Methi Millets Paratha | శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చే.. మేతి మిల్లెట్స్ పరాఠా-methi millets paratha recipe for healthy breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Methi Millets Paratha Recipe For Healthy Breakfast

Methi Millets Paratha | శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చే.. మేతి మిల్లెట్స్ పరాఠా

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 05, 2022 10:45 AM IST

మీరు ఉదయాన్నే లేచి బ్రేక్​ఫాస్ట్ ఏమి చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ రెసిపీ. అదే మిల్లెట్స్ మేతి పరాఠా. ఇది మీ ఆందోళనను, ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాకుండా.. మిల్లెట్‌లు ఎముకలు దృఢంగా మారేందుకు కూడా కృషి చేస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేవారికి ఇది చక్కని బ్రేక్​ ఫాస్ట్. దాని తయారీ విధానం.. ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం.

మిల్లెట్స్ మేతి పరాఠా
మిల్లెట్స్ మేతి పరాఠా

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల ప్రాముఖ్యం పెరిగింది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తూ.. ఇప్పుడు మిల్లెట్స్​ను తినడం ప్రారంభించారు. వీటిలో పోషకాలు ఎక్కువ ఉండడంతో డాక్టర్లు కూడా వీటిని తినమని సూచిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమ ఆహారాన్ని మిల్లెట్స్​తో భర్తీ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేతి మిల్లెట్స్ పరాఠాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పహారంతో ప్రారంభిస్తే.. డే కూడా మంచిగా స్టార్ట్ అవుతుంది.

మిల్లెట్స్ మేతి పరాఠాలో ఫ్లేవనాయిడ్లు, లిగ్నిన్​, ఫైటో న్యూటియెంట్లు ఉన్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్​ఫెక్షన్​కి వ్యతిరేకంగా పోరాడతాయి. ఇది యాంటీ ఏజినింగ్​లా పనిచేసి.. చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక ఆస్తమా రోగులకు బాజ్రాపై నోషింగ్ తప్పనిసరి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్​లు, మెగ్నీషియం యాంటీ ఇన్​ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఎముకలు బలంగా మారేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. దీని ప్రయోజనాలు తెలుసుకున్నారు కాబట్టి.. వీటిని మీరు కూడా రెగ్యూలర్ బ్రేక్​ఫాస్ట్​లో చేర్చుకోండి.

మేతి మిల్లెట్స్ పరాఠా రెసిపీ:

కావలసినవి:

మిల్లెట్స్ - కప్

శెనగపిండి - కప్

టీస్పూన్ - జీలకర్ర

టీస్పూన్ - ఉప్పు

⅛ టీస్పూన్ - ఇంగువ

టీస్పూన్ - పసుపు

1 టీస్పూన్ - కారప్పొడి

1 టేబుల్ స్పూన్ - నువ్వులు గింజలు

కప్పు - మెంతి ఆకులు

1 టీస్పూన్ - నూనె

1 కప్పు- మెంతి ఆకులు (ఉడికించినవి)

తయారీ:

ఒక గిన్నెలో, బేసన్, మిల్లెట్స్, జీలకర్ర, ఉప్పు, పసుపు, మిరప్పొడి, ఇంగువ, నువ్వులు, నూనె, మెంతి ఆకులు అన్ని పదార్థాలను కలపండి. పిండిని తయారు చేయడానికి కొద్దిగా వేడి నీటిని జోడించండి. మీకు 1/2 కప్పు నీరు అవసరం ఉంటుంది. ఈ ముద్దను గంటపాటు పక్కకు పెట్టేయండి.

అనంతరం పిండిని సమాన భాగాలుగా విభజించి.. వంట నూనెను ఉపయోగించి మీ అరచేతులతో రోల్ చేయండి. పొయ్యి మీద పెనం పెట్టి వేడి చేయండి. పరాటాను వృత్తాకారంలో చుట్టండి. రోల్ చేసిన తర్వాత, మేతి మిల్లెట్స్ పరాఠాను పెనం మీద వేసి.. బంగారు రంగులోకి వచ్చే వరకు ఉంచి వేయించాలి. పెరుగు రైతా లేదా పుదీనా కొత్తిమీర చట్నీతో దీన్ని తినండి.

WhatsApp channel