Cucumber Coconut Curry । దోసకోయ కొబ్బరి కూర తినండి.. వేసవిలో చలువ చేస్తుంది!
Cucumber Coconut Curry Recipe: వేసవిలో దోసకాయ కొబ్బరి కూర తినడం చలువ చేస్తుంది. మీ జీర్ణ వ్యవస్థను, మిమ్మల్ని ఆరోగ్యంగా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. దీని రెసిపీ ఇక్కడ చూడండి.
Cucumber Coconut Curry Recipe (Unsplash)
Summer Recipes: వేసవిలో మన ఆహారపు అలవాట్లు వేడి వాతావరణానికి అనుగుణంగా ఉండాలి. మసాలాలు, వేపుళ్లు మొదలైన వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఇవి శరీరంలో మరింత వేడిని పెంచుతాయి. కాబట్టి ఎండాకాలంలో చలువ గుణాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. దోసకాయలు, ముల్లంగి, పెసరిపప్పు, గుమ్మడికాయ, సీతాఫలాలు, కర్బూజ, పెరుగు, మజ్జిగా వంటివి ఎక్కువగా తీసుకోండి. ఇవి మీ శరీరాన్ని చల్లగా ఉంచటంతో పాటు, జీర్ణవ్యవస్థకు తేలికగా ఉంటాయి.
Cucumber Coconut Curry Recipe కోసం కావలసినవి
- 4 దోసకాయలు
- 1/2 కప్పు తాజా కొబ్బరి తురుము
- 1 అంగుళం అల్లం ముక్క
- 1 టీస్పూన్ ఆవాలు
- 3 - 4 పచ్చిమిర్చి
- 1/4 టీస్పూన్ పసుపు
- కొన్ని రెమ్మల కొత్తిమీర
- 3 టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు
- ఉప్పు రుచికి తగినంత
దోసకాయ కొబ్బరి కూర ఎలా తయారు చేయాలి
- ముందుగా దోసకాయలను శుభ్రంగా కడిగి, పొట్టు ఒలిచి, ఆపై ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగతా పదార్థాలన్నింటిని సిద్ధం చేసుకోండి.
- మొదట దోసకాయ ముక్కలను ఒక బాణాలిలో తీసుకొని, అరకప్పు నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి మీడియం మంటపై ఉడికించండి. దోసకాయ ముక్కలు మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించాలి.
- ఈలోపు కొబ్బరి తురుము, అల్లం, మిరపకాయలు, ఆవాలు, కొత్తిమీర, పసుపు వేసి ఒక మిక్సర్ బ్లెండర్‌లో మెత్తని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ మెత్తగా చేయడానికి అవసరమైతే కొద్దిగా నీరు కలపండి.
- ఇప్పుడు కొబ్బరి మిశ్రమాన్ని ఉడికిస్తున్న దోసకాయలతో కలపండి. 2 నుండి 3 నిమిషాలు తక్కువ వేడి మీద ఉడికించాలి. అవసరం మేరకు రుచిని, గ్రేవీని సర్దుబాటు చేసుకోండి.
- అనంతరం పెరుగు వేసి కలపాలి, చివరగా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. మీకు పచ్చిగా అనిపించకుండా ఒక టీస్పూన్ నూనెలో ఎండు మిర్చి, మొదలైనవి వేసి పోపు పెట్టుకోండి, ఆ పోను కూరలో కలుపుకోవచ్చు.
అంతే, దోసకాయ కొబ్బరి కూర సిద్ధం అయినట్లే. దీనిని అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
సంబంధిత కథనం