈ రకమైన మిల్లెట్ మనకు సమృద్ధిగానే లభిస్తుంది. సాధారణంగా పశువులకు ఆహారంగా ఇస్తారు. కానీ, డయాబెటిక్ రోగులు దీనిని తీసుకుంటే, దీనిలోని ఫైబర్ చక్కెరను వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.,బార్లీబార్లీ అనేది ఒక గడ్డిజాతి ధాన్యపు మొక్క. బార్లీ గింజలు తినదగినవి, బార్లీ ధాన్యాన్ని పిండిగా చేసుకొని వాటితో రొట్టెలు చేసుకోవచ్చు. ఈ బార్లీ రొట్టెలు కూడా మధుమేహులకు మంచిది. బార్లీ గ్లూకాన్‌ను కలిగి ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.,ఓట్స్మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ పిండి తినడం చాలా మంచిది. ఓట్స్‌ను గ్రైండ్ చేసి, ఆటా తయారు చేయడం ద్వారా వారికి నచ్చిన ఆహారాలను తయారు చేసుకోవచ్చు. ఓట్స్ పిండితో ఓట్స్ ఇడ్లీలు, ఓట్స్ దోశలు కూడా చేసుకొని తినవచ్చు. ఇందులోని మెగ్నీషియం, ప్రొటీన్లు చక్కెరను వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.,కాబట్టి, ఈ రకమైన తృణ ధాన్యాలు మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే వీటిని ఆహారంగా తీసుకునే ముందు మీరు మీ వైద్యుల సలహా కూడా తీసుకోవడం ఉత్తమం అని తెలియజేస్తున్నాం.,