Millets Butter Milk | మిల్లెట్స్ మజ్జిగ… ట్రై చేశారా? ఆరోగ్యానికి చాలా మంచిది-how to make millets butter milk and benefits of millets butter milk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Millets Butter Milk | మిల్లెట్స్ మజ్జిగ… ట్రై చేశారా? ఆరోగ్యానికి చాలా మంచిది

Millets Butter Milk | మిల్లెట్స్ మజ్జిగ… ట్రై చేశారా? ఆరోగ్యానికి చాలా మంచిది

Himabindu Ponnaganti HT Telugu
Feb 28, 2022 05:14 PM IST

Millets buttermilk | మిల్లెట్స్... చిరుధాన్యాల వాడకం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. అన్నం, దోసెలు ఇలా ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలను తీసుకుంటున్నారు. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

<p>చిరు ధాన్యాలు</p>
చిరు ధాన్యాలు (pexels)

చిరు ధాన్యాలు రోజూ తినడం వల్ల అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అనేక పోషకాలను కలిగి ఉండే తృణ ధాన్యాలు శరీరానికి తగు పోషణ ఇస్తూ శక్తిని ఇస్తాయి. 

శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, ఉద్యోగంలో భాగంగా ఎక్కువగా తిరిగే వారు.. నీరసంగా ఉంటుందని, త్వరగా అలసిపోతున్నామని వాపోతుంటారు. వీరు చిరు ధాన్యాలతో చేసే మజ్జిగను తాగితే ఎంతో ఫలితం ఉంటుంది. 

ఎలా తయారు చేయాలి?

1. ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల సజ్జ పిండి తీసుకుని నూనె లేకుండా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.

2. సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. రెండు టీస్పూన్ల సజ్జ పిండికి కప్పు నీళ్లు సరిపోతాయి. పొంగితే మంట తగ్గించి దీనికి కప్పు మజ్జిగ కలిపి పెట్టుకోవాలి.

3. మరో నిమిషం పాటు ఉడికించిన తర్వాత కిందకి దించి చల్లార్చుకోవాలి.

4. చల్లారిన తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక టీస్పూన్‌ నిమ్మరసం, పావు టీస్పూన్‌ అల్లం రసం కలుపుకోవాలి. అంతే మిల్లెట్స్‌ మజ్జిగ రెడీ.

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో దీన్ని తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి. మిల్లెట్స్ మజ్జిగ కోసం సజ్జ పిండికి బదులుగా ఇతర చిరు ధాన్యాలకు సంబంధించిన పిండి వాడుకోవచ్చు. 

మొలకెత్తిన రాగులను పొడి చేసి రోజూ ఉదయం మజ్జిగలో కాస్త బెల్లంతో కలిపి తీసుకుంటే పోషకాలు అందుతాయి.

ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది?

కొర్రలు : ఆర్తరైటిస్, పార్కిన్‌సన్, మూర్చ రోగాల , నుంచి విముక్తి.

అరికలు : రక్తహీనత, డయాబెటిస్, మలబద్దకం

ఊదలు: లివరు, కిడ్నీ వ్యాధులు, కొలెస్ట్రాల్, కామెర్లు.

సామలు : అండాశయం, వీర్యకణ సమస్యలు, పీసీఓడీ, సంతానలేమి సమస్యల నివారణ.

అండుకొర్రలు :  థైరాయిడ్, రక్తపోటు, ఆర్తరైటిస్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.

Whats_app_banner

సంబంధిత కథనం