Karthika deepam september 28th episode: బావతో పెళ్లి కావాలన్న జ్యోత్స్న- శ్రీధర్ ని కావేరికి అప్పగించిన కాంచన
Karthika deepam 2 serial today september 28th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీధర్ నిజం బయట పడటంతో తన పెళ్లి కార్తీక్ తో జరగదని జ్యోత్స్న ఏడుస్తుంది. తాతయ్య దగ్గరకు వెళ్ళి బావ కావాలని పెళ్లి చేయమని అడుగుతుంది.
Karthika deepam 2 serial today september 28th episode: కాంచన మౌనంగా ఉండటంతో కార్తీక్ భయపడతాడు. సొంత చెల్లికి పెళ్లి చేసి అప్పగింతలు ఇస్తున్నట్టు మాట్లాడుతుంటే ఏంట్రా అని అడిగాను. అప్పుడే చెప్పొచ్చు కదా ఇది నా సొంత చెల్లి. నీ స్థానంలో నేను ఉంటే చచ్చిపోయే దాన్ని అన్నప్పుడే చెప్పొచ్చు కదా దీప.
దీపపై కార్తీక్ ఫైర్
నీ భర్త నిన్ను మోసం చేసి నా భర్తలాగే రెండో పెళ్లి చేసుకున్నాడని. నేను ఎంత అమాయకంగా మోసపోతూ వచ్చానో ఇప్పుడు అర్థం అయ్యిందని కాంచన బాధగా వెళ్ళిపోతుంది. కార్తీక్ దీప మీద ఫైర్ అవుతాడు. నేను నీకు మొదటి నుంచి చెప్తున్నాను కానీ నువ్వు వినలేదని అంటాడు.
నువ్వు ముందుండి ఈ పెళ్లి చేయకపోతే వాళ్ళకి పెళ్లి చేసుకునే ధైర్యం లేదు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నాకొక మాట చెప్పాలి కదా. అందరిలోనూ కొట్టి బయటకు గెంటేశారు. నా తండ్రి చేసింది తప్పే కానీ నా తల్లి ఏ తప్పు చేయకుండా తలదించుకుంది.
అందుకే వాళ్ళ పెళ్లి చేశా
అమ్మ ఏం నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలియడం లేదు. మోసం చేసిన వాడిలా నన్ను కూడా చూస్తుందని ఆవేదన చెందుతాడు. నేను మీ చెల్లిని తీసుకెళ్ళి పెళ్లి చేయలేదు. మీ నాన్న తనకు గుడిలో వేరే పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లి చేస్తే బతకదని నేనే వాళ్ళకు పెళ్లి చేశాను.
మా చెల్లి చనిపోయిన పరవాలేదు అంటే చెప్పండి నేను చేసింది తప్పని ఒప్పుకుంటాను. కానీ మీరు మనిషి ప్రాణం పోతే ఏం కాదని అనుకునే వాళ్ళు కాదు. ఏదైనా జరిగి స్వప్న ప్రాణం పోతే జీవితాంతం బాధపడతారు. ఈ పెళ్లి చేస్తే నిజాలు బయట పడతాయి, నేను అవమాన పడతానని తెలుసు.
నేను మీ శ్రేయోభిలాషిని
అన్నీ తెలిసిన నేను ఎందుకు చేశానో తెలుసా నేను మీ శ్రేయోభిలాషిని. నిజం తెలిస్తే మీ అమ్మ ఏమవుతుందోనని బరువు మోస్తూ బతికారు. ఇది జీవితాంతం మోయలేరు. మీ బరువు దించడం కోసం మీ బాధ్యత నేను తీసుకున్నానని చెప్తుంది. శ్రీధర్ ఇంట్లోకి వస్తే కార్తీక్ తలదించుకుని మౌనంగా ఉంటాడు.
దాసు స్వప్న వాళ్ళను తీసుకుని కావేరి ఇంటికి తీసుకొస్తాడు. మీరు కాశీతో ఎందుకు పెళ్లి వద్దు అన్నారో ఇప్పుడు అర్థం అయ్యింది. డాడీ ఎలాంటి వాడో తెలిసిన తర్వాత డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉందని బాధపడుతుంది. కావేరి కూతురికి క్షమాపణ చెప్తుంది.
స్వప్నను కూతురిలా చూసుకుంటా
క్షమించాల్సింది నేను కాదు పెద్దమ్మ అంటుంది. కార్తీక్ నా సొంత అన్నయ్య. తనకు నేను చెల్లెలు అని ముందే తెలుసు. ఒకసారి ఫ్యామిలీ ఫోటో చూపించాను అయినా చెప్పలేదు. నేను ఈ పెళ్లి చేసుకోవడం వల్ల ఒక నిజం తెలిసింది. డాడీ మీద అసహ్యం అయితే లేదు ఎందుకంటే తప్పు చేసే వాళ్ళకు ఒక కారణం ఉంటుంది.
నేను చేసింది తప్పే కానీ పెళ్లి జరిగితే అయ్యే తప్పు కంటే ఇది పెద్దది కాదని చెప్తుంది. కాశీ వాళ్ళు కావేరి ఆశీర్వాదం తీసుకుంటారు. స్వప్నను కోడలిలా కాకుండా సొంత కూతురిలా చూసుకుంటాను మీకు ఎలాంటి భయం లేదని దాసు కావేరికి మాట ఇస్తాడు. బావ లేకుండా నేను బతకలేను అని జ్యోత్స్న ఏడుస్తుంది.
బావతో పెళ్లి కావాలి
ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ తాత దగ్గరకు వెళ్ళి బావ లేకపోతే చచ్చిపోతానని చెప్పమని పారు ఐడియా ఇస్తుంది. శివనారాయణ ఫ్యామిలీ ఫోటోను నెలకేసి కొడతాడు. ఫోటోలో అయినా సరే వీడు పక్కన ఉండటానికి వీల్లేదని అంటాడు. నాకు బావతో పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు మీ మాట మీరు నిలబెట్టుకోండి అంటుంది.
శివనారాయణ కొడుకుని తీసుకుని కాంచన ఇంటికి బయల్దేరతాడు. బావకు నాకు పెళ్లి అని చిన్నప్పటి నుంచి మీరే చెప్పారు అందులో ఏ మార్పు జరిగినా ఊరుకొనని జ్యోత్స్న హెచ్చరిస్తుంది. శ్రీధర్ కాంచన కాళ్ళు పట్టుకుంటాడు. నేను నిన్ను మోసం చేశాను నన్ను క్షమించు అని అడుగుతాడు.
నమ్మక ద్రోహం చేశారు
మీరు మోసం చేయలేదు. నమ్మక ద్రోహం చేశారు. మీలాంటి అర్థం చేసుకునే మనిషి దొరకడం నా అదృష్టం అనుకున్నాను. కానీ ఎన్నో జన్మల పాపం చేస్తే తప్ప మీలాంటి భర్త దొరకడని అంటుంది. నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో నేను కావేరి మెడలో తాళి కట్టలేదు.
నీకు యాక్సిడెంట్ అయిన తొలి రోజుల్లో అనుకోకుండా అయిన పరిచయమని చెప్తాడు. కాంచన చాలా ఆవేదనగా మాట్లాడుతుంది. తప్పు ఒప్పుకుంటున్నాను ఏ శిక్ష వేసినా అనుభవిస్తానని శ్రీధర్ అంటాడు. నేను ఆల్రెడీ మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్తుంది.
కావేరికి భర్తను అప్పగించిన కాంచన
అప్పుడే ఇంటికి కావేరి వస్తుంది. అటు గదిలో నుంచి కాంచన, శ్రీధర్ కూడా బయటకు వస్తారు. కావేరిని చూసి షాక్ అవుతాడు. కాంచన కావేరిని రెస్టారెంట్ లో చూసిన విషయం గుర్తు చేసుకుంటుంది. మా ఆయన నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే ఆయనకు పెళ్లి అయ్యిందనే విషయం తెలుసా అని కాంచన అడుగుతుంది.
తెలుసని చెప్తుంది. మీరు చాలా మంచి వాళ్ళు భార్య బతికే ఉందని తెలిసినా రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆవిడను మోసం చేయలేదని భర్తకు చురక వేస్తుంది. దీపతో చీర, పూలు తెమ్మని చెప్తుంది. కావేరికి బొట్టు పెట్టి సారె ఇస్తుంది. కావేరి కాంచన కాళ్ళ మీద పడుతుంది. శ్రీధర్ ని కావేరితో పంపించాలని కాంచన నిర్ణయం తీసుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.