Telugu Cinema News Live September 28, 2024: Bigg Boss 8 Telugu Elimination: బిగ్‍బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే!
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 28 Sep 202403:28 PM IST
- Bigg Boss 8 Telugu Soniya Elimination: బిగ్‍బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో లీకుల ద్వారా బయటికి వచ్చింది. ఆరుగురు నామినేషన్లలో ఉండగా.. హౌస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ కానున్నారని సమాచారం వెల్లడైంది.
Sat, 28 Sep 202402:40 PM IST
- Alia Bhatt: ఆలియా భట్ లీడ్ రోల్ చేసిన జిగ్రా చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ రిలీజ్ కానుంది. ఈ విషయంపై నేడు అప్‍డేట్ వచ్చింది. తెలుగు థియేట్రికల్ హక్కులను ఓ డిస్ట్రిబ్యూషన్ హౌస్ తీసుకుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Sat, 28 Sep 202401:05 PM IST
- Game Changer Raa Macha Macha Song: గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ‘రా మచ్చా మచ్చా’ పాట ప్రోమో వచ్చేసింది. డ్యాన్స్ స్టెప్‍లతో రామ్‍చరణ్ అరగొట్టారు. ఈ సాంగ్ గ్రాండ్‍గా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
Sat, 28 Sep 202412:10 PM IST
- Bigg Boss 8 Telugu Today Promo: బిగ్‍బాస్ హౌస్‍లో నిఖిల్‍కు గట్టిగా క్లాస్ పీకారు నాగార్జున. అతడు తీసుకున్న ఓ నిర్ణయంపై ప్రశ్నలు సంధించారు. దీని కారణం ఏ మిస్ అంటూ.. సోనియా గురించి పరోక్షంగా ఉన్నారు. ఈ ప్రోమో వచ్చింది.
Sat, 28 Sep 202411:29 AM IST
- Aranmanai 4 OTT: అరణ్మనై 4 చిత్రం మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే నాలుగు భాషల్లో ఓ ఓటీటీలో ఉండగా.. హిందీలో మరో ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.
Sat, 28 Sep 202410:26 AM IST
- Furiosa: A Mad Max Saga OTT: ‘ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ చిత్రం ఇండియాలో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఓ ప్లాట్‍ఫామ్ రెంట్ విధానంలో ఉంది. ఇప్పుడు పూర్తిస్థాయిలో రెంట్ లేకుండా మరో ఓటీటీలోకి ఈ యాక్షన్ మూవీ అడుగుపెడుతోంది.
Sat, 28 Sep 202409:26 AM IST
Devara Collections: ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేసింది. యాభై నాలుగు కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. హిందీతో పాటు తమిళం, మలయాళంతో కన్నడంలో భాషల్లో మాత్రం దేవర పూర్తిగా నిరాశపరిచింది.
Sat, 28 Sep 202408:52 AM IST
- OTT Top Telugu Movies in September: ఈనెలలో ఓటీటీల్లోకి చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. పాపులర్ చిత్రాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. ఇందులో కొన్ని థియేటర్లలో సూపర్ హిట్‍లు ఉండగా.. మరికొన్ని డిజాస్టర్ అయినవి ఉన్నాయి. ఈనెల ఓటీటీల్లోకి వచ్చిన టాప్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
Sat, 28 Sep 202408:45 AM IST
Bigg Boss Telugu 8 Elimination Fourth Week: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్ నుంచి ఇవాళ (సెప్టెంబర్ 28) ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. వారిలో తన ముద్దుబిడ్డను కాపాడేందుకు బిగ్ బాస్ 2 ఆఫర్స్ ఇస్తాడని టాక్.
Sat, 28 Sep 202408:03 AM IST
Vamshi Paidipally Sri Sri Rajavaru Ramarao: జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి ఇటీవల శ్రీ శ్రీ రాజావారు టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ రాజావారు నిర్మాత చింతపల్లి రామారావుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వంశీ పైడిపల్లి.
Sat, 28 Sep 202407:46 AM IST
Telugu Horror OTT: హారర్ థ్రిల్లర్ మూవీ కళింగ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కళింగ మూవీలో హీరోగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు ధృవవాయు.
Sat, 28 Sep 202407:07 AM IST
Bigg Boss Telugu 8 Wild Card Entry Gautham Krishna: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి 9 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. వారిలో ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
Sat, 28 Sep 202406:01 AM IST
Nindu Noorella Saavasam September 28th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 28వ తేది ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో ఉన్న భాగీ మెడపై టెర్రరిస్ట్ కత్తి పెట్టి బెదిరిస్తాడు. కానీ, అమర్ కాపాడుతాడు. తర్వాత అమర్ చేసిన మోసంపై మిస్సమ్మపై ఇంట్లోవాళ్లు జోకులు వేస్తారు.
Sat, 28 Sep 202405:13 AM IST
OTT Crime Thriller: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ మెర్సీ కిల్లింగ్ థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మెర్సీ కిల్లింగ్ మూవీలో సాయికుమార్, పార్వతీశం, ఐశ్వర్య కీలక పాత్రలు పోషించారు.
Sat, 28 Sep 202404:44 AM IST
Devara Day 1 Worldwide Box Office Collection: కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్ 1 ఈ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 27) ఇండియాలో మంచి వసూళ్లు రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన దేవర మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో లుక్కేద్దాం.
Sat, 28 Sep 202404:17 AM IST
Jabardasth: జబర్ధస్థ్ కామెడీ షో గత పదేళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్ ఫైవ్‌లో ఒకటిగా కొనసాగుతోంది. 2013లో మొదలైన జబర్ధస్థ్ ఇటీవలే 600 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. జబర్ధస్థ్‌కు ప్రస్తుతం సిరి హనుమంత్ హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
Sat, 28 Sep 202403:28 AM IST
Satyam Sundaram Review: కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సత్యంసుందరం మూవీ శనివారం థియేటర్లలో రిలీజైంది. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ తమిళ్ డబ్బింగ్ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా లేదా అంటే?
Sat, 28 Sep 202403:18 AM IST
Sai Pallavi As Indhu Rebecca Varghese In Amaran First Look: రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. కమల్ హాసన్ నిర్మిస్తోన్న అమరన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ముకుంద్ పాత్రలో హీరో శివ కార్తికేయన్ నటించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే!
Sat, 28 Sep 202402:38 AM IST
Brahmamudi Serial September 28th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 28వ తేది ఎపిసోడ్‌లో ఎక్స్‌పో అవార్డ్ కోసం రాజ్, సామంత్ పోటీ పడుతుంటారు. ఈసారి తానే గెలుస్తానని, నీ ఓటమి ఎప్పుడో మొదలైందని రాజ్‌తో సామంత్ ఛాలెంజ్ చేస్తాడు. తర్వాత కావ్య మెడపై రాజ్ ముద్దుపెట్టుకుంటాడు. బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో..
Sat, 28 Sep 202401:47 AM IST
Gundeninda Gudigantalu Serial: గుండెనిండా గుడిగంటలు ప్రోమోలో బాలు వార్నింగ్‌ను లెక్కచేయకుండా షాపింగ్ మాల్‌లో సీక్రెట్‌గా శృతిని కలుస్తాడు రవి. నువ్వు లేకుండా బతకలేనని తన మనసులో మాట శృతికి చెబుతారు. కుటుంబసభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలని శృతి, రవి, ఫిక్సవుతారు.
Sat, 28 Sep 202401:41 AM IST
- Karthika deepam 2 serial today september 28th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీధర్ నిజం బయట పడటంతో తన పెళ్లి కార్తీక్ తో జరగదని జ్యోత్స్న ఏడుస్తుంది. తాతయ్య దగ్గరకు వెళ్ళి బావ కావాలని పెళ్లి చేయమని అడుగుతుంది.
Sat, 28 Sep 202401:22 AM IST
Bigg Boss Telugu 8 Vishnupriya Prithviraj Love: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌లో పృథ్వీరాజ్‌కు అవమానం జరిగింది. ఆ విషయాన్ని పృథ్వీనే చెప్పుకున్నాడు. పృథ్వీరాజ్ కంటే మణికంఠనే హాట్‌గా కనిపిస్తాడు అని యాంకర్ విష్ణుప్రియతో యష్మీ చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Sat, 28 Sep 202412:43 AM IST
Chiranjeevi: చిరంజీవి మరో అరుదైన అవార్డును అందుకున్నారు. శుక్రవారం అబుదాబీలో మొదలైన ఐఫా 2024 వేడుకల్లో చిరంజీవి ఔట్‌స్టాండింగ్ అఛీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ రచయిత జావేద్ అక్తర్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును స్వీకరించారు.