Karthika deepam september 20th: కావేరితో నిజం చెప్పిన శ్రీధర్, స్వప్నకు శ్రీకాంత్ తో పెళ్లి, దీపను పొడిచిన నరసింహ?
Karthika deepam 2 serial september 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్, కాశీ ఎవరు అనే విషయాల గురించి శ్రీధర్ కావేరికి నిజం చెప్పేస్తాడు. ఈ పెళ్లి జరిగితే కాంచన చచ్చిపోతుందని అంటాడు. స్వప్నతో శ్రీకాంత్ పెళ్లి జరిగేలా కూతురిని ఒప్పించమని కావేరితో చెప్తాడు.
Karthika deepam 2 serial today september 20th episode: శ్రీధర్ తన పరిస్థితిని తలుచుకుని తిట్టుకుంటాడు. నవగ్రహాలు నామీద పగబట్టాయి. కాశీ దాసు కొడుకు అవడం ఏంటి? దీప నా కొడుక్కి సేవలు చేస్తుంటే నేను ఇక్కడ ఉండటం ఏంటో ఏమి అర్థం కావడం లేదని అనుకుంటాడు. కావేరీ శ్రీధర్ తో మాట్లాడటం కోసం వస్తుంది.
కాశీ నా మేనల్లుడు
కాశీ నచ్చకపోవడానికి కారణం ఏంటని అడుగుతుంది. నిజం తెలిస్తే తట్టుకోలేవని అంటాడు. ఆ అబ్బాయికి ఆస్తి లేదని ఆలోచిస్తున్నారా అని అంటుంది. కాంచన చచ్చిపోవడం నీకు ఒకేనా? నా కుటుంబం రెండు ముక్కలై అందరూ నా మొహం మీద ఉమ్మి వేయడం నీకు ఒకేనా? అని అడుగుతాడు.
కావేరి కంగారుగా ఏమైందని అంటుంది. మా అత్త పారిజాతం కొడుకు దాసు ఉన్నాడు. దాసుకు కొడుకు ఉన్నాడు వాడి పేరే కాశీ అని చెప్పడంతో కావేరీ షాక్ అవుతుంది. స్వప్న ప్రేమించింది నా మేనల్లుడిని. స్వప్నకు యాక్సిడెంట్ జరిగితే కాపాడిన కార్తీక్ ఎవరో కాదు నా కొడుకు అనడంతో కావేరి షాకింగ్ గా చూస్తుంది.
ఎల్లుండే స్వప్న పెళ్లి
స్వప్న ఎవరో కార్తీక్ కి తెలుసా అని అంటే తెలియదు కానీ దీపకు తెలుసు అంటాడు. ఇప్పుడు కాశీకి స్వప్నకు పెళ్లి చేస్తే మన గురించి అందరికీ తెలుస్తుందని కావేరీ భయపడుతుంది. ఈ పెళ్లి నేను వద్దని చెప్పడానికి కారణం అదే. ఈ విషయం తెలిస్తే కాంచన చచ్చిపోతుంది. నా కొడుకు నన్ను ఎప్పటికీ క్షమించడు.
నిజం తెలిస్తే నా తండ్రి ఇలాంటి వాడా అని స్వప్న కూడా అసహ్యించుకుంటుంది. ఒక భార్యను పోగొట్టుకుని ఇద్దరి పిల్లలతో ఛీ అనిపించుకునేలా చేసే ఈ పెళ్లి చేయడం అవసరమా అని అడుగుతాడు. ఎల్లుండి శ్రీకాంత్ తో పెళ్లి అవగానే మీరు వైజాగ్ వెళ్లిపోండి నేను అక్కడికి వస్తూ ఉంటాను.
స్వప్న, కాశీకి గుడిలో పెళ్లి
ఏదో ఒకటి చేసి స్వప్న మనసు మార్చమని చెప్తాడు. అందుకు కావేరి ఒప్పుకుంటుంది. ఏం జరిగినా నిజం మాత్రం బయటపడటానికి వీల్లేదని అంటాడు. కార్తీక్ స్వప్న ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లో ఉందని టెన్షన్ పడతాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు నిజం మీ అమ్మకు చెప్పేయమని దీప అంటుంది.
దీప మాటలకు కార్తీక్ టెన్షన్ మరింత పెరుగుతుంది. నా ప్లేస్ లో మీరు ఉంటే ఏం చేస్తారని కార్తీక్ అడుగుతాడు. కాశీ, స్వప్నకు ఏదో ఒక గుడిలో పెళ్లి చేసి తీసుకొచ్చి నిజం చెప్పేసే దాన్ని అని అంటాడు. ఈ పెళ్లి జరిగితే ఒకటి కాదు చాలా నష్టాలు ఉన్నాయి. నువ్వు చెప్పింది సొల్యూషన్ కాదు. కానీ వేరే దారి లేదని అంటాడు.
స్వప్నతో పెళ్లి ఆపేయ్
కాశీ ఏమైనా చేస్తాడేమోనని కార్తీక్ టెన్షన్ పడతాడు. పారిజాతం దాసును కలిసి కాశీకి వేరే సంబంధం చూస్తానని చెప్తుంది. కుదరదు ఆ అమ్మాయి అమ్మానాన్న ఒప్పుకుంటే పెళ్లి చేస్తానని మాట ఇచ్చానని చెప్తాడు. కాశీ ప్రేమించిన పిల్ల ఎవరో కాదు శ్రీధర్ బావ కూతురు అనగానే దాసు సంతోషంగా ఉంటాడు.
నా మేనకోడలిని ప్రేమించి మంచి పని చేశాడని ఆనందపడతాడు. ఆ పిల్ల శ్రీధర్ కూతురు కానీ కాంచన కూతురు కాదు. రెండో భార్య కూతురని చెప్పడంతో దాసు షాక్ అవుతాడు. ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా పెళ్లి ఆపేయమని పారిజాతం అంటుంది. అది అక్రమ సంతానం ఎందుకు చేసుకోవడం అంటుంది.
జ్యోత్స్న నాన్న అని పిలిచిందా?
పని మనిషి మెడలో తాళి కట్టిన దాన్ని నాకు అలాంటి అభ్యంతరాలు లేవని అంటాడు. కాశీతో ఆ పిల్లకు పెళ్లి జరిగితే శ్రీధర్ రెండో పెళ్లి విషయం బయటపడుతుంది. ఈ విషయం శివనారాయణకు తెలిస్తే తన పరువు తీసిన కుటుంబానికి మనవరాలిని వాళ్ళ ఇంటికి కోడలిగా పంపిస్తాడా?
దీని వల్ల నష్టపోయేది నేను. బిడ్డలను మార్చి ఇంత కష్టపడింది నీ కూతురిని ఆస్తికి వారసురాలిని చేయాలని. నీ కూతురు కోసం ఇది కూడా చేయలేవా అని పారిజాతం అడుగుతుంది. తండ్రి అనే గౌరవం జ్యోత్స్నకు లేదు కదా అంటాడు. నేనే నాన్న అని తెలుసు ఒక్కసారి కూడా నన్ను నాన్న అని పిలిచిందా అంటాడు.
దీపను పొడిచిన నరసింహ
వద్దు కొత్త పిలుపులు. దాన్ని సుమిత్ర కూతురిగానే ఉండనివ్వు అని పారిజాతం చెప్తుంది. నా కూతురికి మనసు లేదని అంటాడు. నువ్వు తొందరపడితే నీ కూతురు పెళ్లి ఆగిపోతుంది. ముందు దీని పెళ్లి అయిపోతే తర్వాత ఆ పిల్లతో పెళ్లి చేసి కుటుంబంతో కలిసేలా చేస్తాను.
కొద్ది రోజులు పెళ్లి వాయిదా వేద్దామని కాశీతో చెప్పమని పారిజాతం అడుగుతుంది. అందుకు దాసు ఒప్పుకుంటాడు. దీప నడుచుకుంటూ వెళ్తుంటే నరసింహ ముసుగులో ఫాలో అవుతూ వచ్చి వెనుక నుంచి పొడిచేస్తాడు. చచ్చింది దీప చచ్చిపోయిందని తెగ సంతోషపడతాడు.
కాసేపటికి అది కల అని అర్థం చేసుకుంటాడు. అప్పుడే నిజంగా దీప నరసింహ ఉన్న వైపు నడుచుకుంటూ వస్తుంది. దీపకు ఎదురు నిలబడి తనని పొడవబోతే అడ్డుకుంటుంది. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.