Varieties of Rotis । ఈ రొట్టెలు ఆరోగ్యకరం, చపాతీలకు మంచి ప్రత్యామ్నాయం!-these nutritious varieties of rotis healthy and alternative for regular chapathis ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Varieties Of Rotis । ఈ రొట్టెలు ఆరోగ్యకరం, చపాతీలకు మంచి ప్రత్యామ్నాయం!

Varieties of Rotis । ఈ రొట్టెలు ఆరోగ్యకరం, చపాతీలకు మంచి ప్రత్యామ్నాయం!

HT Telugu Desk HT Telugu

రాత్రి భోనజంలో చపాతీ కాకుండా వేరే ఏదైనా రోటీ తినాలనుకుంటున్నారా? మనకు వివిధ రకాల ఆరోగ్యకరమైన రొట్టెలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

Rotis (Unsplash)

రాత్రి భోజనంలో చాలా మంది అన్నంకు బదులుగా చపాతీ లేదా రోటీలను తినడానికి ఇష్టపడతారు. ఈ రోటీలను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం కూడా. రాత్రి భోజనంలోనే కాకుండా ఉదయం అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. ప్రయాణాల్లోనూ తినడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే అందరూ రోటీలను తినలేరు. ఎందుకంటే మైదా, గోధుమలతో చేసే రోటీలలో గ్లూటెన్ ఉండవచ్చు. అందువల్ల గ్లూటెన్ ఎలర్జీ కలిగిన వారు, ఉదరకుహర వ్యాధి ఉన్నవారు రొట్టెలను తినలేకపోతారు.

అయితే ఇక్కడ మీరొక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే.. అన్ని రోటీలలో గ్లూటెన్ ఉండదు. మన భారతీయ వంటకాల్లో ఎంతో వైవిధ్యత ఉంటుంది. ఎన్నో రకాల వెరైటీ రోటీలు మనకు అందుబాటులో ఉంటాయి. అందులో ఎన్నో ఆరోగ్యకరమైన రోటీ రకాలు కూడా ఉన్నాయి. అవి రుచికరంగా ఉంటాయి, తేలికగా జీర్ణం అవుతాయి. శక్తివంతమైనవి కూడా. మరి ఆ రోటీలు ఏంటో తెలుసుకుందామా?

జొన్న రొట్టె

జొన్న రొట్టె మనందరికీ తెలిసిందే. గోధుమ రొట్టెలకు ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఈ రొట్టెలను జొన్న పిండితో తయారు చేస్తారు.

జొన్నరొట్టెలు తినడం ద్వారా ప్రోటీన్, ఐరన్, విటమిన్ B6 మొదలైన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇవి ఎంతో శక్తివంతమైన ఆహారం. మినపపప్పుతో తింటే అదిరిపోతాయి. జొన్నరొట్టెలు తినడం ద్వారా జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మిస్సి రొట్టె

మిస్సి రొట్టెలను ఎక్కువగా నార్త్ ఇండియా వైపు చేసుకుంటారు. ఇవి శనగపిండి, గోధుమపిండి కలిపి చేసే రొట్టెలు. చాలా మృదువుగా ఉంటాయి. కూరగాయలతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా అధిక బరువును, కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.

మక్క రొట్టె

మొక్కజొన్న పిండితో తయారు చేసే రొట్టెలను మక్క రొట్టెలు అంటారు. ఇది చాలా తేలికైన, ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తేలికగా జీర్ణమవుతుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువు నియంత్రణ, రక్తంలో చక్కెర నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు మొదలైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

రాగి రొట్టె

రాగి ముద్ద, రాగి జావా ఎలా అయితే చేసుకుంటామో రాగి పిండితో రాగి రొట్టెలు కూడా చేసుకోవచ్చు. ఈ రకం రొట్టెల్లో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడం, మధుమేహం నియంత్రణ, మెరుగైన జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యాన్ని పెంచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

బులుగురు గోధుమ రొట్టె

దీనిని కుత్తు రొట్టె లేదా బక్ వీట్ రోటీ అని కూడా అంటారు. ఇవి గోధుమలలో మరో రకం. ఈ రోటీ రకంలో ఐరన్, ఫైబర్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఈ రోటీలు తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం చేకూరుస్తాయి.

సంబంధిత కథనం