Karthika deepam september 23rd episode: ఎల్లుండే శ్రీకాంత్ తో స్వప్న పెళ్లి- కార్తీక్ కి శ్రేయోభిలాషిగా మారిన దీప-karthika deepam 2 serial today september 23rd episode sridhar informs swapna about her marriage with srikanth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam September 23rd Episode: ఎల్లుండే శ్రీకాంత్ తో స్వప్న పెళ్లి- కార్తీక్ కి శ్రేయోభిలాషిగా మారిన దీప

Karthika deepam september 23rd episode: ఎల్లుండే శ్రీకాంత్ తో స్వప్న పెళ్లి- కార్తీక్ కి శ్రేయోభిలాషిగా మారిన దీప

Gunti Soundarya HT Telugu
Sep 23, 2024 07:06 AM IST

Karthika deepam 2 serial today september 23rd episode: ఎల్లుండి శ్రీకాంత్ తో పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత మీరిద్దరూ అమెరికా వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకోండి అని శ్రీధర్ కూతురు స్వప్నతో చెప్తాడు. ఈ మాటలు చాటుగా కాశీ విని పెళ్లి ఎలాగైనా ఆపాలని అనుకుంటాడు.

కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today september 23rd episode: స్వప్నకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తుంది. హాస్పిటల్ కి కార్తీక్ రావడం శ్రీధర్ చూస్తాడు. వీడికి నేను కనిపిస్తే స్వప్న తండ్రి నేనే అని తెలుస్తుందని కంగారుగా దాక్కుంటాడు. అదే హాస్పిటల్ కి దీప కూడా వస్తుంది. కాశీ కంగారుగా వస్తాడు. అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావని దీప తిడుతుంది.

స్వప్న దగ్గరకు కార్తీక్

ప్రేమ ప్రేమ అని ఆ పిల్లను చంపేలా ఉన్నావని అంటుంది. హాస్పిటల్ లో దీపను చూసిన కార్తీక్ మీరు ఎందుకు వచ్చారని అడుగుతాడు. నేను వచ్చింది మీకోసం కాదు మీ చెల్లి కోసం వచ్చాను. కాశీ స్వప్నతో మాట్లాడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు మీ నాన్నకు దొరికిపోయారు.

కాశీ లేకపోతే చచ్చిపోతానని స్వప్న చెయ్యి కోసుకుందని చెప్పడంతో కార్తీక్ కంగారుపడతాడు. వెంటనే స్వప్న దగ్గరకు వెళతాడు. కాశీని శ్రీధర్ దగ్గరకు వెళ్ళి మాట్లాడమని దీప చెప్తుంది. కాశీ ఎదురుపడగానే శ్రీధర్ తెగ తిడతాడు. కార్తీక్ స్వప్నను కలిసి తిడతాడు.

శ్రీధర్ వార్నింగ్

మా నాన్నకు కాశీ నచ్చలేదు. మేం ఎవరం ఏం చెప్పలేకపోతున్నామని చెప్తుంది. దీప, కార్తీక్ ని మాట్లాడి తన తండ్రిని కన్వీన్స్ చేయమని అడుగుతుంది. ఈ టైమ్ లో ఈ విషయం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని కార్తీక్ నచ్చజెప్తాడు. ఇంకోసారి తన కూతురు జోలికి రావొద్దని శ్రీధర్ కాశీకి మరోసారి వార్నింగ్ ఇస్తాడు.

కాశీ దొంగచాటుగా స్వప్నను కలుస్తాడు. మనకు సాయం చేయడానికి దీపక్క వాళ్ళు ఉన్నారు కదా అంటే అన్నయ్య మన పెళ్ళికి సాయం చేస్తారని నమ్మకం తనకు లేదని చెప్తుంది. కార్తీక్ దీపతో స్వప్న పెళ్లి గురించి మాట్లాడతాడు. మా నాన్నకు కాశీ ఎవరో తెలిసిపోయింది.

నేనే పరిష్కరిస్తా

అందుకే కాశీతో పెళ్లి చేయను అంటున్నాడు. కానీ కాశీతో పెళ్లి జరగకపోతే స్వప్న బతకదు అంటాడు. అయితే పెళ్లి చేసేద్దామని అంటుంది. పెళ్లి జరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదా అంటాడు. నువ్వు అనుకున్న మార్గంలోకి నేను రాలేను. ఓ పక్క తల్లి మరో పక్క తండ్రి, మధ్యలో చెల్లి, తనకు ఓ తల్లి.

కొన్ని విషయాలు బయటపడితే కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇలా ఎందుకు చేశామని తర్వాత బాధపడాలని అంటాడు. ఏం జరిగినా మనం తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని దీప ధైర్యం చెప్పడానికి చూస్తుంది. మీరు నాకు ఎంతో సాయం చేశారు మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. దీనికి నేనే పరిష్కారం చూపిస్తానని అంటుంది.

నేను మీ శ్రేయోభిలాషిని

వదిలేయండి దీప ఇది నా కుటుంబ సమస్య అంటే మీరు నా కుటుంబానికి సమస్య వస్తే శ్రేయోభిలాషిని అన్నారు. ఇప్పుడు నేను కూడా మీ శ్రేయోభిలాషిని. మీరు వదిలేయండి నేను చూసుకుంటానని హామీ ఇస్తుంది. శ్రీధర్ కూతురి గురించి బాధపడతాడు. నిన్ను ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా పంపించడం మంచిదని అనిపిస్తుంది.

నా మాట విని నువ్వు శ్రీకాంత్ ని పెళ్లి చేసుకో. అమెరికా వెళ్ళి అక్కడ ఏదో ఒక జాబ్ చేసుకోండి. మేం వైజాగ్ వెళ్లిపోతాం. నాన్నకు నువ్వంటే చాలా ప్రేమ. ఎల్లుండి నీకు, శ్రీకాంత్ కు పెళ్లి. కాశీ ఈసారి ఇంటికి వస్తే తర్వాత వాడు స్టేషన్ లో ఉంటాడు. ఈ పెళ్లి ఆగుతుందని ఆశపడకు జరుగుతుందని గట్టిగా చెప్తాడు.

శ్రీధర్ ని నిలదీసిన కాంచన

వీళ్ళ మాటలకు కాశీ దొంగచాటుగా వింటాడు. ఎలాగైనా పెళ్లి ఆపాలని అనుకుంటాడు. శ్రీధర్ కాంచన దగ్గరకు వస్తాడు. ఎప్పుడు ఆఫీసు గురించే కాదు ఇంటి గురించి కూడా ఆలోచించమని చెప్తుంది. మీలో మార్పు వచ్చింది చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇంటి విషయాలు పట్టించుకోవడం లేదు ఇంట్లో సరిగా ఉండటం లేదు.

అబ్బాయి కోలుకున్నాడు ఆ సంతోషం కూడా మీలో లేదు. ఈ మధ్య రాత్రి పూట కూడా రావడం లేదు. ఆఫీసులో బిజీ అంటున్నారు ఏమైందని కాంచన నిలదీస్తుంది. దీంతో శ్రీధర్ కోపంగా వెళ్ళిపోవడంతో కాంచన బాధపడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.